సరిగ్గా ముప్పై ఐదేళ్ళ కిందట ఇదే రోజు…

కాకతాళీయమో…మరేమిటో తెలియదు కాని…ఈ రోజు పొద్దుట నా బాల్య మిత్రుడు ప్రసన్న ఫోన్ చేస్తే తనకి గుర్తు చేసాను.. సరిగ్గా ముప్పై ఐదేళ్ళ కిందట ఇదే రోజు గురించి.. అప్పట్లో ఇద్దరమూ మా స్కూల్ లో ఏడవ తరగతి సీ సెక్షన్ లో ఉన్నాము.. ఆ రోజు పొద్దుట స్వతంత్ర దినం సందర్భంగా అందరం మా గ్రౌండ్ లో assemble అవుతున్నాము. ఇంకా ఫంక్షన్ మొదలు కాలేదు.. గ్రౌండ్ లో నేను ముందు .. నా వెనక ప్రసన్న..ఇలా ఒకే వరసలో నించున్నాము.. ఇంతలో ఎవరో వెనక నుండి భుజం తట్టారు… చూస్తే అన్నయ్య.. ఇదేంటి మా స్కూలు కేందుకొచ్చాడు  అనుకుంటుండగానే… “ఎంట్రన్స్ పరీక్ష లో సెలెక్ట్ అయ్యాన్రా” అని చెప్పి వెంటనే వెళ్ళిపోయాడు. ఆ సంతోషకరమైన వార్త విని కాసేపు అలాగే స్థాణువులా ఉండిపోయాను… ఎందుకంటే అందరూ ఎంతో ఆదుర్దాగా ఎదురు చూసిన ఫలితమది.. నన్ను చూసి ఏంటి విషయం అని వెనక ఉన్న ప్రసన్న అడిగే సరికి… తనకే ముందు చెప్పాను ఆ శుభ వార్తని..
 
ఈ రోజు అదే విషయం  ప్రసన్నకి   గుర్తు చేసాను.. దశాబ్దాలు ఎన్నో దొర్లిపోయినా… కాలమనే శిల్పి ఈ మనసును, దేహాన్ని, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని  నిరంతరం తనకి నచ్చిన రీతిలో మలుచుతూ ఉన్నా.. రెండింటిని ఏమీ చేయలేకపోయాడు … ఒకటి నాటి ఆ తీపి జ్ఞాపకం.. ఇంకోటి మా బాల్య స్నేహం.. 
Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

7 Responses to సరిగ్గా ముప్పై ఐదేళ్ళ కిందట ఇదే రోజు…

 1. murali says:

  aa palitham yemito kuda chebite baguntundi

 2. ఆ పాత మధురాల్లోకి ఒక్కసారే వెళ్ళిపోయాను స్వాతంత్ర దినోత్సవం కోసం ఎంత ప్రిపరేషను ..రంగు కాగితాలతో క్లాసు రూం అలంకరణలు మన స్కూల్ నుండి కన్నన్ హై స్కూల్ కి డక్కిడాన్సు లకి పోటీల నిమిత్తం వెళ్ళడం …మొత్తానికి చిత్తూర్ ఒకసారి మనస్సు తిరిగి వచ్చేసింది
  .సో అలా అన్నగారి మెడిసిన్ సీట్ విషయం మీకారోజు తెలిసిందన్నమాట !

  • mhsgreamspet says:

   మురళి గారు…
   ఫలితమేంటో చిన్ని గారు కామెంట్ లో చెప్పారు… 🙂
   చిన్ని గారు…
   చాల సంతోషమండి మీకింకా ఆ రోజులు అంత బాగా గుర్తున్నందుకు.. ధన్యవాదాలు..

 3. Ramakrishna,iam glad for recollec tion of those memorable events of 35years old.Infact my hatsoff2 u for ur memory,which reflects our friendship.

 4. R SURESH says:

  dear U R in Seventh C section where I was at D-Section. I remember,
  in the absence of one of our teacher our two classes were combined
  at C-Section and there was a competetion of C & D section in Maths,
  I think maths formulas. U R from C Sec & I am from D Sec. After
  I forgotten. If U remember please continue……

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s