ఈ బ్లాగు మొదలయ్యాక అప్పుడప్పుడూ అలా అనిపిస్తుంటుంది…

మనం చేసే పనికి ఎదుటి వారి మెప్పు రాకపోయినా పరవాలేదు… వారి హృదయాన్ని ఎక్కడో కదిలించగలిగితే చాలు.. మన పనికి సార్థకత చేకూరినట్లే… ఈ నాందీ ప్రస్తావన దేనికంటే..ఈ బ్లాగు రాసే ఉద్దేశ్యమే వేరు.. మా స్కూలు మిత్రుల కోసం… పాత మిత్రుల్ని  వెతకటం కోసం ఈ బ్లాగు సుమారు రెండేళ్ళ కిందట మొదలెట్టాను. బ్లాగు ప్రారంభం చేసిన మూడు నెలల వరకూ సంకలినులు  వుంటాయి అని తెలియదు కూడా.. ఓ సారి ఓ దిన పత్రిక లో సంకలినుల పై వచ్చిన వ్యాసాన్ని చూసి,  సంకలినులను  వెతికి అప్పుడు మా బ్లాగుని అందులో చేర్చాను.

చేరిన కొద్ది నాళ్ళకే, ఎక్కడో దూరాన స్థిరపడిన మా స్కూల్ సీనియర్ ఒకరు, అదే  స్కూల్ లో చదువుకున్న వారి తోబుట్టువులు  ఈ బ్లాగుని గుర్తించి మాలో ఒకరై పోయారు.. బ్లాగాన్నదే లేకుంటే వారు  ఎప్పటికీ పరిచయం కాకపోయి వుండేవారు.. అలాగే బెంగళూరు లో స్థిర పడ్డ  కొందరు జూనియర్స్ కూడా అడపా దడపా బ్లాగుని చూడటమే కాదు… కామెంట్స్ కూడా పెడుతున్నారు.

చదివిన చాలా మంది ఆనాటి జ్ఞాపకాల లోకి వెళ్లి పోయారు.. వారి హృదయపు అట్టడుగు పొరల్లో ఓ చిన్న కదలిక.. కళ్ళను కప్పేస్తున్న ఓ కన్నీటి చారిక.. “ఏ కొటాయి లో ఏ సినిమా ” అన్న టపా కి కామెంట్  పెడుతూ ఈ రోజు రామ కృష్ణన్ గారు అరవైలలోని మా హెడ్ మాస్టర్ రాఘవయ్య గారి గురించి గుర్తు చేసుకునే సరికి చాలా సంతోషమేసింది. ఎందుకంటే రాఘవయ్య గారి సోదరి సీతా లక్ష్మి మేడం గారు మాకు పాఠాలు చెప్పే వారు. మన స్కూల్ ఆఫీస్ వున్నలేన్ లో మురుగన్ గుడి వైపు వెళ్తుంటే ఎడమ వైపు వుండేది వారి ఇల్లు. తెల్లటి జుట్టు, సన్నగా వుండే రాఘవయ్య గారి రూపం ఒక్క సారి కంటి ముందు సాక్షాత్కరించింది ఆ కామెంట్ చదివాక.

ఈ బ్లాగు లో ఆలోచనలు, ఉద్దేశ్యం పది మందికి స్ఫూర్తిదాయకమై, వారూ వారి జ్ఞాపకాలను తాజా చేసుకుంటే  చాలు. ఈ బ్లాగు మొదలెట్టాక, నాకున్న ఇతర అభిరుచుల్నీ పంచుకోటం మొదలెట్టాక అర్థమయ్యింది, మన లాగా వున్న వారు ఎందఱో వున్నారని.. ముఖ్యంగా నాలాగే  పాటల అభిరుచి వున్న కొందరి  బ్లాగుల్ని చూసాక అనిపించింది.. “ప్రపంచం చాలా చిన్నదైపోయింది ” అని.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

3 Responses to ఈ బ్లాగు మొదలయ్యాక అప్పుడప్పుడూ అలా అనిపిస్తుంటుంది…

  1. Baagunnaayi Ramakrishna gaaru.
    Very good Experiences !!
    keep Blogging.

  2. KITTA says:

    keep it up ! a job being done with a lots of passion , concern for others and for tones of self satisfaction. whatever you write it is from your heart it seems. i have no doubt that every heart of all of us just resembles as of you. keep it up GRK

  3. Recollecting of golden moments of schooldays in our blog &sharing the same is really a wonderful job.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s