చూసే కళ్ళు అవే అయినా… ఎంత తేడా!

“Beauty is in the eye of the beholder “ అని ఓ నానుడి.. నా మటుకైతే అది నిజమేననిపిస్తుంది … చిన్నప్పుడు చదువుకున్న ఓ కథ.. అందులో చాలా ఆకలితో ఉన్న ఓ వ్యక్తి కి పళ్ళెం లో పంచ భక్ష్య పరమాన్నాలు పెట్టి, సరిగ్గా అతని తల పైన ఓ కత్తిని ఓ సన్నటి దారంతో వేలాడదీస్తారు. ఆ దారం తెగి, ఆ  కత్తి ఎక్కడ తన నెత్తిన పడుతుందోనన్న  భయంతో బిక్కు బిక్కుమంటూ పైకి చూసుకుంటూ అన్య మనస్కంగా భోజనం పూర్తి చేస్తాడు. భోజనం అయ్యాక, ఏం తిన్నావని అడిగితే, దృష్టంతా వేలాడే కత్తి పై ఉండటం మూలాన తను ఏం తిన్నదీ కూడా గుర్తు లేదని చెప్తాడు.. ఇందులో అర్థమయ్యేది ఏమిటంటే, ఒకరికి  concerns వేరే ఉన్నప్పుడు, అటువంటి వారు చేతిలో ఉన్న ఆనందాలను కూడా ఆస్వాదించలేరూ  అని.. 

 చాలా ఏళ్ళ కిందట నేను చదువుకున్న వూళ్ళో ఎప్పుడూ వాతావరణం ఎంతో ఆహ్లాదకరం గా  ఉండేది… చుట్టూ ఎప్పుడూ పచ్చదనం… ఎప్పుడూ పలకరించే వర్షపు జల్లులు… ఎక్కడకెళ్ళినా వినిపించే కోయిల స్వరాలు.. ఎంతో ప్రశాంతత… పట్టణాల రణ గొణ  ధ్వనులకు దూరంగా వుండే పరిసరాలు.. సాధారణంగా అయితే ఇలాంటి ప్రదేశంలో ఎవరైనా హాయిగా సేద తీరాల్సిందే.. కాని చదువుల ఒత్తిడి మూలంగా ఎప్పుడూ, అక్కడి ఆ ప్రశాంతతని ఆస్వాదించ గలిగే ఫీలింగ్ ఉండేది కాదు.. ఎప్పుడైనా నన్ను చూడటానికి వూరి నుండి ఎవరైనా  వచ్చి, ఆ ప్రకృతిని పొగుడుతుంటే అనవసరంగా చికాకు కూడా కలిగేది..
 
ఎందుకో ఈ మధ్య ఆ వూరికి వెళ్ళే అవకాశం వచ్చింది చుట్టపు చూపుగా.. ఉన్న ఆ రెండు రోజులూ అక్కడి పరిసరాల రమ్యతలో మమేకమైపోయాను.. పరిసరాలవే… ఏం మారలేదు.. కేవలం నేను మారాను.. సందర్భాలు మారాయి.. ఇప్పుడు తలపై వేలాడే కత్తులు ఏవీ లేక పోవటం వలన, మునుపు కోల్పోయిన ఆ అనుభూతులను తిరిగి పొందగలిగాను.. 
 
 
Advertisements
This entry was posted in ఫిలాసఫీ. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s