…. కాని నువ్వు లేవు …..

ఓ మలయ సమీరం మేను తాకి వెళ్తోంది
… కాని నువ్వు లేవు… పులకరించటానికి  
ఓ కోయిల గానం కర్ణాంతరాళాలలోకి  చేరుతోంది
… కాని నువ్వు లేవు…. ఆస్వాదించటానికి
నిశి రాతిరి వెన్నెల కళ్ళను కప్పేస్తోంది
… కాని నువ్వు లేవు…. పరవశించటానికి

ఎన్నో జ్ఞాపకాల పరిమళం కమ్మేస్తోంది

… కాని నువ్వు లేవు….  పంచుకోటానికి 
 
 ఇన్నాళ్ళకు… ఇన్నేళ్ళకు
 
కంటి ముందు నీ రూపం ఆర్తితో కనపడుతోంది
  … కాని నేను లేను ….  పయనించటానికి
Advertisements
This entry was posted in సొంత కవిత్వం. Bookmark the permalink.

4 Responses to …. కాని నువ్వు లేవు …..

 1. కాని నేను వున్నాను చదవటానికి 🙂
  చాల బాగుంది .

 2. మనిషి భౌతికం గా ఉంటేనే కదండీ … కంటి ముందు రూపం ఆర్తి తో కనబడేది..
  నేను లేను ..పయనించడానికి..
  భావం నిగూడంగా బరువుగా.. 😦
  ఇలాగే ..వ్రాస్తూ ఉండండి. చాలా బాగుంది.

  • mhsgreamspet says:

   ముందు “నిశ్చలమైన కంటి ముందు ..” అని రాసి మొదటి పదం తీసేసాను. అయినప్పటికీ భావాన్ని గ్రహించగలిగారు.. సూపెర్బ్ అండీ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s