“ఇంగ్లీష్ వింగ్లీష్” చిత్రం లో నచ్చినదేమిటంటే

ఈ మధ్య చూసిన ఓ చక్కని సినిమా “ఇంగ్లీష్ వింగ్లీష్”. ఎన్నో సమీక్షలు చదివాను ఈ చిత్రం గురించి. ఇందులో నాకు బాగా నచ్చిన సన్నివేశం శ్రీదేవి “జడ్జిమెంటల్ ” అన్న పదానికి తన niece దగ్గర అర్థం చెప్పించుకొనే సన్నివేశం. తను ఓ  టీ  వీ షో  లో ఈ పదాన్ని భార్య భర్తలు మాటికీ మాటికీ వాడుకోవటం చూసి ఆ పదానికి అర్థం తెలియక తన niece ని అడుగుతుంది. ఆ పదానికి అర్థం తనకి ఎలా విడమర్చి చెప్పాలా అని కొద్ది సేపు అలోచించి ఓ ఉదాహరణ చెపుతుంది. ఎవరైనా చీర కట్టులో ఉంటె వాళ్ళు ఎలాంటి వాళ్ళో అని మనకు ముందే ఓ  అభిప్రాయం ఏర్పడిపోతుంది అలా ఏ  basis లేకుండా ఓ అభిప్రాయం ఏర్పరుచుకోవటమే “జడ్జిమెంటల్ ” గా వుండటం అని చెపుతుంది .. ఇదే పదాన్ని శ్రీదేవి చివరి సన్నివేశం లో  వాడుతూ భార్య భర్తలు జడ్జిమెంటల్  గా వుండకండని హితబోధ చేస్తుంది 
 
ఎందుకో ఆ సన్నివేశం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనమందరమూ ఈ జడ్జిమెంటల్  ప్రవర్తన కి దాసులమైన వాళ్ళమే. ఒక మనిషి వచ్చిన ప్రాంతాన్ని  బట్టి, విద్యార్హత లను బట్టి, వేష ధారణను బట్టి, ఆర్ధిక పరిస్థితిని బట్టి ఇలా ఎదో ఒక సందర్భాన ముందే ఒక వ్యక్తి పై అబిప్రాయం ఏర్పరుచుకుని జడ్జిమెంటల్  గా వ్యవహరించి ఉండొచ్చు. మన అభిప్ర్రాయం  తప్పైన  సమయాన ఆ తప్పును ఒప్పుకోగలిగే humility ఉండక పోయి ఉండవచ్చు. ఈ చిత్రం కూడా ఈ సున్నిత విషయాన్ని చక్కగా portray చేస్తుంది.

మన బ్లాగు భాషలో చెప్పాలంటే, ఓ బ్లాగు టైటిల్ చూసి ” ఆ…. ఈ బ్లాగులో ఏముంటుందిలే” అని కొన్ని బ్లాగులను అసలు చూడక పోవటం కూడా ఈ   జడ్జిమెంటల్  కోవ లోకే వస్తుంది 

It talks about how judgemental we tend to be or we are about the people around us and develop a preconceived notion or opinion about a person. Being judgemental can sometimes hurt a person and hence the relation.

Advertisements
This entry was posted in ఫిలాసఫీ. Bookmark the permalink.

One Response to “ఇంగ్లీష్ వింగ్లీష్” చిత్రం లో నచ్చినదేమిటంటే

  1. Yes,it’s most disgrace thing 2 judge about any person basing on the dress,the place from which the person,come and so on.Even any accused in any case is presumed2be innocent,untill guilt is prooved,as per prevailing law of the land.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s