ఈ కథకి మీరే పేరు పెట్టండి

(ఈ కథ రాసేపుడు ఎందుకో ఏక బిగిన రాసేసి పోస్ట్ చేస్తున్నాను, ఏ మాత్రం రివిజన్ చేయకుండా. పేరు మీరే సూచించగలరు)

ఏమిటో.. నేను గుర్తెరిగి నప్పటి నుండి… ఆ ఇద్దరు పిల్లలని గమనించటం పరిపాటి ఐపోయింది..నాకు బాగా అలంకరణ చేసారు… నా చుట్టూ  అరుగు కట్టారు.. నా వద్దకు ఎందఱో వచ్చిపోతుంటారు.. కొందరు పేకాడటానికి.. కొందరు దమ్ము లాగటానికి.. ఇంకొందరు… రాత్రుళ్ళు ఇంట్లో వాళ్లకు తెలియకుండా మందు కొట్ట టానికి .. ఇలా అందరినీ భరించాలి తప్పదు.. దేవుడు నన్ను కదలకుండా ఉండేలాగా సృష్టించేడు.. వీరిలో ఎవరిని చూసినా కలగని ఆనందం నాకు ఆ ఇద్దర్నీ  చూస్తే మాత్రం కలుగుతుంటుంది.. నా ఈడు వారేమో అందుకే వారేం మాట్లాడినా నాకూ నచ్చుతుంది. వారి సంభాషణ అంతా ఆటల మీదే వుంటుంది..

“ఈ రోజు మా స్కూల్లో క్రికెట్ ఆడాం రా.. మంచి మజా వచ్చింది..”
“మా స్కూల్లో ఈ రోజు కొత్త టీచెర్ వచ్చారు.. ఎన్ని కథలు చెప్పారో..”
………………………………………………………………….
” ఈ రోజు మా ఇంట్లో త్వరగా రమ్మన్నారు.. రాత్రికి ఎవరో బంధువులు వస్తారట.. ”
” సరే బయల్దేరు మరి..”
…………………


ఐదు సంవత్సరాలయ్యాయి..నా మెదడు బాగా పదునెక్కింది.. ఎంత మందిని చూస్తుంటానో…  ఆ ఇద్దరు ఇప్పటికీ నా దగ్గరికి వస్తుంటారు.. కాని వారానికో సారి… అదీ ఆది వారాలు.. కాని ఇంతఃకు మునుపు లాగ ఆడుకోవట్లేదు..ఉన్నా కాసేపే..
“ఒరేయ్.. నిన్న ఎక్కువ  హోం వర్క్ ఇచ్చార్రా.. అస్సలు టైం దొరకటం లేదు.. ఇంతఃకు మునుపు ఎంత చక్కగా ఆడుకునే వాళ్ళమో కదా..”
“నిజమేరా.. నా పరిస్థితీ  అంతే..వచ్చే నెలే డిగ్రీ ఎంట్రన్స్ పరీక్షలు.. అమ్మ, నాన్న ఎక్కడికీ వెళ్ళోద్దంటున్నారు… అసలు ఫ్రీడం లేదు..”

………..

ఇంకో మూడు  సంవత్సరాలు యిట్టె గడిచిపోయాయి.. ఆ ఇద్దరూ అడపా దడపా వస్తుంటారు.. బాగా పెద్దవారై పోయారు. గడ్డాలు … మీసాలు.. జీన్ ప్యాంట్..లూస్ చొక్కా..
“హాయ్.. ఎలా వున్నావ్ రా.. కాలేజ్ vacations ఇచ్చారా..”
“అవున్రా.. నీ పనే హాయి రా… ఈ ఊళ్లోనే చదువు కుంటున్నావ్.. నాకు హాస్టల్.. చదువు..చెప్పు.ఎలా వుంది లైఫ్”
“just doing great man .. మా కాంపస్ అంతా ఫాస్ట్ లైఫ్. జీవితం అంటే ఇంత కలర్ఫుల్ గా ఉందా అనిపిస్తుంది..అప్పుడప్పుడూ.. ”
….
మరో రెండు సంవత్సరాలు..అయ్యాయి.. వారి జాడ లేదు చాల కాలంగా.. నాకు బోర్ కొడుతోంది.. ఏమయ్యిందో …ఆ రోజు హటాత్తుగా వచ్చారు ఆ ఇద్దరూ. ఇద్దర్లో ఒకతను మరీ దిగాలుగా వున్నాడు.
“It is okay రా… మామూలు మనిషివి కా..ఇలాంటివి జరగటం మామూలే.. Just hold your nerve . తను కాక పోతే ఇంకొకరు.. నీ లాంటి మంచి మనిషిని పోగొట్టుకోటం దురదృష్టం..”
“ఏమో రా.. మరిచిపోలేక  పోతున్నా..ఈ depression నుండి బయటపడలేక పోతున్నా. అందుకే నిన్ను అర్జెంట్ గా రమ్మని మెసేజ్ చేసాను..సారీ రా.. నా బాధ నువ్వు తప్ప ఇంకెవరూ అర్థం చేసుకోలేరేమో..”
“ఒక మనిషి నిన్ను కాదంటే అదెంత బాధో నాకు అర్థమయ్యింది. కాని దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని అందంగా మలుచుకోటం నీ చేతుల్లోనే ఉంది..నువ్విలా క్రుంగిపోవటం..”
“నిజమే.. ఒక దారి మూసుకుంటే.. ఇంకో దారి వెంట వెళ్లక తప్పదు .. ఇదే జీవన ప్రయాణం.. నేను ప్రయత్నిస్తాను ..”
ఆ తరవాత కొన్ని రోజులు ఆ మిత్రులు రోజూ వచ్చేవారు.. రెండో మిత్రుడు కొద్ది కొద్దిగా తెప్పరిల్లినట్లే అనిపించింది. మళ్ళీ కనిపించటం మానేశారు..
…………
పదేళ్లయ్యాయి..
ఆశ్చర్యం మళ్ళీ ఆ ఇద్దరూ ప్రత్యక్షం. కాకపోతే ఇద్దరి దగ్గరా ఐదారేళ్ళ పిల్లలు..
“ఒరేయ్.. ఎంత కాలమైన్దిరా… ఇక్కడ ఇలా కలుసుకుని..పెళ్లి… పిల్లలు.. ఉద్యోగం.. బాధ్యతలు… అబ్బ జీవితం మరీ యాంత్రికమై పోయిందిరా..”
“మరే.. అదే అసలైన జీవితమంటే.. ఇక ఈ పిల్లలు ఎప్పుడు పెద్ద వాళ్లౌతారో.. వాళ్ళు ఎలా సెటిల్ అవుతారో..బాబోయ్ … ఇదెంత సుదీర్ఘ ప్రయాణమో… కదా.. ”
” మన సొంత ఇళ్ళు ఇక్కడే వున్నాయి కాబట్టి… ఇలా అప్పుడప్పుడైనా ఇలా కలుసుకుంటున్నాం… లేకుంటే.. మనం విడిపోయే వాళ్ళమేమో.”
……………..

ఇలా రెండు- మూడు సంవత్సరాల కోసారి వచ్చేవాళ్ళు..
కొంత కాలం తరవాత.. పెద్ద గ్యాప్.. ఇప్పుడు ఇలా కనిపించారు.. ముఖాలు  బాగా మారిపోయాయి..వృద్ధాప్యం చాయలు కనిపిస్తున్నాయి.. ఏమిటో నాకూ అలాగే అనిపిస్తోంది.. నాకూ ముసలితనం వచ్చేసిందా అని..
“ఒరేయ్.. ఎలా వున్నావ్ రా.. ”
“పిల్లలు విదేశాలకు వెళ్ళిపోయారు..తనూ వాళ్ళతోనే వెళ్ళిపోయింది.. ఉన్న ఊరిమీద ప్రేమ నన్ను ఇక్కడే వుంచేసింది.  ఏమిటో వంటరి తనం పట్టి పీడిస్తోంది..నాకేం గాని నీ సంగతేమిటి?”
“నా పరిస్థితీ అంతే.. ఇక అక్కడ ఉండలేక పోయాను. అందుకే ఇక్కడికి వచ్చేసాను.. ఈ చివరి రోజులైనా నీతో.. మళ్ళీ ఆ చిన్న నాటి జ్ఞాపకాలు పంచుకుందామని వచ్చాను..”
“ఇదే మన చివరి మజిలీ ఏమో కదా.. ఎన్ని గుర్తులు.. ఎన్ని జ్ఞాపకాలు.. తీపి.. చెడు అన్నీ..చివరికి మళ్ళీ ఇక్కడ  కలవగలిగాము”
………………………………..

కొంత కాలం గడిచింది..రోజూ కలుసుకునేవారు.. ఓ వారం రోజులు ఇద్దరూ రాలేదు.. కాని ఆ రోజు..అతడు ఒక్కడే వచ్చాడు..ముఖం లో ఏదో తెలియని బాధ..
వచ్చి నా వైపు చూస్తూ ఉండి పోయాడు.. నేను గమనిస్తున్నట్లు తెలుసుకున్నాడో ఏమో.. నా వైపు చూస్తుంటే … అతడి కళ్ళల్లో సుడులు..ఏ జ్ఞాపకాలు అతడిని తడిమాయో.. వాకింగ్ స్టిక్ సహాయంతో నా చుట్టూ కాసేపు నడిచాడు.. ఆ అరుగుని తడిమాడు.. కాసేపు నిశ్శబ్దం..
ఒక్కసారి ఉప్పెనలా పొంగింది దుఖం..
“ఒరేయ్… ఇన్నాళ్ళూ ఉండి నువ్వూ నన్ను వదిలి వెళ్ళిపోయావా… ఇక నేనెలా వుండగలనురా.. ”
విషయం అర్థమైన నాకూ ఏమిటో తెలియని ఆవేదన.. ఎన్నో ఏళ్ళుగా నా సమక్షం లో పంచుకున్న వారి స్మృతులు… ఓ చిత్రమాలికలా  కనపడసాగాయి..
“ఇక నేనిక్కడికి రానురా..ఈ కట్టే ఇక కాటికే.” అంటూ వెళ్ళిపోయాడు..

తను ఇక రాననేసరికి నాలోనూ ఏదో నైరాశ్యం…

ఏదో దూరాన మాటలు వినపడుతున్నాయి.. ఎవరో కార్లో దిగి నా వైపే వస్తున్నారు కొంత మంది కూలి వాళ్ళనేసుకుని..
వాళ్ళతో ఆ పెద్దాయన చెపుతున్నాడు..
“ఇక్కడ ఐదు అంతస్తుల apartments కట్టబోతున్నాం .రేపటికల్లా ఈ చెట్టు కొట్టేయండి..  పూర్తిగా వేళ్ళ వరకూ తీసేయండి…ఆ అరుగు కూడా తీసేయండి..”

Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

8 Responses to ఈ కథకి మీరే పేరు పెట్టండి

 1. chinni says:

  బాగుంది .రచ్చ బండ -రావిచెట్టు అని పెట్టండి:) లేక ఒక మాను వ్యధ బాగుంటుందేమో “నేను”అని రెండేళ్ళ క్రితం ఒక మాను గురించి రాసాను చూడండీ .

 2. archana says:

  I think…”Rachcha Banda”…..title is suitable…..

 3. raaja vaibhavaaniki raalukaalam

 4. krish says:

  చెట్టు, అరుగు, ప్రస్థానం, కథ, జీవితం,
  పేరేదైన కథ మాత్రం చాల బాగుంది.

  • mhsgreamspet says:

   chinni gaaru
   మంచి టైటిల్ సూచించినందుకు ధన్యవాదాలండీ .. మీరు చెప్పిన టపా chadvaledandee..ఈ సారి చదువుతాను.. 🙂
   archana, vanja gaaaru..
   మంచి టైటిల్ సూచించినందుకు ధన్యవాదాలండీ ..
   krish gaaru
   నా కథలోని mood ని చక్కగా catch చేసారు. ధన్యవాదాలు.

 5. Zilebi says:

  మారని కాలం మారిన మనుషులు

  చీర్స్
  జిలేబి.

 6. Story is nice. “Ravichettu krinda arugu”.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s