అనగనగా ఓ నాన్న..

ఆ నాన్న కో మూడేళ్ళ కూతురు. నర్సరీలో చేర్పించాడు.. నర్సేరీ లో అడ్మిషన్ పొందాక, తను రోజూ ఇంటి వెలుపల  నాలుగు గంటలు ఉండాల్సిన పరిస్థితి… వొంటరిగా  (నర్సేరీలో ఉన్న మిగతా వాళ్ళను పరిగణనలోకి తీసుకోకుంటే) . వొంటరిగా… అమ్మో.. నా పాప అంటూ ఘోషించింది  ఆ తండ్రి హృదయం. నర్సరీకి వెళ్ళే రోజుకు వారం ముందు నుండీ మానసికంగా సిద్ధపడుతున్నారు ఆ తండ్రీ కూతుళ్ళు.

ఆ రోజు రానే వచ్చింది. సెకండ్ హ్యాండ్ సైకిల్ పై తనకో ముచ్చటైన  సీటు… కాళ్ళు పెట్టుకోటానికి సపోర్టు. ఆ సీటు పై ఆ పాప కూర్చుని, వాళ్ళ నాన్న సైకిల్ తొక్కుతుంటే… ఎంతో ఎత్తు నుండి ప్రపంచాన్ని చూస్తూ ధరహసించే మహా రాణిలా వుండేది.. కాని ఆ రోజు నర్సరీ కేళ్తుంటే  ఆ ఠీవి, ఆనందం   ఏవీ . …?

నర్సరీ వచ్చేసింది.. ఆ పాప సైకిల్ దిగింది.. లోపలి వెళ్తుందో లేదో అని ఆ నాన్నకి దిగులు.. కాని ఆ పాప ఏదో స్థిర నిర్ణయానికి వచ్చినట్లుగా గేటు దగ్గరకు వెళ్లి… ఆ నాన్న వైపు ఓ చూపు చూసి చెయ్యి ఊపి, ముఖం పై అలుముకుంటున్న దిగులు  మేఘాలను కనిపించనీయకుండా  లోనకి పరిగెత్తింది..

తన దిగులుని చూసి ఎక్కడ నాన్న బాధ పడతాడో అని ఆ పాప ఆ క్షణంలో పడ్డ తాపత్రయం తెలిసిన ఆ నాన్న మనసూ కాసేపు  అచేతనమై పోయింది..

 

Advertisements
This entry was posted in తండ్రీ కూతుళ్ళ బంధం. Bookmark the permalink.

3 Responses to అనగనగా ఓ నాన్న..

  1. అనుబందాల గాడతని ఆవిష్కరించిన దృశ్యాలని పరిచయం చేస్తున్నారు. బాగుందండి. అప్పుడప్పుడు ఇలాటివి తప్పని సరిగా చూడాలి . మరీ పాషాణాలుగా మారి.. ఎక్కడికో తెలియని అంతులేని పయనం సాగిస్తున్నాం కదా! ఇంతకీ ఇది ఏ చిత్రం లో సన్నివేశం అండీ ?

  2. Situation like stated above will occur in every person’s life,who maintains humanrelations with sincere love&affection.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s