వేసవి బ్రేక్ లో చూడ దగ్గ సినిమాలు…

ఎవరికీ ఎలా అనిపించినా… నా వరకు ‘సినిమా’ అంటే రెండున్నర  గంటల పాటు చక్కటి fairy tale లాగ సాగి పోవాలి… చేతిలో ఉన్న రిమోట్ కి పని చెప్పటం మరిచేలాగా వుండాలి.  పాటలు బాగుండాలి.. హాస్యం సున్నితంగా వుండాలి..ఎమోషన్స్ లోనూ ఓ హుందా తనం వుండాలి.. ప్రతి దృశ్యం లోనూ స్పష్టత వుండాలి.. ఫోటోగ్రఫీ, చక్కటి కథనం వుంటే ఇంకాస్త బాగుంటుంది..

ఈ గుణాలున్న సినిమాలు నాకు చూసిన వెంటనే నచ్చేస్తాయి.. కాని అలాంటివి లెక్క బెడితే చాల తక్కువ తేలాయి.. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా కొట్టాయి మరి. బాగా ఆలోచిస్తే మరి కొన్ని దొరకొచ్చు… కాని అనుకున్న వెంటనే ప్రస్తుతానికి  నాకు స్ఫురించిన చిత్రాల లిస్టు ఇదే..

1 . సాగర సంగమం – ఈ సినిమా ఎందుకు నచ్చిందో చెప్పక్కర్లేదనుకుంటాను. నేను మొదటి పేరా లో చెప్పిన ప్రతి  లక్షణమూ ఈ చిత్రానికుంది .

2 . జర్నీ– ఈ సినిమా కి స్క్రీన్ ప్లే చాల విలక్షణంగా వుంది.. ఈ చిత్రం ఎందుకు నచ్చిందో ఇంతకు మునుపు టపాలలో రాసాను.

3 . అలా మొదలైంది– పెద్ద తారా గణం లేకుండా, వంటకి వేసే పోపులాగా వుండే “నిలయ విద్వాంసుల్లాంటి ” స్టాండర్డ్ హాస్య నటులు లేకుండా చక్కటి హాస్యం కూడా అందించిన సినిమా ఇది.

4 . రిథమ్ – అర్జున్, మీనా నటించిన చిత్రం.. మానవ సంబంధాలను ఎంతో హుందాగా చూపించే చిత్రం.

5 . రైన్ కోట్– ఈ హిందీ చిత్రం నచ్చే వాళ్లకు విపరీతంగా నచ్చుతుంది. లేదంటే బోర్ కొట్టేస్తుంది. So watch at your own discretion. ఓ హెన్రీ కథ ఆధారంగా తీసిన ఓ poignant ప్రేమ కథ ఇది.

6 . ఒకరికి ఒకరు– ఫోటోగ్రఫీ  , పాటలు చాల బాగుంటాయి. కథ  అంతా నేను ముందే చెప్పినట్లుగా ఓ fairy tale లాగ సాగి పోతుంది. ఒక్క పాట మినహా ఈ చిత్రం లోని పాటల చిత్రీకరణ ఎంతో బాగుంటుంది. “నువ్వే నా శ్వాస” అన్న పాట సూపెర్బ్.

ఇదేమి choice లండీ బాబు.. పెద్ద హీరోలు లేరు. ఒక్క ఫ్యాక్షన్ సినిమా లేదు.. ఒక్క ఫైటు కూడా లేని సినిమాలు..     అంటారా..
హ్మ్మ్.. కొందరి టేస్ట్ అంతే మరి …ఏం చేద్దాం..

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

One Response to వేసవి బ్రేక్ లో చూడ దగ్గ సినిమాలు…

  1. Madhav says:

    వీటిల్లో హిందీ చిత్రం తప్ప అన్నీ చూసాను. మంచి ఎంపికలు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s