దోసిళ్ళలో జారిపోతున్న జీవితాన్ని పొదివిపట్టుకో …

ధర్మరాజు కి వేసిన యక్ష ప్రశ్నలలో ఒకటి..”నీకు విచిత్రమని అనిపించే విషయమేంటి?”- దానికి జవాబుగా ధర్మరాజు అంటాడు ” ఏదో ఒక రోజు మరణిస్తారని తెలిసి కూడా, ఎప్పటికీ జీవించి ఉంటామని అనుకుంటూ మనిషి చూపే స్వార్థం..” అని..

నిజమే కదా.. లేకుంటే… ఈ ఇజాలు, భేషజాలు, విభజనలు లాంటి సంకుచిత చింతనలు మనిషి దరి చేరేవే కావు కదా..? ఈ ఆలోచనలకు మూలం నిన్న జరిగిన సంఘటన 

నిన్న సాయంత్రం మొబైల్ మోగింది… మా సూరి బావ (నా బాల్య స్నేహితుడు) నుండి ఫోన్.. ప్రయాణం లో ఉండేసరికి   .. ఫోన్ కి రెస్పాండ్ కాలేదు… గంట వ్యవధి లో తను మూడు సార్లు ఫోన్ చేసాడు .. కాని తీయలేదు. ఇంటికొచ్చాక  వెంటనే చేసాను.. ఓ దుర్వార్త.. తన మామగారు కాన్సర్ తో మూడు గంటలకు చనిపోయారని.. ఆరు నెలలుగా సూరి వాళ్ళ మామగారు కాన్సర్ తో సమరం చేస్తూనే వున్నారు.. ఏప్రిల్ లో వూరెళ్ళినప్పుడు, వాళ్ళ వూరు ఆర్కాట్ కి వెళ్లి పలకరించి వచ్చాను.. గత నెల అన్నయ్య  వచ్చినప్పుడు, తన reports చూపించేసరికి, తనూ పెదవి విరిచాడు.. సూరి భార్య గోమతి వాళ్ళ నాన్నకి ఎంతో చేరువ.. ఆరు నెలలుగా తన తండ్రే తనకు చంటి పిల్లాడైపోయాడు  .. తండ్రికి సపర్యలు చేస్తూ ,  తను పడుతున్న సంఘర్షణ చూస్తూనే వున్నాను.. 

సూరి ఫోన్ చేసిన వెంటనే గోమతి కి ఫోన్ చేసే ధైర్యం చేయలేక పోయాను.. తనకున్నదుఖం ఆలాంటిది.. ఇవాళ తనకు ఫోన్ చేసి ఓదారుస్తుంటే.. ” అన్నా.. మీరు అంతా వున్నారు నాకు .. ఈ దుఖాన్ని నేట్టుకోస్తాను..” అని అంటుంటే ఏదో తెలియని బాధ… 

ఈ మధ్య… ఈ కాన్సర్ మహమ్మారికి బలైన వ్యక్తులు, వారి బాధను చూస్తూ  నిస్సహాయంగా మారిన వారి దగ్గరి వారు ఎక్కువగా తటస్తిస్తున్నారు..   

ఇవి చూస్తుంటే అనిపిస్తుంది.. ఉన్న జీవితాన్ని చేతులతో పొదివి పోట్టుకోండి… అనవసర ‘ఇజా’ లతో దోసిళ్ళలోంచి  జారిపోనివ్వకండి అని.. because you never know when you get the final call.

Advertisements
This entry was posted in ఫిలాసఫీ. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s