“పాడుతా తీయగా..” లో అద్భుతంగా పాడిన కల్పన గారి పాట

 

కొన్ని సార్లు ఓటమిని ఒప్పుకుంటే సంతోషంగా ఉంటుంది..ఎదుటివారు (అందునా మనల్ని దైవ సమానులుగా, గురు, పిత్రుతుల్యులుగా భావించే వారు) మన కంటే మెరుగుగా ఉన్నప్పుడు ఈర్ష్య అసూయ కలగవు సరికదా ఆనందం ద్విగుణీకృతమౌతుంది. అలాంటి సందర్భమే ఇది.. గత సోమవారం “పాడుతా తీయగా” లో ముఖ్య అతిధిగా విచ్చేసిన కల్పన గారు “ఆలాపన” చిత్రం లో “ఆవేశమంతా ఆలాపనేలే..” అనే పాట  పాడినప్పుడు ఆ పాటని చిత్రం లో పాడిన బాలు గారు కూడా తన కంటే బాగా పాడారని పొంగిపోయి ఉంటారు. ఎందుకంటే ఎవరు పాడినా, హృదయపూర్వకంగా మెచ్చుకునే సహ్రుదయశీలి బాలు గారు. ఎన్నో సార్లు బాలు గారు ఇతరులు తన పాటల్ని పాడినప్పుడు ‘తన కంటే బాగా పాడేరని’ మేచ్చుకున్నప్పుడు నాకు మాత్రం అలా అనిపించలేదు. కాని కల్పన గారు పాడిన ఈ పాట విన్నప్పుడు మాత్రం బాలు గారి గాత్రం కన్నా తన గాత్రం లో ఆ పాట కి మరింత అందం వచ్చిందనిపించింది. ఆ పాటలోని ప్రతి సంగతీ తన గళం లో ఒక ఊహాతీతమైన సౌందర్యాన్ని సంతరించుకుంది. స్వతహాగా మాతృ భాష కాకపోయినా, కార్యక్రమం లో పూర్తిగా తెలుగు  (దాదాపుగా దోష రహితమైన, ఉచ్చార బద్ధమైన) లో మాట్లాడిన కల్పన గారు ఈ పాటతో ప్రోగ్రాం కి మరింత శోభ తెచ్చారు. 

ఈ పాట కి ముందు ఈ పాటని స్వరపరిచిన ఇళయ రాజా గారి గురించి కల్పన గారు చెబుతూ ” కొన్ని స్వరాలు ఎవరి కోసమో, డబ్బు కోసమో, ఖ్యాతి కోసమో చేసినట్టుండవు. కేవలం, మన కోసం, మన సంతృప్తి కోసం స్వరపరుచుకున్నట్లుంటాయి . అలాంటిదే ఈ పాట అనిపిస్తుంది ..” అని చెప్పారు.  ఎంత నిజం?.. ఎంత స్వచ్చమైన  ప్రశంస?… ఎంత చక్కటి వ్యాఖ్యానం..?

 ఆ పాటని స్వరపరిచిన ఇళయరాజా గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక అనిర్వచనీయమైన అలౌకికానందాన్ని అందించే ఇలాంటి పాటలో భాగమైన ఆ స్వరకర్తలకి , గాత్ర ధారులకి , సాహితీ కారులకి నమస్సులు. 

ఆ పాట ఇక్కడ వినండి

కల్పన గారి గాత్రం లో   ( పూర్తి కార్యక్రమమున్న ఈ వీడియో లో ఈ పాట 6.35 నిమిషాలనుండి ప్రారంభమౌతుంది.   ప్లే చేసి వినండి )

బాలు గారి గాత్రం లో

 

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

2 Responses to “పాడుతా తీయగా..” లో అద్భుతంగా పాడిన కల్పన గారి పాట

  1. బాగుంది రామ కృష్ణ గారు. ఈ ప్రోగ్రాం చూస్తున్నప్పుడు నేను ఇలాగే అనుకున్నాను. కల్పన గారు రెండు పాటలు చాలా బాగా పాడారు. దోషాలు ఏవైనా ఉన్నా మనకి తెలియక పోవచ్చు. కాని పాటలు వినసొంపుగా అనిపించాయి.

    • mhsgreamspet says:

      ఉచ్చారణలో ఒకటి , రెండు దోషాలు ఉండొచ్చు (ముఖ్యంగా ఆరాధన అన్న పదం పలకటం లో )… కాని ఆ దోషాలు ఆ గాన మధురిమలో కొట్టుకుపోయాయి.. వ్యాఖ్యకి ధన్యవాదాలు వనజ గారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s