స్వర సౌందర్యం గల ఆనాటి పాటలు..

ఈ రోజు ఓ చోట ఒకరి మొబైల్ లో వస్తున్న పాట అమితంగా ఆకర్షించింది… కారణం… ఆ పాట మనసు అనే డేటాబేస్ లో ఎప్పటి నుండో ఉంది కాని, ఏ పీ. హెచ్. పీ. స్క్రిప్టూ దానిని ఫ్రంట్ ఎండ్ లో ఇన్నాళ్ళు గా తీసుకు రాలేక పోయింది. ఈ రోజు ఆ పాట వినగానే, డిగ్రీ రోజుల్లో వినే “మన్ చాహే గీత్”, “ఛాయా గీత్” రోజులు గుర్తు రావటమే కాదు… అదే పాటతో పాటు అప్పట్లో వినే ఇంకో పాట కూడా గుర్తొచ్చింది. ఆ పాటలు కేవలం వినటం తప్ప, అప్పట్లో అవి ఏ సినిమాలోవి, గీత రచయిత ఎవరు ఇత్యాది వివరాలు అప్పుడూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.. ఆ పాటలు మాత్రం ఆ రోజుల్ని గుర్తు తెచ్చి జ్ఞాపకాలను తాజా చేసాయి.మీరూ ఆ పాటలు వినండి.

మొదటిది “ధన్ వాన్” అనే చిత్రం లోని పాట ..”ఏ ఆంఖే దేఖ్ కర్ హం సారే దునియా భూల్ జాతే హై..”- ఈ పాట లతా, సురేష్ వాడ్కర్ పాడారు. ఖయ్యాంజీ  స్వరపరిచేరేమో అనుకున్నాను కాని కాదట.

పాట ఇక్కడ వినండి

రెండవది “పర్వత్” అనే చిత్రం లోనిది (అట) . “ఏ దిల్ ఔర్ ఉన్ కీ .. నిగాహోన్  కే సాయే..” అన్న పాట. ఈ పాట వేణు గాన ప్రధానం గా సాగుతుంది. మధ్య మధ్యలో వచ్చే జలతరంగ్ స్వరాలు ఆ పాట మాధుర్యాన్ని మరింత పెంచాయి. లతా జీ పాడిన పాటలలో ఆచంద్ర తారార్కం నిలిచి పోయే పాటలలో ఇదొకటి.. ఈ పాట వింటూ, ఆ పాట సాహిత్యాన్ని ఆలకిస్తే… ఓ స్వాప్నిక లోకంలో విహరించగలిగేటంత   అందమైన పాట..

పాట ఇక్కడ వినండి

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s