Priorities of Life

జీవితంలో ప్రాదాన్యాలన్నవి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. కాలానుగుణంగా మారిపోతుంటాయి ఈ ప్రాధాన్యాలు. విద్యార్ధి దశలో, ఉద్యోగ అన్వేషణ దశ లో, స్థిర పడటం లో… ఇలా ప్రతి దశలోనూ కొన్ని ధ్యేయాలను  ఏర్పరుచుకుని వాటికి ప్రాధాన్యాలు  ఇస్తుంటాము. ప్రాధాన్యాలు  ఏవైనా.. వాటికి మూల సూత్రం ఒకటే.. ఏవైతే మనల్ని ఆనందం గ, సంతృప్తి తో ఉంచుతాయో… అవే నిజమైన ప్రాధాన్యాలు.. ఇంతకు మునుపు ఓ టపాలో రాసినట్లుగా… ఒక్కో సారి మనకి ఆనందం కలిగించే విషయాలేమిటో తెలుసుకోలేక… అర్థం లేని ఎండమావుల వెంబడి పరిగేడుతుంటాము.. అన్నీ ఉన్నట్లే వున్నా.. ఏదో తెలియని వెలితి… నిర్లిప్తత.. మనకే అర్థం కాని మనం.. ఇలాంటి డోలాయమాన పరిస్థితి రావటం కద్దే.. 
 
ఈ మధ్య నా పాత ఫ్రెండ్ ని కలిశాను. ఉద్యోగ పరంగా.. ఇతరులు సాధించలేని ఎన్నో విజయాలను సాధించారు.. అందరూ తనని దూరం ఉంచుతున్నారు అని ఓ భావన.. కారణమేంటి అని నాతో షేర్ చేసుకుంటే నేను చెప్పాను.. మన విజయాలతో పాటు… ఇతరుల అసూయల క్రీనీడలు కూడా వెంటాడుతాయని.. అలాంటి అసూయ manifestation ఎలాగైనా ఉండ వచ్చని… అందులో భాగమే అందరికీ దూరమౌతున్న ఫీలింగ్ అని. అంతే కాదు… ఉన్నత  శిఖరాలు అధిరోహించే కొద్దీ, ఆ స్థానాన్ని పదిలపరుచుకోవాలన్న ఒత్తిడి కూడా అశాంతి పొందటానికి కారణం కావచ్చు.. One who reaches the top has to deal with “fear of heights”. నేను చెప్పింది విన్నాక.. “అయితే నేను ఈ విజయాలను సాధించటం మాన మంటావా.. కుదరదు కాక కుదరదు.” అని తను చెప్పే సరికి.. నాకీ ప్రాధాన్యాలు గురించి ఆలోచన మొదయ్యింది.. ఒకరికి విజయం సాధించటంలో అపరిమిత ఆనందం ఉండొచ్చు.. ఒకరికి విజయాలు లేకున్నా మానసిక ప్రశాంతత పొందటం ప్రాధాన్యం కావచ్చు.. అందుకే నా ఫ్రెండ్ కి విజయం ముందు మిగతా అన్ని విషయాలు దిగదుడుపే అయ్యాయి. 
 
ప్రాధాన్యాలు ఏవైనా … The key is being aware of what your priorities are, that keep you happy and make you pursue them..
Advertisements
This entry was posted in ఫిలాసఫీ. Bookmark the permalink.

2 Responses to Priorities of Life

  1. బావుందండి. మంచి విషయం చెప్పారు. . మనకి కావాల్సింది మనలోనే ఉందని తెలుసుకోలేనంతవారు.. ఎన్ని విజయాలు సాధించినా సంతృప్తి ఉండదేమో !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s