ఆనాటి రేడియో జ్ఞాపకం- నవలా స్రవంతి

 

కొన్ని జ్ఞాపకాలు గుర్తు రాగానే, ” అబ్బ .. ఆ రోజులే వేరు.. అందులోని హాయే వేరు..” అని అనిపించక మానదు.. అలాంటి ఓ స్మృతి శకలమే, అప్పట్లో అంటే 1970ల  చివరి సంవత్సరాలలో నేను వినే రేడియో కార్యక్రమం- నవలా స్రవంతి..  మా వూరికి కడప కేంద్రం నుండి ప్రసారమయ్యే కార్య క్రమాలు బాగా స్పష్టంగా వినపడేవి.. రాత్రి పూట త్వరగా భోజనం చేసాక , రాత్రి ఎనిమిది నలభై ఐదు కు కడప కేంద్రం లో వచ్చే కార్యక్రమం “నవలా స్రవంతి’ ని వినటం అలవాటయ్యింది. ఏదైనా మంచి నవలని ఆ కార్యక్రమంలో చదివి వినిపించే వారు. చదవటం లో కూడా స్పష్టత ఉండేది. నవలలో రచయిత వ్యక్తీకరించే భావాలను ప్రతిబింబించేలా చక్కటి modulation తో పఠి౦చేవారు..  రోజూ పదిహేను నిమిషాలు ప్రసారమయ్యేది. అలా నవల పూర్తయ్యే వరకూ రోజూ ఈ పఠన కార్యక్రమం వుండేది.

ఆ కార్యక్రమంలో అలా ప్రసారమైన ఓ నవల పిలకా గణపతి శాస్త్రి గారు రచించిన నవల “గృహిణి”. ఓ మహిళా వ్యాఖ్యాత (మీలో ఎవరికైనా వారి  పేరు తెలిస్తే తెలుపగలరు) ఆ నవలను ప్రతి రోజూ పఠి౦చేవారు. వారు చదువుతుంటే ఆ నవలలో అందరూ లీనమవ్వాల్సిందే.. అంత చక్కగా చదివే వారు. ఆ ఒక్క  నవలని మాత్రం రోజూ వదలకుండా వినే వాడిని ఆ ప్రోగ్రాంలో. నా ఆసక్తి గమనించి నాతో పాటు ఇంకో ఇద్దరు కూడా వినటం మొదలెట్టారు. ఓ రోజు ఏదో పని మీద తిరుపతి వెళ్ళాల్సి వచ్చి ఆ రోజు నవలా భాగం వినలేక పోయాను. నాతో పాటు వినే వారు శ్రద్ధగా విని, మరుసటి రోజు ఇంటికి వచ్చాక నేను మిస్ అయ్యిన ఆ నవలా భాగాన్ని చెప్పారు. అంతగా ఆసక్తి కలిగించింది ఆ నవల.

పుస్తక పఠనం అరుదై పోతున్న ఈ రోజుల్లో మళ్ళీ ఎందుకో గతించిన ఆ క్షణాలు మళ్ళీ వస్తే బాగుండును అనిపిస్తుంది.

 

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

7 Responses to ఆనాటి రేడియో జ్ఞాపకం- నవలా స్రవంతి

 1. Sarath "kaalam' says:

  నేను కూడా అప్పుడప్పుడూ వినేవాడిని అనుకుంటా.

 2. అద్భుతమైన జ్ఞాపకం గుర్తుచేశారు మాష్టారూ. నేను నాగార్జునసాగర్ లో ఉండే రోజుల్లో (1980-83) ఈ నవలా స్రవంతి వింటూ రాత్రి భోజనం చేశేవాడిని. రాత్రి పూట ఎనిమిదీ నలభై ఐదుకి పావుగంట సేపు వచ్చేది. నేను విన్న మొదటి నవల కొడవటిగంటి కుటుంబరావుగారి “చదువు” నవల. ఆ చదివినాయన ఎవరో గాని అద్భుతమైన గళం, చక్కటి చదివే పధ్ధతి. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో పనిచేసే వాళ్ళను అనేకమందిని అడిగాను కాని వాళ్ళెవ్వరికీ ఆయనెవరో తెలియదు, అసలు ఆ కార్యక్రమమే తెలియదు. ఆకాశవాణి వారి ఆ నవలాస్రవంతి కార్యక్రమాలన్ని కలిపి ఆడియో బుక్స్ గా వేస్తే ఎంత బాగుండును. ఇది ఒక కల. ఆకాశవాణి గుమాస్తాలు ఆ టేపులన్నీ ఎప్పుడో తుడిచి ఆవతల పారేసి వాళ్ళ బీరువాలు “శుభ్రం” చేసేసుకుని ఉంటారు

 3. రామకృష్ణ గారు నమస్తే! 70 ల చివరిలో అయితే నాకు తెలియదు .. కానీ 85 తర్వాత కూడా నవలా స్రవంతి కొనసాగింది. నేను వినే దానిని. ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారాలు ..విజయవాడ వరకు వినబడతాయి. ఇప్పటికి నేను వింటూనే ఉంటాను. ఇప్పుడు కథా స్రవంతి అనే కార్యక్రమం కొనసాగుతుంది.ఈ రోజు ఉదయం 08 .35 to 09 .00 వరకు మల్లె మాల గారి కథ పరిచయం జరిగింది.
  ఆకాశవాణి విజయవాడ కేంద్రం తర్వాత ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారం చేసే సాహితి కార్యక్రమాలు చాలా బాగుంటాయి. అత్యంత శక్తివంతమైన ట్రాన్స్ మీటర్ కల్గి ఉండటంవల్ల అటు కర్నాటక రాష్ట్రం లోను..ఇటు ఆంద్రప్రదేశ్ లో కరీంనగర్ జిల్లావరకు..వరంగల్,ఖమ్మం జిల్లలో వరకు ,ఇటు విజయవాడ వరకు కడప ప్రసారాలు వినబడతాయి వీలయితే వినండి.
  ఇక నాకు తెలిసి మంజులాదేవి,వనజా రెడ్డి అనే మహిళా ఏనౌన్సర్ లు ఉన్నారు. మంజుల దేవి గారిది.. మంచి వాయిస్. అలాగే..మోహన్ రమణ కుమార్ ,జే.పుష్పరాజ్ గార్లు మంచి వాయిస్.
  జే.పుస్ఫరాజ్ సర్ వాయిస్..చాలా బాగుంటుంది. వారు.. మహాత్మా గాంధి సత్యాన్వేషణ భావయుక్తంగా చదివి వినిపిస్తుంటే.. శ్రోతలు లీనమై వింటారు. అలాటి మాడ్యులేషన్ వారిది.
  ఇప్పుటి రవి కుమార్ రెడ్డి గారు.. మంచి సాహిత్య పిపాస కల్గిన ఎనౌన్సర్.
  తిరుపతి వరకు కడప ప్రసారాలు వినబడతాయి తప్పకుండా వినే ప్రయత్నం చేయండి.
  ఆకాశ వాణి ఎనౌన్సర్ లను పరిచయం చేసే “వాచస్పతి ” అనే పుస్తకం వచ్చింది.
  నేను త్వరలో.. గృహిణి ని చదివి వినిపించిన వారి వివారాలు కనుక్కుని మీకు తెలియపరుస్తాను.
  పూర్వంలా రేడియో..వైభవం గా వెలిగే రోజులు వస్తాయని ఆశిద్దాం.

  • mhsgreamspet says:

   వనజ గారు…మంచి సమాచారమిచ్చారు. ధన్యవాదాలండి.. వీటి గురించి మీరు మీ బ్లాగు లో కూడా అందరితో పంచుకోగలరు.. అందరికి తెలియని ఎంతో ఉపయుక్తమైన సమాచారమిది.
   నిజం చెప్పాలంటే.. ఈ యాంత్రిక జీవనం మూలంగా చాల కాలంగా నాకిష్టమైన రెండు పనులు చేయలేకపోతున్నాను. ఒకటి పుస్తక పఠనం.. ఇంకోటి రేడియో వినటం.. ప్రయత్నించాలి.

   • రామకృష్ణ గారు..నేను శబ్దాలయ బ్లాగ్ ని అందుకే ప్రారంభించాను. అది ఆరంభ శూరత్వంగా మిగిలిపోయింది. రేడియో కార్యక్రమాలపై కేవలం నా అభిప్రాయం మాత్రమే కాకుండా ఇతర శ్రోతల అభిప్రాయాలని పంచుకుంటే బాగుంటుందని.. నాకు తెలిసిన శ్రోతలందరికి వారి అనుభవాలు తెలియజేస్తే బాగుంటుందని చెబుతూనే ఉంటాను. కార్యక్రమాల పట్ల వారి వారి స్పందన,వారి రేడియో అనుభవాలు పంచుకుంటూ.. శబ్దాలయ బ్లాగ్ నిర్వహించాలని నా ఆకాంక్ష. నా మెయి ల్ అడ్రెస్స్ కి పంపితే..నేను వాటిని ప్రచురించగలను. అలాగే.. అవకాశం లేని వారు ఉత్తరం ద్వారా తెలిపినా కూడా.. నేను స్కాన్ చేసి.. ఈ బ్లాగ్ లో జతపరచగలను. రేడియో శ్రోతల కొరకు..ఈ బ్లాగ్. ప్రత్యేకం.
    ముందు మా మా లిజనర్స్ అసోషియేషన్ వరకే అనుకున్నాను. అందరికి ఏమాత్రం ఆసక్తి లేకపోవడం వల్ల అలా శభ్దాలయం మిగిలిపోయింది. మాగంటి వంశీమోహన్ గారు,సాహిత్య అభిమాని బ్లాగ్ వారు..చాలా విషయాలు,విశేషాలు పంచుకుంటారు. అందుకు సంతోషంగా ఉంటుంది కూడా. వారికి మీ బ్లాగ్ ముఖంగా ధన్యవాదములు తెలుపుతూ.. ..మీకును..ధన్యవాదములు.

   • mhsgreamspet says:

    నేను తప్పకుండా శబ్దాలయ బ్లాగు కి నా రేడియో జ్ఞాపకాలని షేర్ చేసుకుంటానండి. అంతరించిపోతున్న రేడియో సంస్క్రుత్ని పునరుజ్జేవింపజేస్తున్నందుకు అభినందనలు..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s