ఆర్మ్ చైర్ ఫిలాసఫీ- ఒక విశ్లేషణ

అంకం -1
మండుటెండ.. అప్పుడే రతన్  సుష్టుగా భోంచేసి తన బాన పొట్టను నిమురుకుంటూ, శ్రీమతి అందించిన కిళ్ళీని నములుతూ , సోఫాలో కూర్చుని టీ వీ లో వస్తున్న క్రికెట్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నాడు. బంతి బంతి కీ రతన్  ముఖ కవళికలు మారుతున్నాయి.. బంతి  బ్యాటు ని బీట్ చేసి వెళ్లి పోతే, అతని చిరాకు ఉవ్వెత్తున  ఎగసి పడుతోంది…” అర్రే… పాగల్… ఆ బాల్ ని అలాగేనా ఆడేది..బ్యాక్ ఫుట్ పై స్క్వేర్ కట్ చేయకుండా వదిలేసాడు.. ఎలా బ్యాట్స్ మాన్ అయ్యారు ఇలాంటోళ్ళు ..” అన్నాడు నోట్లో పొంగుతున్న కిళ్ళీ లాలా జలం తుంపర్లు బయటికి విరజిమ్ముతూ.
అదే టెంపో లో.. బౌలర్ ని కూడా వదల లేదు రతన్ లాల్..”ఈ టైం లో ఫుల్ టాస్ వేస్తే ఎలా.. బాల్ ని యార్క్ చేయాలి.. లేదా కరెక్ట్ గా బ్లాక్ హోల్ లో వేయాలి.. కనీసం స్లో బౌన్సర్ అన్నా వేయాలి..”
“ఓ దేఖ్.. ఎలా పరిగెడుతున్నాడో  చూడు… ఆ బాల్ ఆపాలంటే.. ఫుల్ గా డైవ్ చేయోచ్చు కదా..నేనే వెళ్తే ఆ బౌండరీ రాకుండా ఆపే వాడ్ని.. ..”
ఇలా సాగుతోంది రతన్  వ్యాఖ్యానం.. ఏ. సి లో చెమట చిందకుండా.. పొట్ట పై సొట్టలు పడకుండా మాట్లాడుతూ ..జేవితం లో ఎన్నడూ బ్యాటు ముట్టక పోయినా.. బంతిని తాకక పోయినా… మండుటెండలో క్రికెట్ ఆడుతున్న ఆ రెండు జట్లనీ ఓ మోస్తరు నుండి భారి మొత్తం దాక ఉతికి ఆరేస్తున్నాడు అరివీర భయంకర రతన్  ..

************************
అంకం – 2
రోడ్డు మీద బండి స్లిప్ అయ్యి మూర్చ పోయాడో వ్యక్తి.. పక్కనే కొట్టు దగ్గర ఉన్న వ్యక్తుల మధ్య సంభాషణ..
“అయ్యో పాపం చూడండి  ఎలా పడి పోయాడో ఆ పెద్దాయన..”
“అవునండీ.. చూడండి.. ఒక్కరంటే ఒక్కరు కూడా అతన్ని పట్టుకు లేపట్లేదు..అందరూ ఏమి పట్టనట్లు వెళ్లి పోతున్నారు.. అస్సలు సోషియల్ రేస్పాంసిబిలిటి లేకుండా పోయిన్దండీ మన జనాలకి..”
“ఇలాంటి విడ్డూరం  నేనూ ఎక్కడా చూడలేదండి. మా వూళ్ళో అయితేనా… ఇలా జరిగితే 108 బండి నిమిషాల్లో వచ్చేస్తుంది..”
“నిజమేనండి.. కాలం బాగా మారి పోయింది.. ప్రజల్లో మరీ indifferent attitude వచ్చేస్తోంది..”
“కనీసం ఎవరో ఒకళ్ళు 108 కన్నా ఫోన్ చేయోచ్చు కదండీ.. మానవత్వానికే కరువొచ్చిందా..”
“నిజమేనండి.. మానవత్వం మంట కలిసిపోతోంది.. సరే ఉంటానండి.. సినిమాకి వెళ్తున్నా.. త్వరగా వెళ్తేనే టికెట్లు దొరుకుతాయి  ….”
“అలాగేనండి.. నాకూ ఇంటి కెళ్ళే బస్ వచ్చేస్తోంది..సెలవు మరి ”

 

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

3 Responses to ఆర్మ్ చైర్ ఫిలాసఫీ- ఒక విశ్లేషణ

  1. ఇతరులకు చెప్పడానికే నీతులు ఉన్నాయి,ఉచిత సలహాలు ఉన్నాయి, మానవత్వం,,సామాజిక భాద్యత మాటలున్నాయి. క్రియా రూపం దాల్చని ఆదర్శాల కబుర్లు గురించి.. భలే ప్రస్తావించారండి.కూల్ కూల్ .. 🙂

  2. Every body thinks that social responciability lies with others, when ever any untoward incident occurs.But fails in their responciability&comments on others very easily. from the word cup of 1983,when the tv channels starded2telecast live matches, even a bedi worker, rickshaw puller etc… People,who neves touch any kind of cricket kit in their life passon comments on all cricket players,which we can’t digest..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s