హరికథా కాలక్షేపం- నాటి వేసవి జ్ఞాపకాలు

వేసవి రాత్రులు అంటే గుర్తొచ్చే చిన్ననాటి మా వూరి జ్ఞాపకం “హరికథ”. పేరుకి జిల్లా ముఖ్య కేంద్రమైనా, చిన్న ఊళ్లలో కనిపించే సాంప్రదాయాలు మా వూళ్ళో కనిపిస్తూ వుంటాయి.. అలాంటిదే ఈ హరికథా కాల క్షేపం.. మా కాలేజి కన్నన్ జూనియర్ కాలేజి కి ఎదురుగా పోలీస్ లైన్ వుంది.. ఈ వీధిలో రెండు వైపులా మూస పోసినట్లుగా పెంకుటిళ్ళు ఉండేవి.. అవి పోలీస్ క్వార్టర్స్..ఆ వీధి చివరలో ఓ గుడి.. వేసవిలో ఆ గుడి ముందు ఓ మండపం వేలిసేది.. తొమ్మిది  రోజులు (అనుకుంటాను) హరి కథా కాలక్షేపం.. మాకు వేసవి సెలవులు కాబట్టి రాత్రి భోజనాలు ముగించుకుని అక్కడికి చేరిపోయేవాళ్ళం  .. రోజుకొక హరికథా భాగవతార్ లేక భాగవతారిణి విచ్చేసి హరికథా కాలక్షేపం చేసేవారు.. నాకు బాగా నచ్చిన భాగవతార్ … పాండురంగ భాగవతార్.. తను వచ్చారంటే సుమారు మూడు రోజులు హరికథని వినిపించేవారు.. ముఖ్యంగా హాస్యాన్ని పండించటంలో  అతను దిట్ట.. సమయానుసారంగా పాటలు.. మధ్య మధ్యలో ఆశువుగా సందర్భోచితంగా చేసే పద విన్యాసాలు వారి సొంతం.. స్వరం కొంచెం అలనాటి  మేటి గాయకుడు రామకృష్ణ గారి స్వరంతో పోలి ఉండేది.. మధ్య మధ్యలో వారికి కానుకలు చదివించే వారు..ఆ చదివింపులను
ఉటంకిస్తూ, వారిని ఆశీర్వదిస్తూ మళ్ళీ కథలోకి వెళ్తూ…సుమారు మూడు గంటలు ఎలా గడిచాయో తెలిసేది కాదు.. చదువు కోసం వూరు దూరమయ్యాక, వేసవి సెలవుల్లో వూరెళేతే అప్పుడప్పుడూ హరికథ కి వెళ్ళే వాళ్ళం కానీ, తనని చూడటం తటస్థించలేదు.. కాని వారు మాత్రం ఇప్పటికీ గుర్తుండిపోయారు..వారు ఎక్కడ వున్నా “ఆయురారోగ్యాలతో వారు కొలిచే భగవంతుని కృపకి సదా ప్రీతిపాత్రులై ఉండాలని” కోరుకుంటున్నాను.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

One Response to హరికథా కాలక్షేపం- నాటి వేసవి జ్ఞాపకాలు

  1. t.pattabhiraman says:

    Yes, i also use to attend this Harikatha during summer vacation times. That time people will give such a interest to conduct like these programmes and people give good response for this. Along with my childhood friends i use to attend this Harikatha Kaalakshepam.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s