ఆ ఫుడ్ తింటే అక్కడే తినాలి

కొంత  మంది ‘మగానుబావులు’ తోలు తిత్తిని పని చేయించటం కోసమో లేక  లోక కళ్యాణం కోసమో తిండి తింటే.. మరి కొంత మంది మహాభారతం లో అర్జునుడికి విల్లు గురిపెట్టినప్పుడు కేవలం చిలక కన్నే కనపడినట్లు, వారికి ఎక్కడ పోయినా తిండి యావ తప్ప ఇంకో దృష్టి ఉండదు.. స్పృహ ఉండదు.

ఉపోద్ఘాతం లేని ఈ కథా కమామీషు ఏమిటంటే… ఎంత వద్దనుకున్నా నేను రెండో కోవలోకి వెళ్ళిన రోజులు గుర్తొచ్చాయి మరి.. ఆ రోజులేంటో  ఓ  సారి  నా  ఇరవై ఐదేళ్ళ నాటి రోజుల్లోకి మిమ్మల్ని ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్ళాలి.. యమ అర్జెంట్ గా మీ కెమెరాని పైన తిరుగుతున్న ఫ్యాను పైకి జూమ్ చేసుకోండి మరి..

అవి డిగ్రీ చదివే రోజులు. మా హాస్టల్ లో వేసవి రోజుల్లో ఆదివారం వచ్చిందంటే ఒకటే హుషారు..  ఆ రోజు ఉండే లంచ్ గురించే ధ్యాస… ఉదయం పదకొండుకే మా లంచ్ ప్రారంభం అయ్యేది. పెద్ద టేబుల్.. మొత్తం ఎనిమిది మంది కూర్చోటానికి చోటు ఉండేది. ఓ పెద్ద పాత్రలో అన్నం టేబుల్ మధ్యలో. ఓ పెద్ద బకెట్ లో…సాంబార్ అనుకుంటున్నారా..? మరదే తొందరపాటంటే.. మామిడి కాయ పప్పు.. మామిడి టెంకలు కూడా అందులోనే ఉండేవి. ఆ పప్పు చాల thick consistency (ఈ పదానికి సరైన తెలుగు పదం దొరకటం లేదు:-( ) లో ఉండేది. ఆ కిచేన్లోంచి పప్పు మా టేబుల్ పై బకెట్లలో ప్రత్యక్షమయ్యిందీ  అంటే  అంతే .. అంత వరకూ  పక్కనున్న  స్నేహితులు  కనపడరు …అంతవరకూ రణ గొణ ధ్వనులతో భాసిల్లుతున్న ఆ మేస్ ఒక్క సారిగా ఎంసెట్ పరీక్ష జరిగే గది లాగ నిశ్శబ్దంగా మారిపోతుంది. ఎవరికి వారు ఆ పప్పన్నం తింటూ, మధ్యలో టెంకని   ఓ పట్టు పట్టుతూ రసాస్వాదనలో మునిగిపోతారు. ఆ పప్పు కి రెండు అప్పడాలు తోడయ్యాయంటే .. అదరహో  అంతే…

ఆ వూరు వదిలాక మరెక్కడా అలాంటి ఫుడ్ తినలేదు.. ఎప్పుడైనా ఆ ఫుడ్ ఎవరైనా చేస్తే.. ” ఆ రోజుల్లో..” అని మా కాసేట్ మొదలు కావడం.. “చాల్లే బడాయి ..” అని జనులు ఘోషించటం చక చకా జరిగిపోతుంటాయి .. ఎప్పుడైనా బాపట్ల వెళ్తే ఆ స్వర్ణ యుగం లోకి  ఓ సారి మళ్ళీ వెళ్లి రావాలనుంది.. మరి మీరూ వచ్చేయండి

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

7 Responses to ఆ ఫుడ్ తింటే అక్కడే తినాలి

 1. అసలు మామిడి టెంకె ని చీకుతుంటే స్వర్గానికి ఓ.. బెత్తెడు క్రింద ఉన్నట్టు ఉంటుంది. పప్పులో..మామిడి టెంకె కన్నా వంకాయ మామిడి కాయ కూరలో టెంకె రుచి చాలా బాగుంటుంది. వీటన్నిటి కన్నా రుచే మాగాయ టెంకె. మహత్తరం.. ఆటకన్నా ఇంకేది సాటి రాదు.
  భలే టేస్ట్ ని గుర్తు తెప్పించారు. ఇప్పు మేము మా ఇంట్లో మనసారా తింటున్నాం.

 2. ఇదిగో వచ్చేసా! ఎప్పుడు ప్రయాణం?
  నాకెందుకో మామిడికాయ పప్పులో అప్పడాల కన్నా చల్ల మిరపకాయలే ఇష్టం. అవి పెట్టిస్తానంటేనే వస్తా 🙂

 3. santhosh says:

  thick consistency ki chikkaga ani anavachu kadandi…..

  • mhsgreamspet says:

   వనజ గారు ..
   మీరు చెప్పిన items చదువుతుంటే మళ్ళీ బకాసురుడు మేల్కొంటున్నాడు.. వ్యాఖ్యకి ధన్యవాదాలండీ.
   రసజ్ఞ గారు…
   వ్యాఖ్యకి ధన్యవాదాలండీ…బాపట్ల రైలేక్కగానే బ్లాగు లో ప్రకటిస్తాను..అప్పుడు బయల్దేరండి… 🙂
   santhosh గారు…
   saraina padam cheppaaru . ధన్యవాదాలండీ..

 4. anrd says:

  వేడి అన్నంలో మామిడికాయపప్పు కూరతో అప్పడాలు, చల్ల మిరపకాయలతో పాటు, కొంచెం ఆవకాయ కలుపుకున్నా బాగుంటుందండి.
  .మామిడి ముద్దపప్పు … అని కూడా అనవచ్చేమోనండి.

 5. Chandu says:

  నేను మొదటి సారి ఇల్లు వదిలి హాస్టల్ కి వెళ్లింది 2000 లో – విజయవాడ నలంద లో ఎంసెట్ కోచింగ్ కి. నాకు అక్కడ భోజనం ఏ మాత్రం సరిపడలేదు. ఇంట్లో ఉల్లి పాయ కూడా వాడరు. అదే హాస్టల్ లో ప్రతీ దాంట్లోనూ మసాలాలు. ఎలాగో సర్దుకున్నా. కానీ అక్కడ కొత్త స్నేహితులు ఏర్పడ్డాక… మాకు ఇదే పని. ఈ రోజు ఏం చేస్తారో అని. మాకు ప్రతి రోజూ వేపుడు కూర చేసేవారు. మా ముగ్గురికీ బెండకాయ వేపుడు ఇష్టం, వేరు శనగలు, కొబ్బరి వేసేవారు దానిలో. మాకు దానిని గురించిన ధ్యాసే. కానీ ఫరవాలేదు, ఉచిత సీట్ వచ్చే ర్యాంకులు తెచ్చుకోగలిగాం! 🙂
  ధన్యవాదాలు సార్. మీ బ్లాగ్ అద్భుత ం. మా మెమోరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s