1975 లోరాసిన మొదటి బ్లాగు టపా..

ఆశ్చర్య పడకండి.. అప్పట్లో బ్లాగు కాదు సరి కదా కంప్యూటర్లు, ఇంటర్నెట్టూ ఎక్కడివి అంటారా? బ్లాగు టపా అన్నది కేవలం మనకు నచ్చినది, తోచినట్లుగా రాయటమే కదా.. ఆ లక్షణాలున్నాయి కాబట్టే, 1975 లో రాసిన ఈ కథ (మోస్ట్  ఒరిజినల్) బ్లాగు టపా గా పరిగణించక తప్పదు.. ఆ కథని ఇప్పటికీ ఆల్బం లో దాచారు ఇంట్లో. 

రాసిన టపా కాగితం పాతబడింది కాబట్టి చదవటం కష్టం కాబట్టి .. మీ కోసం నేను రాసిన మొదటి టపా ని యదా తధంగా మీ ముందు ఉంచుతున్నాను..

పూర్వము నాలుగు ఎద్దులు ఒక వూళ్ళో నుండెను. అవి ఎప్పుడు ఐకమత్యముగా నుండెను. ఒక సారి అవి మేయుచుండగా ఒక పులి వాటి మీదికి వచ్చెను. అవి నాలుగు కలిసి పులిని పారద్రోలెను. ఒక నాడు అవి తగాదా పది అవి విడి పోయెను. ఆ పులి మరలా వాటిపైకి వచ్చెను. అవి విడిపోయినందున పులి నాలుగు ఎద్దులను చంపి తినివేసెను. అవి ఐకమత్యముగా  లేనందున అవి దుర్మరణానికి కారకులైనవి. అందువలన ఐకమత్యమే మహా బలము. ఐకమత్యముగా లేని చోట ఆ ఎడ్ల బ్రతుకు వలెనె మన బ్రతుకు అలానే వుండిపోవును. కావున ఐకమత్యమే మహాబలము. ఐకమత్యముగా  వుండినచొ ఎటువంటి పనినైనా సులభముగా నేరవేర్చవచ్చును. ఈ కథ ఐదవ తరగతి గిరిజా గైడులో నున్నది. ఐదవ తరగతి తెలుగు వాచకములోనున్నది.

ఈ టపాలో చివరి నా disclaimer ని (అంటే ఇది నా సొంత రచన కాదు.. కేవలం “a story retold in my style” అన్నట్లుగా) అన్నయ్య ఆట పట్టిస్తుండటం తో, బాగా ఉడుక్కుని, ఆ వాక్యాల్ని షేడ్ చేసి కొట్టేశాను. 
Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

2 Responses to 1975 లోరాసిన మొదటి బ్లాగు టపా..

  1. చాలా బాగుంది మీరు చిన్ననాటి రచనా వ్యాసంగాన్ని మాతో పంచుకోవటం.

    నా చిన్నప్పుడు నేను అలాంటివి చాలా వ్రాసాను. ఎవరూ ఏమీ‌ దాచలేదు. నేనూ స్వయంగా ఏమీ‌ దాచుకోలేదు. మీ సంగతి చాలా నయం.
    ఒక నాడు నెహ్రూగారి బాల్యకథ ఒకటి మా నాన్నగారు చెప్పారు. నాకు నచ్చి వెంటనే స్వంత వాక్యాల్లో వ్రాసి దాచుకున్నాను కాని యిప్పుడు లేదు. కథావిషయం యేమిటంటే స్నేహితులతో‌ఆదుకుంటుండగా బంతి ఒక చెట్టుతొఱ్ఱలో పడిపోతే నెహ్రూ ఆ తొఱ్ఱలో నీళ్ళు పోసి బంతినిపైకి తేల్చి తీయటం. ఇంకొక జ్ఞాపకం 7వ తరగతిలో ఉండగా నేను పద్యాలు వ్రాయప్రయత్నిస్తే మానాన్నగారు ప్రోత్సహించటం. అలాగే చైనాదురాక్రమణను ఖండిస్తూ పేద్దవ్యాసం వ్రాస్తే మా నాన్నగారు చాలా సంబరపడటం. ఇలాంటివి చాలా చాలా మంచి అందమైన జ్ఞాపకాలు కొల్లలు. కాని ఏదీ ఈ నాటికి లేదు గదా అని చాలా చాలా విచారం కలుగుతుంది. మీరు అదృష్టవంతులు కొన్నో మరెన్నో బాల్యజ్ఞాపకాలుల పరచుకున్నారు. అభినందనలు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s