మీ కోసం పాటల ప్రశ్నలు – రేడియో సిలోన్ తరహా లో

అప్పట్లో రేడియో సిలోన్ లో రేడియో అక్కయ్య గారు మీనాక్షి పున్నుదురై గారు నిర్వహించే  తెలుగు పాటల కార్యక్రమం (సాయంత్రం మూడు పదిహేను నుండి మూడున్నర వరకనుకుంటాను) మీకు గుర్తుండే వుంటుంది కదూ..ఒక్కో రోజు కార్యక్రమంలో  ఏదైనా కామన్  తెలుగు పదం ఉన్న గీతాలను ప్రసారం  చేసే  వారు . ఆ  కార్యక్రమం మొదలయ్యిందంటే , ఆ రోజు చెప్పిన పదం ఉన్న పాటలేమిటా అని మనసు అలాంటి పాటల  వెంబడి పరుగులు తీసేది..

ఈ రోజు మీకు అలాంటి పని పెట్టదలచుకున్నాను .. కాని ఆగండాగండి … మీకు ఎక్కువ పని పెట్టాలని కొన్ని పాటలు నేనే ముందు ఇచ్చేస్తున్నాను. అవి కాకుండా ఇంకా ఇతర గీతాలలో ఆ పాదం వుంటే ఆ గీతాలను చెప్పగలరు..

ఓకే..అసలు సంగతికొద్దాం.. ఈ రోజు పదం ” మేఘం” (ఈ పదం అంటే నాకెందుకో చాల మక్కువ..మనిషి లోని ఎమోషన్స్ ని వ్యక్తీకరించగల పదం “మేఘం”)   నేను ముందే ఇచ్చేస్తున్న పాటల లిస్టు ఇదే..

1 . మేఘమా.. దేహమా… మెరవకే ఈ క్షణం (చిత్రం: మంచు పల్లకి)
2 . మేఘమా…నీలి..నీలి మేఘమా.. మెరవకే.. కురవకే.. నీలి నీలి మేఘమా (చిత్రం: బహుదూరపు బాట సారి)
3 . ఆకాశ దేశాన… ఆషాఢ మాసాన.. మెరిసేటి ఓ మేఘమా..  (చిత్రం : మేఘ సందేశం)
4 . ఇది మేఘ సందేశమో . అనురాగ సంకేతమో… (చిత్రం: ఏడంతస్తుల మేడ)
5 . నీలి మేఘమా.. జాలి చూపుమా..ఒక నిమిషమాగుమా.. (చిత్రం: ???)
6 . మేఘాలలో తేలి పొమ్మన్నది.. (చిత్రం: గులాబి …. ఇది నా మ్యూజిక్ ప్లేయర్ లో లేని పాట సుమీ..)

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

6 Responses to మీ కోసం పాటల ప్రశ్నలు – రేడియో సిలోన్ తరహా లో

 1. Neeli meghjamaa jaali choopumaa..song
  Ammaayila shapadam .. chitram lo paata.

 2. సందె పొద్దు మేఘం – నాయకుడు
  అమ్మంటే మెరిసే మేఘం, నాన్నంటే నీలాకాశం.. – ముగ్గురు మొనగాళ్లు
  ఏ మేఘం ఎప్పుడు చినుకవునో – LBW

 3. alakananda says:

  1. neeli meghalalo gali keratalalo
  2.oho meghamala..neelala meghamala
  3. merise meghamalika
  4. kadile meghama..kavita ragama
  5. kurulande megham virise
  ippatikive gurtu vachayi,inka patalu undavachu

 4. అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది (నువ్వే కావాలి)
  మేఘమా ఆగాలమ్మా.. వానలా కరుగుటకు (ప్రయాణం)
  కదిలే మేఘమా కవితా రాగమా కాళిదాస కమనీయ భావనా (లైలా)
  నీలి మేఘమా అంత వేగమా ఓ నిమిషం ఆగుమా (విలేజిలో వినాయకుడు)
  ఇక్కడ అందరూ చెప్పినవి కాక నాకు ఇప్పటికిప్పుడు గుర్తొచ్చినవి…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s