గాలి బండ @ హార్స్లీ హిల్స్ … ఓ స్వయం శోధన..

ఆ మధ్య ఓ సారి రాసాను… ఈ సమ్మర్ లో హార్స్లీ కొండలకి వెళ్తానని.. అలాగే వెళ్ళాము.. సూరి బావ కుటుంబంతో పాటు. లక్కీగా శుక్ల పక్షం లో వెళ్ళాం కాబట్టి, రాత్రుళ్ళు, వెన్నెల సోయగాలు ఆరు బయట వీక్షించే భాగ్యం కలిగింది. వెళ్ళిన మొదటి రోజే భోజనాలయ్యాక నేను, సూరి బావ గాలి బండ దగ్గరికెళ్ళాము. గాలి బండ అనేది కొండ అంచులో మైదానంలా పరుచుకున్న ఒక పెద్ద బండ ఉన్న ప్రదేశము. పగలంతా ఆ ప్రదేశం యాత్రికులతో రడీగా వున్నా..  రాత్రి అయ్యాక అటు వైపు  ఎక్కువ జన సమ్మర్దం వుండదు. పరచుకున్న వెన్నెల .. ఆకాశం లో మిణుకు మంటున్న తారలు.. శరీరాని అబ్యంగన  స్నానం చేయిస్తున్న చల్లటి గాలి.. అలాంటి బ్యాక్ డ్రాప్ లో ఆ బండ పై ఇద్దరం కూర్చున్నాం కబుర్లు చెప్పుకుంటూ.. ఎన్నో రోజులుగా ఉన్న స్ట్రెస్ అంతా క్షణాల్లో పటాపంచలైపోయింది.. ప్రకృతి కున్నంత హీలింగ్ టచ్ దేనికీ లేదేమో అనిపించింది.. రాత్రి చిక్కపడే కొద్ది, గాలి హోరు ఎక్కువయ్యింది..  వెనక వైపు, వూగుతున్న ఎత్తైన యూకలిప్టస్ వృక్షాలు, దూరంగా కనపడుతున్న ఊళ్ళు, వెలుగుతున్న దీపాలు.. చూస్తుంటే కాలం అలాగే ఘనీభవించి పోతే ఎంత బాగుండును అనిపించింది.. నిజమైన ఆనందం, ప్రశాంతత  అంటే ఏమిటో అప్పుడు తెలిసింది.

The moon is high and bright
but the time is curt and cant wait
the moments are for a short while
but the pleasure remains eternal.. eternal..

ఆనందం అన్నది మన దగ్గరికి రాదు.. మనమే మనల్ని శోధించుకుంటూ దానిని వెతుక్కుంటూ వెళ్ళాలి.. దురదృష్ట వశాత్తూ ఏది మనకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది అన్నది కొందరికి ఎప్పటికీ తెలియక పోవచ్చు.. అలా శోదిన్చుకున్నవారికి ఆశ్చర్య పరిచే నిజాలు బయట పడొచ్చు.. ఇంత చిన్నవాటికి మనం ఆనందిస్తామా అనే శంక కూడా కలగ వచ్చు.. But such self introspection gives you the pleasure and serenity of your lifetime.. Just.. keep probing yourself.. a day may dawn when you find yourself.. the real self.. 
Advertisements
This entry was posted in ఫిలాసఫీ. Bookmark the permalink.

2 Responses to గాలి బండ @ హార్స్లీ హిల్స్ … ఓ స్వయం శోధన..

  1. Zilebi says:

    very very nice post raamkrishna gaaru.

    keep it up

    cheers

    zilebi.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s