బ్లాగుల పై ఓ దృష్టి కోణం

బ్లాగు సంస్కృతి మంచిదా,  కాదా అని అప్పుడప్పుడు నాకెదురయ్యే ప్రశ్న..వ్యక్తుల మనస్తత్వాల బట్టి బ్లాగు బాగోగులు ఉంటాయి.. ఓ నిర్దిష్టమైన ఉద్దేశ్యంతో మొదలెట్టిన ఈ బ్లాగులో టపాలు ప్రచురించటం మొదలెట్టాక, నాకు గోచరించిన కొన్ని దృష్టి కోణాలు ఇదిగో ఇలా మీతో పంచుకోవాలనిపించింది..

చిన్నప్పట్నుండి ఖాళీ సమయాలలో బొమ్మలు గీయటం, అదీ బోరు కొట్టితే ఏదైనా కథలు రాయాలని ఉబలాట పడటం ఉండేది.. కాని రాయటం ప్రారంభంలో ఉండే ఉత్సాహం, పేపరు మీద పెన్ను పెట్టి ఓ రెండు, మూడు పేరాలు రాసే సరికి ” అబ్బ చెయ్యి నొప్పెడుతోంది.. తరవాత రాద్దాం లెద్దూ..” అని మనలోని బద్ధకిష్టు నిద్ర లేచి శివ తాండవం చేసేసరికి ఆవిరయ్యేది .. అంతే ఆ రాతలు అసంపూర్తిగా మిగిలిపోయేవి.. పైగా మనం రాసినవి ఎవరు చదువుతారు..ఎవరు ప్రచురిస్తారు… మన రాతలకంత అదృష్టమేక్కడిది అని కూడా ఒకింత నిరాశ, నిర్లిప్తత, నిరుత్సాహం కమ్మేసేవి. ఫలితంగా ఈ రచనా వ్యాసంగం అన్నది బ్లాగు మొదేలేట్టేవరకూ టేక్ ఆఫ్ కాలేదు. మా చిన్న నాటి స్కూలు విశేషాలు బ్లాగుల ద్వారా మా మిత్రులతో పంచుకోవాలని ఈ బ్లాగుని ప్రారంభించాక, ఎప్పటినుండో నిద్రాణమై ఉన్నరచనాసక్తి మళ్ళీ మేల్కొంది. ఫలితంగా గడిచిన రెండేళ్లలో మీ అందరితో పంచుకున్న చిన్న నాటి విశేషాలు, నాకిష్టమైన పాటలు, చిత్రాలు, ఎప్పటినుండో రాయాలనుకున్న  కథలు  ఈ బ్లాగు పుణ్యమా అని సాకారమయ్యాయి. బ్లాగన్నదే లేకుంటే బహుశా ఇది ఎప్పటికీ జరిగేది కాదు.. అప్పుడప్పుడూ జీవితాన్ని సింహావలోకనం చేసుకోవాలంటే, బ్లాగు టపాలు తిరగేస్తే చాలు.. అలాగే మన లాంటి అభిరుచులు కలిగిన ఇతర బ్లాగర్లు, వారి రచనలూ చూసాక అనిపించింది, మనం పత్రికలలో చదివే కథలు, కథనాలకన్నా చక్కగా రాసే వారు, అధిక విషయ పరిజ్ఞానం ఉన్నవారు ఎందఱో వున్నారు అని.. కేవలం సరైన అవకాశం లేక, తగినంత సమయం వెచ్చించలేక పోవటం వలన వారంతా అలా తెర వెనకే ఉండిపోయారనిపిస్తుంది. బ్లాగుల మాధ్యమం ద్వారా ఇలాంటి ప్రతిభ ఉన్న వాళ్ళ రచనలు చదవటం నిజమైన విశేషమే..ముఖ్యంగా నాకు ఉన్న పాటల అభిరుచి కొంత మంది బ్లాగర్ల అభిరుచికి దగ్గరగా వుండటం విస్మయమే కాదు ఆనందాన్నికూడా కలిగించింది

చాటింగ్, సామాజిక నెట్ వర్కింగ్ లాంటి మిగతా మాధ్యమాల కన్నా, బ్లాగులు ఆ రచయిత యొక్క వ్యక్తిత్వాన్ని వాస్తవానికి దగ్గరగా ప్రకటించగలుగుతాయి అని నా అభిప్రాయం. ఎందుకంటే, పుంఖానుపుంఖాలుగా టపాలు రాస్తుంటే, ఆ రాతల్లో మనమేంటో ప్రతిబింబిస్తుంటుందన్నది నా విశ్వాసం.

తెలుగు మరిచిపోతానేమో, లేక మరిచిపోయానేమో అన్న మీమాంసలు ఎదురౌతున్న సమయంలో ఈ బ్లాగు వ్యాసంగం మొదలు కావటం మూలాన మంచి జరిగిందని అనిపిస్తుంది. బ్లాగు కి ఏభై వేల హిట్లు సమీపిస్తుండటంతో, బ్లాగుల పై నా అభిప్రాయాలు ఇలా పంచుకుంటూ … సెలవ్

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

4 Responses to బ్లాగుల పై ఓ దృష్టి కోణం

 1. మీరు చెప్పినది అక్షర సత్యం .. మీ మనసుని చక్కగా వ్యక్తీకరించారు. ఏబై వేల హిట్స్ అందుకున్నందుకు అభినందనలు.

  వ్రాయాలనుకుని.. వ్రాయలేనివి ఇంకా ఉంటాయి. తగిన శ్రద్ధ లేకపోవచ్చు.కానీ వ్రాయాలనే తపన అయితే ఉంటుంది.
  ఇప్పుడు కాకపోయినా మరెప్పుడైనా వ్రాసుకోవచ్చు కదా!

  వ్తాస్తూ ఉండండి. వ్రాస్తూనే ఉండండి.

 2. బాగా చెప్పారు.. అభినందనలు.
  రాస్తూ ఉండండి. మేం చదువుతూ ఉంటాం 🙂

 3. It’s a great opurtunity2share our feelings.continue the same .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s