ఆ చిత్రాలు చూసేప్పుడు, టీ వీ రిమోట్ పని చేయదు

విమానం లో ప్రయాణం చేసేప్పుడు, భూమి పై నుండి కొంత ఎత్తు వరకు గాలుల సవ్వడులు, మేఘాల కదలికలు, విమానం ఊగిసలాటలు.. వీటన్నిటితో  ఓ turbulency వుంటుంది.. వీటినన్నిటిని అధిగమించి, ఇంకాస్త ఎత్తు కి ఎగిరేసరికి, చుట్టూ పరుచుకున్న నీలాకాశం, కింద దూది పింజల్లా కనిపించే మేఘాలు, విమానం అసలు కదుల్తోందా అన్నట్లుగా ఓ నిశ్చలత… ఎటు చూసినా నిశ్శబ్దం, ఎదురౌతుంది … probably that is the time you find peace with yourself… you understand the semblance of silence… you get to know the shrillness in sound  of silence.


ఇవన్నీ ఎందుకు చెపుతున్నానంటే.. కొన్ని చిత్రాలు చూస్తే ఇలాంటి భావనే కలుగుతుంది.. ఆ చిత్రాలలో కథలు కనిపించవు… మానవ సంబంధాలతో అల్లుకున్న కొన్ని జీవితాలు కనిపిస్తాయి.. వ్యధలుంటాయి, దుఖముంటుంది  .. వాటిని వెంటాడుతూనే కారుమబ్బును చుట్టుకున్న వెండి తీగ లాగ వెలుగు వైపు నడిపించే ఆశా కిరణాలుంటాయి  .. మోడువారిన కొమ్మలకు తొడిగే లేత చివుళ్ళున్టాయి … అందుకే అలాంటి చిత్రాలను చూసేపుడు చేతిలో రిమోట్ ముందుకెళ్లదు  .. మనసు ఓ అచేతనావస్థలోకి  జారుకుని, గాఢ సుషుప్తిలోకి వెళ్ళిపోతుంది.  అక్కడ అంతా ప్రశాంతతే… shrillness of సౌండే 
 
అలాంటి చిత్రాలేవంటారా..? ఈ మధ్య కాలంలో ఓ రెండు చిత్రాలు చూసాను.. పాత చిత్రాలే.. పాటలు ఎప్పుడూ వింటూనే వున్నా ఆ చిత్రాలనెప్పుడూ  పూర్తిగా చూడలేదు. ఆ రెండు సినిమాలు గుల్జార్ కలం జాలువారిన చిత్రాలే.. ” మౌసం”, “పరిచయ్” .. ఆ చిత్రాలలోని పాటలు… మౌసం లోని “దిల్ డూండ్ తా హై ఫిర్ వహీ”  అన్న పాటని ఎన్ని సార్లు విన్నా అదే గగుర్పాటు… అదే haunting feeling.. అలాగే పరిచయ్ లోని “ముసాఫిర్ హూ యారో…” పాట  లో వ్యక్తపరిచే జీవితం పై అవ్యాజమైన ప్రేమ… ఎక్కడికో సుదూర తీరాలకు తీసుకెళ్తాయి.. 
 
ఈ చిత్రాలలోని కథ కూడా ఎంతో సిపుల్ గా, కాని touching గా వుంటుంది. మౌసమ్ లో జ్ఞాపకాలను వెతుక్కుంటూ వెళ్ళిన ఓ డాక్టరుకి తను ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి కూతుర్ని చూసి, తనని ఆదరించే పాత్రలో కనిపించిన సంజీవ్ కుమార్ ని ఎప్పటికీ మరిచిపోలేము. అలాగే “పరిచయ్”  చిత్రం లో అపార్ధాలతో దూరమైనా ఓ కుటుంబం లోని తాతయ్యని, అతని కొడుకు పిల్లల్ని కలిపి వారి జీవితాలనుండి దూరమయ్యే మాష్టారి పాత్రలో జితేంద్రనీ  మరువలేము. ఇలాంటి చిత్రాలను చూసేప్పుడు కలిగే భావం వర్ణించ లేనిది. the feeling leaves you peeping into yourself.. makes you nostalgic.. haunts you sweetly and gently.. Really hats off to the creative genius… Mr Gulzaar.. 
 
 
 
 
Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s