వినాలన్నా … చూడాలన్నా భయపడే పాట -1

ఇలాంటి పాటలు కూడా ఉంటాయా  అని ఆశ్చర్య పోకండి. ఈ పాట ని వింటే మీరు కూడా ఒప్పేసుకుంటారు  అలాంటి పాటలు ఉంటాయని. “తారే జమీన్ పర్ ” చిత్రం లో  “మై కభి  బత లాతా   నహీ.. పర్  అంధేరే  సే  డర్  తా  హూ  మై  మా .. మేరి మా…” అన్న పాట ఆ కోవకి చెందినదే. కొడుకుని బోర్డింగ్ స్కూల్లో అయిష్టంగా వదిలి వెళ్ళిపోతున్న తల్లి.. తల్లి వెళ్లి పోతుంటే నిస్సహాయంగా చూస్తున్న కొడుకు.. వారిద్దర్లో సుడులు తిరుగుతున్న దుఖం.. రెక్కల కింద  హాయిగా  పెరిగిన బిడ్డని ఒక్క సారిగా బయటి  ప్రపంచంలో  వదిస్లేస్తే  ఆ బిడ్డకి  ఏమౌతుందో  అన్న దుఖం … కంటికి రెప్పలాగా చూసుకున్న  తల్లి దూరమౌతుంటే  వెళ్ళోద్దూ   అని అరవాలనుకున్నా …. గొంతు పెగలని దుఖం.. ఆ సంఘర్షణల సజీవ రూప శిల్పం ఈ పాట.

ఇందులో ఆ రెండు పాత్రల్లో ….పేరెంట్స్ గానో, బిడ్డలగానో… ఎవరో ఒకరిగా మనం  ఎప్పుడో ఒకప్పుడు అయ్యే సందర్భం జీవితం లో వస్తుంటుంది.. అలాంటి సమయంలో ఈ పాట గుర్తు తెచ్చుకోకండి.. తట్టుకోలేరు.. అందుకే ఈ పాటని కేవలం మీకు పరిచయం చేసి వదిలేస్తున్నాను ..


Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

2 Responses to వినాలన్నా … చూడాలన్నా భయపడే పాట -1

 1. rajesh says:

  Just saw the whole movie.
  Very nice movie…

  thanks for reminding it again.

 2. బిడ్డలు చిన్నగా ఉన్నప్పుడే కాదండీ .. వారికి యుక్త వయస్సు వచ్చినా సరే ..ఆ బిడ్డకి దూరంగా ఉండవలసిన సమయం వస్తే ప్రతి కన్న తల్లి అలాగే కదిలిపోతుంది. ఈ వీడియో లో దృశ్యం లాంటి దృశ్యం లో నేను రెండు సార్లు అంతకన్నా ఎక్కువ గా కదలిపోయాను.

  మరీ గడచినా ఆగస్ట్ మాసంలో మా నిఖిల్.. వెళుతున్నప్పుడు.. చెక్ ఇన్ అయి లోపలికి వెళుతూ..లిఫ్ట్ వరకు వెళ్లి వెనక్కి వెనక్కి చూసుకుంటూ..వెళుతున్న దృశ్యమే..నాకు గుర్తుకు వచ్చింది. 265 కిలోమీటర్ల దారి ప్రయాణంలో నేను కన్నీటి మయం లో తడచిపోయాను. నాలుగు ఐదు గంటల తర్వాత ఇంటికి వచ్చాక మొబైల్ చూసుకుంటే మెసేజ్. దుబాయి ఎయిర్ పోర్ట్ నుండి.. ఫ్లైట్ మారే సమయంలో .. అమ్మా ! ఏడవకు ఒక వన్ ఇయర్ లో వచ్చేస్తాను కదా!నువ్వు అలా ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. మరి ఇక్కడ నన్ను ఎవరు ఒదార్చుతారు ..అని.

  మళ్ళీ నాకు ఆసంగతి గుర్తుకువచ్చింది. నిన్న అందుకే కామెంట్ పెట్టలేక పోయాను.

  నైస్ పోస్టింగ్ !. థాంక్ యూ రామకృష్ణ గారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s