కాల చక్రంలో వెనక్కి తీసికెళ్ళే ఓ పాట

దేవుడు ప్రత్యక్షమై మళ్ళీ గతంలో జీవించటానికి ఓ టైం పీరియడ్ ని ఎన్నుకోమంటే, ఏ మాత్రం తడుముకోకుండా 76 -81 లో నేను చదువుకున్న స్కూలు రోజుల్లో జీవించాలనుకుంటాను. ప్చ్.. ఆ అదృష్టం లేదు కాబట్టి.. అలా ఆ రోజుల్లోకి వెళ్ళటానికి నేను ఎంచుకున్న మార్గం ఆ రోజుల్లో నాకిష్టమైన పాటలు వినటం.. ఆ పాటలు వింటుంటే మళ్ళీ ఆ రోజులు… అ రోజుల తాలుకు జ్ఞాపకాలు చుట్టూ ముట్టేస్తాయి … ఓ స్వాప్నిక జగత్తులో తేలియాడిస్తాయి..

 
అలా గతం లోకి తీసుకెళ్ళేది  “వయసు పిలిచింది” లోని పాటలు. అందులో అన్ని పాటలు ప్రత్యేకమైనవే అయినా..”ఇలాగే ఇలాగే సరాగమాడితే…” అనే పాట ప్రత్యేకించి నన్ను మా ఊళ్ళోకి తీసుకెళ్ళిపోతుంది… అప్ప్లట్లో  సినిమా ప్రచారం ఎలా ఉండేదంటే, ఓ బండి లో mike పెట్టి, ప్రచారం చేస్తూ, మధ్య మధ్యలో ఆ సినిమా పాటలు వేస్తూ వీధి వీధి తిరిగే వారు..అలా విన్న పాటల్లో ఈ పాట బాగా గుర్తుండేది..
 
తమిళ నాడు దగ్గరలో ఉండటంతో మాకు ఈ పాటల తమిళ వెర్షన్ కూడా వినే అవకాశం దొరికేది. మా వూరి ఎం. ఎస్. ఆర్ సినిమా టాకీసు లో ఈ సినిమా వచ్చింది. అప్పట్లో ఓ మాటినీ షో కి వెళ్లి ఈ సినిమా చూసిన గుర్తు.. ఈ పాట , చిత్రం చివర్లో మళ్ళీ వినిపిస్తారు.. ఈ సినిమా మళ్ళీ చూడక పోయినా, ఆ నాటి జ్ఞాపకం అలాగే ఉండిపోయింది. 
 
ఎందుకో ఈ పాట .. it smells in every bit and detail the fragrance of my town… it takes me through a nostalgic  stroll in the streets of my town.. it takes me back to those golden yester years where I had the purest form of life in the form of my childhood friends.
 
ఆ పాట మీ కోసం ఇక్కడ.. 
Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

One Response to కాల చక్రంలో వెనక్కి తీసికెళ్ళే ఓ పాట

  1. ఎన్నో సార్లు వినడమే కాని ఎప్పుడు చూడని పాట చూపించారు. థాంక్ యు వెరీ మచ్ ..అండీ! డిటో..పాట పిక్చరైజేషన్ .
    దిల్-ఏ-నాదాన్ లో చాందిని రాత్ హై ఏక బార్ తుజే .. . చాలా నచ్చింది. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s