మాకూ ఓ లెక్కుంది..

సుమారు ముప్పై ఏళ్ళ నాటి సంగతి.. నాన్న గారి వద్ద ఉద్యోగ రీత్యా కొన్ని అభివృద్ది పనులు చేయటానికి కొందరు మేస్త్రీలు వుండే వారు.. ఆ మేస్త్రీలు కొంత మంది కూలీల చేత పనులు చేయిస్తే, ప్రభుత్వం నిధులు మంజూరు చేసేది.. .. ఆ కూలీలు ఎక్కువగా కడప నుండి వచ్చి, మా వూరి (అంటే చిత్తూరి) పరిసర ప్రాంతాలలో పనులు చేసే వారు. నెలకో రోజు వారి వూరికి వెళ్లి సంపాదన ఇచ్చి వచ్చేవాళ్ళు.

వారానికో, నెలకో ఓ సారి నాన్న గారి పర్యవేక్షణ లో కూలీలకు , మేస్త్రీలు పేమెంట్ చేసేవారు . ఓ రోజు ఆ మేస్త్రీ దగ్గరకు ఓ కూలీ  వచ్చాడు.. తన ఇంట్లో ఎవరికో బాగా లేదని అర్జెంట్ గా వూరేల్లాలని చెప్పాడు.

” సరే… అలాగే వెళ్లి రా…” అన్నాడు మేస్త్రి.

” సారూ… మరి లెక్క..” అంటూ నసిగాడు ఆ కూలీ..

” లేక్కదేముంది లేబ్బా… తర్వాత చూసుకోవచ్చు… ముందు మీ వూరికి వెళ్లి రా…” అన్నాడు మేస్త్రి తఃన అకౌంట్ తరవాత చూడొచ్చులే  అనే ఉద్దేశ్యంతో ..

గట్టిగా అడిగితే తిడతాడేమోనని భయపడుతూ .. “అలాగే  సారూ… మరి లెక్క…” అంటూ మళ్ళీ నసిగాడు ఆ కూలీ..

ఈ సారి విసుగుతో…”ఎన్ని సార్లు చెప్పాలి… లెక్క ఇప్పుడు వద్దు… ముందు వెళ్లి రా..” అన్నాడు మేస్త్రి..

ఇలా ఇద్దరి మధ్యా ఈ మాటలు నడుస్తున్నాయి.. ఎంతకూ వదలకపోవటం చూసి , ఆ మేస్త్రీకి అసహనం మొదలయ్యింది..

ఇదంతా గమనించిన నాన్న గారు నవ్వు ఆపుకుంటూ…” అయ్యా మేస్త్రి గారు.. కడప జిల్లాలో లెక్క అంటే డబ్బు అని అర్ధం.. ఇందాకట్నుండీ మిమ్మల్ని డబ్బులు ఇమ్మని అడుగుతున్నాడు.. ఎంతో కొంత ఇచ్చి పంపించండి..” అని చెప్పే సరికి ..

అంతా వరకూ అక్కడ నెలకొన్న అయోమయానికి తెర పడింది..

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

One Response to మాకూ ఓ లెక్కుంది..

  1. My maternal also experienced same when he has been transfered to yerraguntla,in kadapa Dist 4m tirunelveli in 1998

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s