అనుకున్నామని…

‘మీ విజయ రహస్యమేంటి?’ అని  ఒక్కోసారి అడుగుతుంటారు కొందరిని, ఎందుకంటే  ఆ  సూత్రాన్ని  తాము  కూడా  గుడ్డిగా  పాటించేసి instant గా విజయాన్ని సాధించేయోచ్చని. కాని అలా సాధారణంగా జరగదు. ఒకే పరిస్థితి లో ఒకే stimulus కి భిన్న వ్యక్తిత్వాలు భిన్నంగా వ్యవహరిస్తాయి.అంతే కాదు.. కాలం మారే కొద్ది, అదే వ్యక్తి అదే పరిస్థితి ఎదురైతే,  ఇంకో పద్ధతి లో కూడా స్పందించోచ్చు. F = M . a అని భౌతిక శాస్త్రం లో మనం చదువుకున్నట్లుగా మానవ సంబంధాలు, వ్యవహారాలూ ఏవి ఒక నిర్దిష్ట సూత్రానికి లోబడి పని చేయవు.

ఉదాహరణకు చదువుకునే పిల్లలను  కాస్త మందలిస్తే, కొందరు దానిని సానుకూల దృక్పధం తో చూసి, తమ లోపాలను సరిదిద్దుకుని విమర్శించిన వారిచేతనే మెప్పు పొందాలని తాపత్రయ పడవచ్చు. ఇంకో రకం ఆ మందలింపుని ఇంకో విధంగా తీసుకుని క్రుంగి పోయి, మొదటి కంటే ఘోరంగా తయారవనూ వచ్చు.

“నా కృషి వలెనే నా పిల్లలింత వాళ్ళయ్యారు   …” అని చాల   మంది   ఉన్నత  స్థానంలో  ఉన్న తమ పిల్లల గురించి చెప్పుకోటం చూస్తూ వుంటాం. పేరెంట్స్ ఎవరైనా పిల్లలకి తగిన పద్ధతిలో ఎదగటానికి కావాల్సిన వాతావరణం కల్పించ గలరేమో కాని ,  నిజమైన మార్పు రావాలి అంటే అది ఆ పిల్లవాడి స్వీయ ప్రయత్నం నుండే అని చెప్పాలి. మేము చదువుకునే రోజుల్లో, పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో తాపత్రయ పడిన పేరెంట్స్ ని చూసాను… కాని అలాంటి పేరెంట్స్  లో కొద్ది మంది మాత్రమే పిల్లల భవిష్యత్తు చక్క దిద్దటంలో  సఫలీకృతులయారు. అలాగే పూర్తిగా పిల్లల బాధ్యతనివిస్మరించిన పేరెంట్స్ కొందరు వున్నారు. కాని వారి పిల్లలలో కూడా కొందరు మంచి స్థితి కి ఎదగ గలిగారు.

ఇలాంటి కేస్ స్టడీస్ చూస్తే ఒకటి మాత్రం స్పష్టమౌతుంది.. ప్రతి  పనికీ  ప్రణాళిక  అవసరమే  కాని, ఆ ప్రణాళిక అనుకున్న  విధంగా ఫలితాలనివ్వాలి  అన్న ఆలోచనలని మాత్రం nurture చేసుకోకుండటం మంచిది.. Detachment from an outcome is necessary. “అనుకున్నామని జరగవు కొన్ని… అనుకోలేదని ఆగవు కొన్ని… అనుకోవటమే మనిషి పని…” మీరేమంటారు? ..

Advertisements
This entry was posted in ఫిలాసఫీ. Bookmark the permalink.

2 Responses to అనుకున్నామని…

  1. అవునండీ .. మీరు చెప్పినది నిజమే!
    చాలా నిశితంగా గమనించిన విషయం ని ఇలా పంచుకున్నందుకు ధన్యవాదములు.

  2. Ramakrishna,what u hav stated is absolutely correct.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s