ఊర్ధ్వ ఉపరితలం లో వినాల్సిన కొన్ని పాటలు – 1

ఊర్ధ్వ ఉపరితలం అని ఎందుకంటున్నానంటే.. ఆ పాటల్ని వినాలంటే మ్యూజిక్  డైరెక్టర్  ఎవరు… మంచి హిట్ నంబర్స్ ఇచ్చే వ్యక్తేనా.. పాటలో బీట్ బాగుందా.. మంచి రిచ్ లోకేషన్స్ లో చిత్రీకరించారా … గ్రూప్ సాంగా.. ఐటం నంబరా… లాంటి ఐహిక విషయాలన్నిటిని పక్కన పెట్టేసి ఆ పాటల్ని కేవలం వినాలి.. హృదయంతో … ఆ పాటల్లోని భావాన్ని ఆస్వాదించాలి.. ఆ పాటల్ని ఎక్కడ విన్నా… కళ్ళు మూసుకుంటే ఆ దృశ్య మాలిక… ఆ పాటల తాలూకు స్మృతుల దృశ్యాలు మీ కనురెప్పలను సుతారంగా స్పృశించాలి.

అలాంటి పాటలు, లెక్క పెడితే. సుమారు పది దాక తేలాయి నాకు. ఏ పాటలు వింటే ఓ అనిర్వచనీయమైన భావావేశానికి లోనౌతామో అలాంటి  పాటలు ఈ కేటగిరీ లోకి వస్తాయి..ఇలాంటి పాటలు ఇంతకు మునుపు పరిచయం చేసాను..

అలాంటి పాట ఇంకోటి ఈ రోజు మీ ముందుకు..

ఈ పాటకి ఓ ప్రత్యేకత ఉంది.. మూడు పాటలుగా ముగ్గురు గాయకులు పాడారు ఈ పాటని. పల్లవి అదే కాని చరణాలు వేరే.. ఉషా ఖన్నా సంగీత సారధ్యంలో పాడిన గాయకులూ రఫీ, మన్హర్, హేమలత.. రఫీ గారి పాట కాస్త ఫాస్ట్ గా వెళితే, మన్హర్, హేమలత ల పాటలు ఒక విధమైన స్లో మూడ్ లో సాగుతాయి.. నాకు స్లో వెర్షన్స్ రెండూ ఇష్టమే..ఆ పాట “ఆప్ తో ఐసే న థే” అనే చిత్రం లో
” తూ ఇస్ తరా మేరె జిందగీ మే శామిల్ హో…
జహా మై జావ్ … వహి లగ్ తా హాయ్ తేరి మేహెఫిల్ హో.”
అనే పల్లవి గల పాట.

పాట జల తరంగ్ తో మొదలౌతుంది ఆ బిట్ అంటే ఎంతో ఇష్టం.. ఈ పాట నేను మొదటి సారి విన్నప్పుడు, నాకు కేవలం గుర్తుండి పోయింది ఆ పాటలో నిబిడీకృతమైన  ఫీల్ అంతే.. ఆ పాట తాలూకు మిగతా విషయాలేవీ తెలియవు.. ఆ పాట వింటూనే మనసు ఆ ఊర్ధ్వ తలం లోకి వెళ్ళిపోయి ఆ పాటని ఆస్వాదించ సాగింది..

మీరూ ఆ పాట ఇక్కడ వినండి

మన్హర్ వెర్షన్

హేమలత వెర్షన్

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s