గురువుల జ్ఞాపకాలతో …

ఈ బ్లాగులో స్నేహానికి అగ్ర తాంబూలమిస్తే… తదుపరి అంతే ప్రాముఖ్యత ఇవ్వబడే అంశం మమ్మల్ని తీర్చి దిద్దిన మా స్కూలు గురువుల   గురించే.. గత మూడు సంవత్సరాల నుండి ప్రతి ఏడూ మా మిత్రబృందం మా వూళ్ళో కలిసిన ప్రతి సారీ మాకు అందుబాటులో ఉన్న గురువులను మా సమావేశానికి ఆహ్వానించటం, వారి ఆశీస్సులను తీసుకోవటం జరిగింది.  ఏ మహనీయుడి జన్మ దినాన్ని గురుపూజోత్సవంగా సంస్మరించు కుంటున్నామో, ఆ మహానుభావుడు డా సర్వేపల్లి రాధా కృష్ణన్ గారు కూడా మా వూరికి సమీపంలోనే జన్మించటం మా సుకృతం.

ఈ బ్లాగు సంకలినుల్లో చేర్చక మునుపు, కేవలం మా బాల్య స్నేహితుల కోసం కొన్ని టపాలు రాయటం జరిగింది.. అందులో ఓ టపా మా గురువుల జ్ఞాపకాలతో ఓ సింహావలోకనం కూడా వుంది.. మరొక్క సారి ఆ టపా పూర్తి పాఠం మీ అందరి కోసం..

మా గురువుల   జ్ఞాపకాల హరివిల్లు 

ఒక డాక్టరు తప్పిదం తో ఓ నిండు ప్రాణానికి నష్టం. ఓ లాయర్ తప్పుతో… ఓ కుటుంబానికి నష్టం… కానీ ఓ టీచర్ తప్పు చెపితే… ఓ తరానికి నష్టం.. అందుకే… తల్లి, తండ్రుల సమాన స్థానం లో గురువును మనం గౌరవిస్తాము. మనం చదువుకున్న రోజుల లో గురువులకున్న నిబద్ధత … నిష్పక్షపాత ధోరణి. మనం చేసుకున్న అదృష్టం. వారి స్టాంప్ మన అందరి వ్యక్తిత్వం లోను కనపడుతుంది. మన అక్టోబర్ ఫంక్షన్ లో గురువులను సన్మానించుకున్నప్పుడు ఆ గురువులన్దరి కళ్ళలో ఆనంద బాష్పాలు.. మన మిత్రులందరికి ఎంతో ఆత్మ సంతృప్తి కలిగాయి. ఇంతకుమునుపు రమణ సార్ గురించి చెప్పుకున్నాము . ఈ రోజు మిగతా గురవులందర్నీ స్మరించు కుందాము .

అనసూయ madam
madam మాకు social కి , maths కి వచ్చేవారు lower classes లో . ఉన్న వాళ్ళలో తను అప్పటికి junior. తను చాల శాంతం గ ఓపిక గ పాఠాలు చెప్పేవారు . తన class ఎప్పుడూ పిల్లలకి ఉత్సాహం గా ఉండేది . Madam మన function కి కూడా వచ్చారు . నేను నా job లో teach చేసేటప్పుడు madam నుండి అలవరచు కున్న గుణం … విధ్యార్థులని ఆత్మీయం గ చూడటం . Madam 2009 లో రిటైర్ అయ్యారు.

పరమేశ్వరి మేడం
తను మా 7 వ తరగతి సి సెక్షన్ క్లాసు టీచర్. ఇంగ్లీషు (అనుకుంటాను) చెప్పేవారు. తగ్గు స్వరం లో చెప్పే వారు. కోపం వస్తే మాత్రం… బాగా మందలించే వారు. ఒక సారి, మన compositions కరెక్ట్ చెయ్యటం లో సాయం చేయటానికి మేడం ఇంటికి వెళ్ళాము. చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. ఇల్లు వినాయక స్కూల్ కి ఎదురు గ ఉండేది. మన క్లాసు మేట్స్ విజయ, బాల , శీన మేడం దగ్గర ట్యూషన్ వెళ్ళేవారు. 1977 లో ఎన్నికలు జరిగే సమయం. మనలను, మీరు ఎవరికి వోటు (వోటు ఉంటె) వేస్తారు అని మేడం అడిగింది. చాల మంది అప్పుడే ఏర్పడిన జనత పార్టీ కి అన్నారు. అది చూసి.. మేడం సింపుల్ గ ఓ కామెంట్ చేసారు… ” చంద్రుడు కనపడ లేదని… వెన్నెల వేరే చోటికి వెలుతుందా” అని.

సీత లక్ష్మి madam
తను మనకు 6 వ క్లాసు లో సోషల్ స్టడీస్ కి వచ్చేవారు. చాల సింపుల్ గ ఉండేవారు. తను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు . తన బ్రదర్ రాఘవయ్య గారు అప్పటికే retired టీచర్ అనుకుంటాను.

ఇందిరా madam
తను మనకు 6 వ క్లాసు లో సైన్సు కి వచ్చేవారు. మన క్లాసు mate సుకన్య కి తను బాగా కావాల్సిన వారు.

రాజేశ్వరి madam
తను మాకు ఇంగ్లీష్ చెప్పేవారు sixth లో. క్లాసు టీచర్ కూడా

శకుంతల madam
తను కూడా సైన్సు కి వచ్చేవారు. మన క్లాసు మేట్ ఎల్. కే వాళ్ళ మదర్ తను. తను చాల మృదు భాషి. ఎక్కువ మాట్లాడరు. కాని చాల affectionate గ ఉంటారు.

కృష్ణప్ప సర్
తెలుగు లో తొలి మెరుగులు దిద్దిన టీచర్ కృష్ణప్ప గారే. మంచి కథలతో రాగ యుక్తంగా పద్యాలను చదువుతూ పాఠాన్ని చెప్పే వారు. తను చెప్పిన కొన్ని పద్యాలు…
“కుమ్మరి వాడు చక్రము.. ఇలాగ తిప్పుచుండును… ఇలాగ తిప్పుచుండును… కుండంబు చేయును…
ఇట్లు రంప కారులు..రంపంబు కోయు చుందురు .. రంపంబు కోయు చుందురు… నిండా కష్టమ్ముతో… “

పై రెండు stanzas ని… సర్ చక్క గ అభినయం చేసి చూపుతూ చెప్పేవారు. తనని చూసి భయ పడే వాళ్ళం కాని.. చక్కని టీచర్ తను…
చిన్న వయసు లోనే అకాల మరణం చెందిన ఆ గురువు గారికి ఇదే మన శ్రద్ధాంజలి.

బాలసుబ్రమణ్యం సర్
ఉపాధ్యాయుడు అన్న పధం వింటూనే, మన ముందు ఓ పంచ కట్టు తెల్లటి ధోతి, కండువ, తో ఉన్న గంభీర రూపం సాక్షాత్కరిస్తుంది ఆ రూపమే బాలసుబ్రమణ్యం సర్. తను మనకి 6 ,7 తరగతులలో హిందీ బోధించేవారు. మిత భాషి.. చక్కగా చెప్పి… తన పని తను చేసుకొని వెళ్ళేవారు. మనందరికీ… సంచయిని అనే పొదుపు పాస్ పుస్తకం ఇప్పించి… పొదుపు అలవాటు చేసారు సర్… సర్ గురించి… మీ దగ్గర ఇంకేమైనా input ఉంటె నాకు పంపగలరు.

పుష్పరాజ్ పౌల్ సర్
మన P.T. మేష్టారు. సర్ తో సమయం ఎంతో సరదా గ ఉండేది. మనం prayer కి ground లో assemble అయినప్పుడు… అందర్ని నవ్విస్తూ…. భయపెడుతూ.. line లో ఉండే టట్లు చూసేవారు. తన favorite తిట్టు… ” ఏరా డోక్లికే … ” అని. దాని అర్థం తెలియక పోయిన అందరం నవ్వుకునే వాళ్ళం. వాళ్ళ అమ్మాయి శశి కిరణ్ మన క్లాసు మేట్. తను అప్పుడు ఎంత గల.. గలా మాటలా డేదో … ఇప్పుడూ అంతే…సర్ చిత్తూర్ లో చక్కటి retired లైఫ్ ని ఆస్వాదిస్తున్నారు.

నారాయణ సర్
మన డ్రాయింగ్ మాష్టారు. అలవోక గా బొమ్మలు గీసే వారు. అందరితో jolly గ ఉండేవారు. తను స్వర్గస్తుల్లయ్యారు.

చార్లీ సర్
సర్ నిత్య యవ్వనుడు. సర్ తిట్టినా కూడా.. చాల మార్దవం గ తిట్టేవారు. ఇప్పుడు కూడా అంతే చలాకి గ, అంతే graceful గా అదే కామిక్ timing తో కాలం గడుపుతున్నారు. అక్టోబర్ లో జరిగిన మన ఫంక్షన్ లో సర్ ఎంతో చక్క గ ఆ కాలం నాటి పాటలు పాడి… అందరి తో చప్పట్లు కొట్టిస్తూ చేయించిన సందర్భం… అపూర్వం, అనిర్వచనీయం.. సర్ చిత్తూర్ లో ఉన్నారు. madam స్వర్గస్తుల్లయ్యారు. మీరు ఎవరు చిత్తూర్ వెళ్ళిన… సర్ ని వెళ్లి పలకరించండి.. మీరందరూ నా పిల్లలే అని.. లాస్ట్ ఫంక్షన్ లో తను చెప్పినప్పుడు.. కదలని హృదయం లేదు… చెమర్చని కన్ను లేదు. సర్ మనకు ఇంగ్లీష్, సోషల్ చెప్పేవారు.

దామోదరం సర్
మన తెలుగు సర్. తను వస్తున్నారంటే.. అందరి గుండెల్లో దడ … పెద్ద నామం.. గంభీర రూపం…చూస్తే వణుకు… కాని… తన క్లాసు లను విన్న తర వాత… భయం స్థానే భక్తి పుడుతుంది… తను lesson కి ముందు ఇతర విశేషాలను కథల రూపం లో చెప్పే వారు. ఎంతొ ఇంటెరెస్టింగ్ గా ఉండేది. కోపం ఎక్కువే ఐన… తన పాండిత్యం చాలా గొప్పది.

రామకృష్ణ సర్
తను మన క్లాసు మేట్ కే. కే వాళ్ళ ఫాదర్. 9 , 10 classes లో తెలుగు చెప్పే వారు.. సాహితీ ప్రపంచం లో సర్ కి తనదైన ముద్ర ఉన్నది. ఎన్నో సాహితీ కార్య క్రమాల్లో ఇప్పటికీ పాల్గొంటూ ఉంటారు. మంచి వక్త. మన ఫంక్షన్ లో సర్ వచ్చి మన అందరిని ఆశీర్వదించారు. మన విజయకృష్ణ ఫాదర్ శ్రీ ముని సుందరం గారు కూడా తెలుగు సాహిత్యం లో నిష్ణాతులు.

చెంగమ్మ madam
తను మనకి సైన్సు చెప్పే వారు. మన ఫంక్షన్ కి కూడా వచ్చారు.

వసంత madam
మనకి 8 క్లాసు లో వచ్చేవారు. ఇంగ్లీష్ చెప్పే వారు. రోజు 2 పేజీలు ఇంగ్లీష్ లో వ్రాయమని కొంత మందికి చెప్పారు. వాళ్ళ నోట్స్ మన వాళ్ళు కొంత మంది దిద్దే వారు. నాకు ఇద్దరిని ఇచ్చారు..నోట్స్ దిద్దమని… ఒకరు పట్టాభి రెడ్డి (తను చిత్తూర్ RTC ఉన్నాడు.) ఇంకొకరు… స్వర్ణ లత (తను ఇప్పుడు సెలెబ్రిటి… ఎన్నో సినిమాలకి డాన్సు డైరెక్టర్)

కమల madam
తను మన 9 బి సెక్షన్ కి క్లాసు టీచర్. సైన్సు చాల బాగా చెప్పే వారు. ఎంతో involvement ఉండేది madam లో. ఎందు కంటున్నాను అంటే… ఒక సారి… మన వాళ్ళు ఏదో తప్పు చేసారని… క్లాసు లో మనకి బుద్ది చెపుతూ… madam ఎడ్చేసారు. అది చూసిన క్లాసు మొత్తం ఆ రోజు కన్నీటి లో మునిగింది. తను ఇంగ్లీషు కూడా చెప్పే వారు. madam ఇప్పుడు బెంగళూరు లో ఉంది. భయము… భక్తి … సమ పాళ్ళల్లో ఉండేవి madam అంటే..

నాగ భుషనమ్మ madam
Madam అప్పుడే అంటే 1978 లో చేరారు జాబు లో. మనకి composite లెక్కలు చెప్పే వారు. 8 క్లాసు composite లెక్కల బుక్కు చాల లావు ఉండేది. ఆ సైజు చూసే… చాల మంది జనరల్ లెక్కలు తీసుకున్నారు. క్లాసు 3 వ నంబరు గది లో ఉండేది. లెక్కలు క్లాసు లో కిట్ట, madam కలిసి లెక్కలు solve చేసేవారు ఒక్కో సారి. తను కూడ ఈ మధ్యనే రిటైర్ అయ్యి తిరుపతి లో ఉన్నారని తెలిసింది.

కోదండ రెడ్డి సర్
మన హెడ్ మాస్టర్ గ ఉన్నారు. తను మనకి ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేవారు. తను ఫాలో అయ్యే రెన్ & మార్టిన్ పుస్తకం ఇప్పటికి నేను వాడుతుంటాను. ఇప్పుడు చెప్పే టీచర్స్ గ్రామర్ అస్సలు పట్టించుకోరు. కేవలం intuitive గ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెపుతుంటారు. అంటే… పక్క వాళ్ళు ఎలా మాట్లాడితే … దాన్ని అనుకరిస్తూ మనం మాట్లాడటం అన్న మాట.. ఈ విషయం లో మా పిల్లల టీచర్స్ తో నాకు ఎప్పుడూ గొడవే… ఆ సందర్భం లో సర్ గుర్తు వస్తారు… తను చాల చక్క గ గ్రామర్ చెప్పేవారు. అది నాకు ఎంతో ఉపయోగపడింది.

రెడ్డప్ప రెడ్డి సర్
మన హిందీ టీచెర్. చాల గమ్మత్తు గ ఉండేవారు. తన లో తనే నవ్వుకుంటూ… జోకులు వేసుకుంటూ తనదైన ఓ లోకం లో ఉండేవారు. అప్పుడప్పుడూ కోప్పడుతూ ఉండేవారు. తను చాల ఏళ్ల క్రితం మరణించారు.

మన అందరిలో… జ్ఞాన దీపాలు వెలిగించిన మన గురువులందరికీ… మనం ఎంతో రుణ పది ఉన్నాము. ఇలా ఎందరో గురువులు… సమయాభావం వల్ల… కొంత మతి మరుపు వల్ల… ఎవరినైనా మరిచి ఉంటె.. కరెక్ట్ గ రాయకుంటే… మనసారా మన్నించ గలరు.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

One Response to గురువుల జ్ఞాపకాలతో …

  1. Suresh Jakka says:

    Very nice post. Even though we did not had the most attractive school building in town, these teachers made it most beautiful school in town…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s