వేరుశనక్కాయలు కొనేప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త

“వేరు శనక్కాయలు తినాలనుకుంటే.. కొనేసుకో….పరవాలేదు 

డబ్బులు లేకుంటే.. కొంచెం రిస్క్ అయినా పరవాలేదు.. పక్కోడి జేబు కొట్టేసి మరీ కొనేసుకో..తప్పులేదు 

కాని వేరుశనక్కాయలు తినేసాక, ఆ పొట్లం మీద ఏమి రాసుందో చూడాలనుకున్నావనుకో … నీ బతుకు బస్ స్టాండ్ అవుద్ది..” 

అని బహుశా మా ఫ్రెండ్ ఇప్పుడు అనేవాడేమో..  ఆ ఫ్రెండ్ అలా అనటానికి దారి తీసిన ఆ బలీయమైన ఫ్లాష్ బ్యాక్ ఏమిటి అని మీరు అడిగితే.. ఇక చెప్పక తప్పుద్దా   మరి.. 

అప్పట్లో కాలేజిలో చదివే రోజుల సంగతి.. మాకు ప్రాజెక్ట్ వర్క్ వుండేది. అందులో,  ఏదైనా అంశం పై పరిశోధన చేసి వ్యాసం సమర్పించాలి. తీసుకున్న సబ్జెక్ట్ బట్టి, ఒక్కోసారి మూడు నాలుగు సంవత్సరాలు కూడా పట్టేది.. పరిశోధన ఒక ఎత్తైతే, రాసిన వ్యాసాన్ని మా గురువుగారి చేత ఒకే చేయించటం ఇంకో అగ్ని పరీక్ష.. ఎందుకంటే ఒక్కో గురువు ఒక్కో టైపు.. ఆ ప్రక్రియ కూడా ఒక్కో సారి ఆరు నుండి పది నెలలు కూడా పట్టేది..

అప్పుడు నేను కూడా వ్యాసాన్ని   పూర్తి చేసి గురువు   గారి చేత దిద్దించే పని లో వున్నాను. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా నడుస్తోంది పని..
నాకు హాస్టల్ లో వుండే గడువు దాటి పోవటం తో, నాలాగే వ్యాసం రాస్తున్న ఇంకో మిత్రుడి రూం లోకి మారాను. రోజూ పొద్దునే బ్రేక్ఫాస్ట్ అయ్యాక, ఇద్దరం మా గురువుగార్ల  దగ్గరికెళ్లటం, మధ్యానం ఉసూరుమంటూ వచ్చి ఒకరి కష్టాలు ఒకరికి చెప్పుకోటం, భోజనం చేసి మళ్ళీ వెళ్ళటం… ఇలా సాగుతున్నాయి రోజులు. మా మిత్రుడి గురువు కరెక్షన్ చాలా  మెల్లగా చేసే వారు. ఒక వైపు ఆలస్యం అవుతోందన్న బాధ, మరో వైపు రోజూ గురువు గార్ని ప్రసన్నం చేసుకోటం లో ఆదుర్దా అతడిని బాగా డీలా చేసేశాయి.. ఇద్దరం కలిసి మాట్లడుకునేప్పుడు తను కాస్త రిలీఫ్ పొందేవాడు.
అలాంటి సమయంలో ఓ రోజు సాయంత్రం రూం కి వేరు శనక్కాయల పొట్లం పట్టుకెళ్లాను. చూసి సంతోషిస్తాడనుకున్న  నా ఫ్రెండ్ ఆ పొట్లం చూసి ఉగ్రుడయ్యాడు. “ఈ పొట్లం చూస్తే నాకు కంపరం” అన్నాడు కోపంగా. విస్తుబోయిన  నన్ను చూసి, తను కాస్త తగ్గి తన ఫ్లాష్ బాక్ చెప్పాడు.. ఐదేళ్ళ కిందట … తన వూర్లో ఓ రోజు ఇలాగే వేరుశనక్కాయల పొట్లం తీసుకున్నాడట. తిన్నాక, ఆ పొట్లం ఓ న్యూస్ పేపర్ ది కావటంతో, అటూ ఇటూ తిప్పితే, ఇప్పుడు చేరిన కాలేజి తాలుకు ప్రవేశాల ప్రకటన కనపడిందట.. చూసే సరికి, ఇంకా గడువుండటంతో, వెంటనే అప్లై చేసి, ఆ కాలేజిలో చేరి… ఇదిగో… ఇలా ఇప్పుడు పరిశోధన వ్యాసం దిద్దిన్చుకునే ప్రక్రియలో ఇక్కట్లు పాలవుతున్నట్లు చెప్పాడు. 
“అసలు ఆ రోజు వేరు సంక్కాయలు ఎందుకు కొనవలె… కొంటిని పో.. ఎందుకు పొట్లం మీది ప్రకటన చూడవలె.. చూసితిని పో.. ఎందుకు ఈ కాలేజి కి అప్లై చేయవలె.. చేసితిని పో.. ఎందుకు మా గురువుగారికి ఇలా చిక్కవలె… అక్కటా… విధి హెంత ‘భ’లీయమైనది  కదా…” అని వాపోయాడు. 

అందుకే నేను తెచ్చిన పొట్లం చూసి  ఒక్కసారి ఆ రోజుల్లోకి వెళ్ళిపోయాడు ఆ జీవుడు. ఇద్దరం కాసేపు నవ్వుకున్నాం.
సో ఏతా వాతా చెప్పేదేమిటంటే..వేరుశనక్కాయలు కొనుక్కోండి తప్పు లేదు.. కాని ఆ పొట్లం లో ఏముందని చదవకండి.. 🙂



Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

2 Responses to వేరుశనక్కాయలు కొనేప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త

  1. :)) అస్సలు పేపెర్ చదవనండీ ! అలాటి విషయం ఉంటే చూడనేల? చదువులు చదవనేల?
    బ్లాగ్ లు చదవడానికే తీరిక లేదు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s