జీవిత పరమార్థం – Simplified

ఈ రోజు ఈ మెయిల్ లో ఓ ఫ్రెండ్ పంపించిన ఓ చిన్న Anecdote …  బాగా నచ్చింది… మీతో పంచుకోవాలన్నంతగా.. ఆ మెయిలు లోని సారాంశం  మీ కోసం..
 
ఎక్కడెక్కడో ఉన్నత స్థానా ల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న కొంత మంది పూర్వ విద్యార్థులు, వారి గురువు గారిని కలవటానికి కళాశాలకు వెళ్తారు. తామున్న ఉద్యోగాలలోని సాధక బాధకాలు, జీవితం లో ఎదుర్కుంటున్న సవాళ్ళను  గురువుగారితోను, స్నేహితులతోను  పంచుకుంటూ, తామెంత అశాంతికి గురౌతున్నామో చెప్పుకుంటారు. 
 
అదంతా వింటున్న గురువు గారు లోనకెళ్ళి వేడి వేడి కాఫీని ఓ కేటిల్ లో ను, ఓ ప్లేట్ లో వివిధ రకాలైన కప్పులు (నాసి రకం వి, పింగాణివి, పూల దేజైన్లతో ఆకర్షణీయంగా వున్నవి ) తీసుకొచ్చి ” పిల్లలూ… కాఫీ తాగండి” అని ఆఫెర్ చేస్తాడు. వెంటనే వాళ్ళంతా, తమకు నచ్చిన కప్పులు ఏరి కోరి ఎంచుకుని, అందులో కాఫీ వొంపుకుని తాగటం మొదలెడతారు.
 
అది చూసాక గురువు ఇలా అంటాడు, “మీరొకటి గమనించారా.. మీరంతా మీకు నచ్చిన కప్పులెన్నుకుని , కాఫీ తాగుతున్నారు… ఫలితంగా నాసి రకం కప్పులు మాత్రం ఎవరూ తీసుకోలేదు. మీరందరూ, మంచి కప్పులు కావాలనుకుని ఎంచుకుని తీసుకున్నారు.. అందరూ తాగే కాఫీ ఒకటే అయినా…. తాగుతూ, ఇతరుల కాఫీ కప్పు డిజైన్లు తమ కప్పుల కంటే బాగున్నాయేమో అని మధన పడటం మొదలెట్టారు. ఫలితంగా తాగే కాఫీని ఆస్వాదించటం మరిచిపోయారు. అదే సకల సమస్యలకు మూలం. 
 
ఇదే మీ జీవితానికి అన్వయించుకోండి.. మీ జీవితం కాఫీ అయితే, మీ ఉద్యోగం, డబ్బు, పరపతి అన్నీ కప్పుల లాంటివి. They are just tools to hold and contain Life, but the  quality of Life doesn’t change. Sometimes, by concentrating only on  the cup, we fail to enjoy the coffee in it.
 
కాబట్టి కప్పులు మిమ్మల్ని శాసించనీయకండి  .. కప్పులోని కాఫీని ఆస్వాదించటం నేర్చుకోండి.”
 
Dont you think it is demystifying the “Art of living ” in simple terms.. ? I felt it so… 
Advertisements
This entry was posted in ఫిలాసఫీ. Bookmark the permalink.

3 Responses to జీవిత పరమార్థం – Simplified

  1. voleti says:

    very nice..

  2. Tejaswi says:

    చాలా బాగుందండి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s