ఈ మధ్య ఓ పాట విపరీతంగా గుర్తుకొస్తోంది.. ఈ పాట వింటే మళ్ళీ బాలు గళం తో తొలి ప్రేమలో పడ్డ ఆ రోజులు గుర్తోచ్చేసాయి.. ఆ పాట తొలి చరణం ఇలా వుంటుంది..
నీలి నింగి లో కోటి తారలు మాలలల్లి తేనా..
అందమైన ఆ చందమామ నీ కురుల తురుమ వలెనా…
అణువణువున నీవే వ్యాపించినావనీ..
ఈ పాట పల్లవి గుర్తొచ్చిందా…? ఆ పాట గుర్తొస్తే మటుకు … బాలు గళామృతంలో తడిసిన ఓ హృద్యమైన పాట ని గుర్తు తెచ్చుకున్న అనుభూతి కలుగుతుంది.. గుర్తు రాకుంటే రేపటి వరకూ జవాబు కొరకు ఆగాలి మరి..
Advertisements
ఈ పాట సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సినిమాలో పాట అనుకుంటున్నాను..అండీ!
ఎందుకంటే.. “ఒక్కడు”… సినిమాలో.. ఈ తరహా డైలాగ్ ఉంది. నేను ఈపాట విని ..అప్పుడు ఆహా.. తండ్రి పాట .కొడుకు డైలాగ్స్ ..అని అనుకున్నట్లు గుర్తు.తప్పయితే మన్నించేయాలి..మరి 🙂
వనజ గారు
కరెక్ట్ గా చెప్పారండీ.. ఆ పాట కృష్ణ గారి చిత్రం “అభిమానవతి” చిత్రం లోనిది.