క్షణాల్లో జరిగిపోయిన ఓ transactional analysis

ఓ మనిషి కి ఎప్పుడైనా ఓ ఇబ్బందికర సందర్భం ఎదురయ్యిందనుకోండి.. మీరు అతడిని ఆ ఇబ్బంది నుండి కాపాడారనుకోండి .. అతడు మీకు కృతజ్ఞతలు చెప్పారనుకోండి.. ఈ మొత్తం transaction కి కనీస సమయం ఎంత పట్టొచ్చు.. నాకు  మాత్రం రెండు మూడు క్షణాల్లో ఇవన్ని జరిగిన సందర్భం ఎదురయ్యింది ఈ మధ్య… వివరాల్లోకి వెళ్తే..

ఓ పదేళ్ళ  తరవాత నేను చదువుకున్న వూరికి వెళ్లానీ మధ్య..అక్కడ బిమల స్వీట్ షాప్ అనే దుకాణం ఉంది. ఎప్పుడు వెళ్ళినా, అక్కడ రసగుల్లా మాత్రం వదలను. నేను తిన్న స్వీట్స్ లో అవే బెస్ట్. అప్పట్లో, ఆ దుకాణం యజమాని వాళ్ళ అబ్బాయి కూడా దుకాణం పనుల్లో సాయ పడేవాడు. ఆదివారం వచ్చిందంటే… పొద్దుటే వచ్చే జన సమ్మర్దం… ఇరుకైన ఆ దుకాణంలో చెమటలు పోస్తున్నా… ఆ అబ్బాయి .. ఎవరినీ విసుక్కోకుండా మిష్టీ (మిటాయి) లను అందించే వాడు. కాని..  ఓ రోజు చేతికంది వచ్చిన ఆ అబ్బాయి, హటాత్తుగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఆ కుటుంబానికదో  కోలుకోలేని దెబ్బ. ఇది జరిగి ఎన్నో సంవత్సరాలయ్యేసరికి,  ఎందుకో ఆ విషయం మరిచిపోయాను. 

 నన్ను చూసిన వెంటనే ఆ దుకాణం యజమాని గుర్తు పట్టాడు. స్వీట్స్ పార్సెల్ చేయమని అడుగుతూ, వాళ్ళ అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడగటానికి, యధాలాపంగా “మీ అబ్బాయి …” అంటూ అడగబోతూ అక్కడే గోడ మీద ఉన్న ఆ అబ్బాయి చిత్తరవు చూసి ఒక్కసారి గతం గుర్తొచ్చి ఆగిపోయాను. ఎన్నో సంవత్సరాల  ముందు జరిగిన ఆ విషాదాన్ని మళ్ళీ గుర్తు చేయటం ఇష్టం లేక, వెంటనే టాపిక్ మార్చేసాను.. క్షణాల్లో నా మొహం లో జరిగిన మార్పులు గమనించిన  ఆ దుకాణం యజమాని ముఖం లో కూడా ఓ సారి విషాద వీచికలు తాకి వెళ్ళాయి.. ఆ జ్ఞాపకాలను గుర్తు చేయకుండా అర్ధంతరంగా నేను టాపిక్ మార్చేసినందుకు, కృతజ్ఞతగా నా వైపు చూసాడు. ఇదంతా కేవలం కొన్ని క్షణాల వ్యవధిలో జరిగిపోయాయి..
 
Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s