పంటి కింద రాళ్ళలా అనిపించే కొన్ని పద ప్రయోగాలు

తెలుగు భాష గురించి చెప్పేంత స్థాయి లేకున్నా ఈ మధ్య కొన్ని తెలుగు భాషలో చేస్తున్న పద ప్రయోగాలు (నివారించదగ్గ) చూస్తుంటే, ఆ పద్ధతికే అలవాటు పడిపోతామేమో అనే ఆందోళన కలుగుతోంది..
 
“ఫలానా పోటీలలో ఫలానా విద్యార్థుల ‘హవా’ …”
“ఫలానా వ్యక్తి పై ఫలానా వ్యక్తి ‘గరం గరం’ …”
“ఈ రోజునుండే ఫలానా పోటీలు ‘షురూ’..”
“ప్రబలుతున్న వ్యాధుల ‘డర్’ “
“ముంచుకొస్తున్న ‘ఖత్రా’..”
“ఫలానా విషయం పై వీడని ‘డైలమా’…”

“జోరు మీదున్న భూ దందా”

 
పైన పేర్కొన్న ప్రతి పరభాషా పదానికీ వాడుకలోనున్న పదాలు ఉపయోగించగలిగీ, పరభాషా పదమిశ్రమాలు వాడటంతో భాషలోని సొబగులు మసకబారుతున్నాయి. వీటితో బాటు, పద దోషాలు (సమైఖ్య.., భాద లాంటివి), సరైన పదాలు వాడక పోవటం చాల సాధారణంగా చూస్తున్నాం. ఆ మధ్య ఓ చోట.. “నిబంధనలు అధిగమించిన వారికి జరిమానా” అన్న హెచ్చరిక వాడటం గమనించాను. అతిక్రమించటం బదులు అధిగమించటం అన్న పదం వాడారు.. ఇలా ఎన్నెన్నో..
 
గ్రాంధికంగా భాష వాడనక్కరలేదు.. అవసరమున్న చోట వాడుకలో ఉండే పర భాషా పదాలు వాడినా పరవాలేదు..  కాని మన భాష లోని అమూల్యమైన పద సంపదనే మర్చిపోయేంత గా ఉండటం మాత్రం ముందు తరాలలో భాష మనగలగటానికి ఆశనిపాతమే..
 
మీరేమంటారు..?
Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

4 Responses to పంటి కింద రాళ్ళలా అనిపించే కొన్ని పద ప్రయోగాలు

 1. Jai Gottimukkala says:

  మీ ఉదాహరణలలో కొన్నిఇతర భాషలను వచ్చిన పదాలు (జోరు, జరిమానా) ఉన్నాయి. గురజాడ శ్రీశ్రీ లాంటి మహామహులే ఉరుదూ & ఆంగ్లం నుండి వలస వచ్చిన మాటలు అనేకం వాడారు.

  సంస్కృత ప్రేరేపితం అయిన పదకోశాన్ని తొలగిస్తే తెలుగు వెలవెల పోతుంది. అలాగే తమిళ కన్నడ ప్రభావం కూడా తక్కువేమీ కాదు.

  ఒకప్పుడు పరభాషా పదాలుగా పరిగణించబడే ఎన్నో పదాలు ఈరోజు తెలుగులో అంతర్భాగం అయినాయి. ఒక భాష ఎదుగుదలలో ఇది సహజమయిన ప్రక్రియగా గుర్తించాలి. ఈ పోకడలు తెలుగులోనే కాదు కన్నడ, హిందీ తదితర భాషలో కూడా కనిపిస్తాయి.

  The use (and subsequent internalization) of loan words is a healthy process that enriches a language and prolongs its usefulness.

 2. The usage of words of other languages are permited in speaking.But in writing usage of other languages to be curtailed by all means, the commission for official language in A.P.is issuing reminders to all official&non official organisations

 3. Chandu says:

  Yes. Really it is irritating!
  1. వార్తలు చదివే అమ్మాయి – నిస్సందేహంగా తెలుగు రాని అమ్మాయి – క్రికెట్ గురించి మాట్లాడుతూ – “చుక్కలు చూపించాడు”. క్రికెట్ వైభవాన్ని చెప్పడానికి ఇవి తెలుగు జాతీయాలు కాబోలు.
  2. రాణా తో త్రిషా “హల్ చల్”
  3. – గ్రామాల నుంచి ఒక పాత్రికేయుడు మాట్లాడుతున్నాడు: ‘ఇక్కడ గుడిలో పూజలు జరుగుతున్నాయి. ‘అదేవిధంగా ‘ ఇంకా జరుగుతాయి. ఇక శివుడు ‘గురించి చెప్పాలంటే ‘ – బాగా జరుగుతాయి. ఇక అమ్మవారి ‘విషయానికొస్తే ‘ – ‘అదే విధంగా’ – ‘అలాగే’ పక్కనున్న మరో గుడి – ‘అదే విధంగా ‘

 4. Chandu says:

  మీ బ్లాగ్ లో చాలా ఆత్మీయత ఉన్నదండీ. ముఖ్యంగా మీరు మీ అందరి టీచర్స్, మేస్టర్స్ గురించి రాసినది. చాలా మంచి బ్లాగ్ మీది. చదువుతూ ఉంటే మా గ్నాపకాలు గుర్తుకొచ్చాయి. ధన్యవాదాలు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s