మనిషిని నియంత్రించాలంటే …

ఆదివారం కావటంతో ఆ గుడిలో ఆ రోజు రద్దీగా వుంది.. విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో వున్నవారు, విదేశాల నుండి వచ్చి మొక్కు తీర్చుకునే వారు యా రోజు ఎక్కువ గా కనపడుతుంటారు.  అంతకంతకూ జన సందోహం పెరుగుతూ వుంది.. ఆవరణ చిన్నది కావటంతో భక్తులను క్యూ ని పాటించటానికి గొలుసుల ద్వారా లైన్లు అప్పటికప్పుడు ఏర్పాటు చేసారు ఆలయ సిబ్బంది. రద్దీ ఎక్కువౌతూ ఉండటంతో, కొంత మంది గొలుసులను తొలగించుకుని  ముందు  వరసలోకి  తోసుకుంటూ వెళ్తున్నారు. వారిని చూసి అంతవరకూ బుద్దిగా క్యూ పాటిస్తున్న కొందరు గొలుసుల క్రింది  నుండి ముందు లైన్ల లోకి చొరబడటం మొదలెట్టారు. అసలే వేసవి తాపం, తొక్కిసలాట మొదలవటంతో  పరిస్థితి చేజారిపోతుందేమో అనిపించింది.

ఇంతలో, అదంతా గమనిస్తున్న ఆలయ పూజారులలో  ఒకరు  ఆ లైన్ల మధ్యకు  వచ్చారు. అందరినీ ఉద్దేశించి చెప్పటం మొదలెట్టేరు..” అందరూ దయ చేసి క్యూ ని పాటించండి. ఈ ఆలయ దర్శనం రెండు సార్లు చేసుకుని వెళ్ళినా అనుకున్నది జరగలేదని, కారణమేంటని  ఇంతకు మునుపు ఓ భక్తుడు నన్నడిగారు.. నేను వారిని  ఆలయ ప్రాంగణం లో ఏదైనా తెలిసి తప్పు చేసారా అని అడిగాను. బాగా ఆలోచించిన మీదట, క్యూలో లైన్ జంప్ చేసి ముందుకెళ్ళి దైవ దర్శనం చేసుకుని వెళ్ళానని చెప్పాడు. ఇలా  అధర్మ  రీతిలో దర్శించుకుంటే ఇష్ట కార్య సిద్ది జరగదని చెప్పాను. ఆ తరవాత ఇలాంటి అనుభవాలే చాల మందికి  జరిగాయి. కాబట్టి భక్తులు క్యూని  పాటించగలరు”

అది  విన్నాక , అంత వరకూ ఇష్టమొచ్చినట్లు క్యూలను దాటుతున్న జనాలలో కొద్దిగా మార్పు వచ్చింది.. ఓ అర గంట అయ్యేసరికి, అందరూ క్యూని సక్రమంగా పాటిస్తూ, అంత జన సందోహంలో ఎక్కడా అపశ్రుతి  రాకుండా చేయగలిగారు.

పాప భీతి వల్లనో , అంత దూరం వచ్చాక ఓ చిన్న తప్పు చేసి ఎందుకు  అనుగ్రహం కోల్పోవాలి  అన్న పరివర్తన రావటం మూలానో అందరిలో  మార్పు వచ్చింది. ఓ చిన్న మాటతో పరిస్థితిని చక్క దిద్దిన ఆ పూజారి ని మనసులో మెచ్చుకోకుండా ఉండలేక పోయాను. మనిషిని నియంత్రించాలంటే ఇలాంటి deterrents అప్పుడప్పుడూ అవసరమే కదా..?

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

One Response to మనిషిని నియంత్రించాలంటే …

  1. sveekay says:

    Cool Ram. I know what you are talking about. We visited that temple in our last visit to India and one of the priests was warning regarding pickpocketing:)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s