మరల రాని రుతువులకై అన్వేషించే మనసు

“తెలి మంచు కురిసింది తలుపు తీయనా ప్రభూ..” హాల్ లో నుండి వినిపిస్తోంది పాట … ఆ గాన తరంగాలు చెవులకు సోకగానే తెల్లవారి లేవాలనిపించకున్నా నిద్ర మైకం వదిలిపోయింది రాజేష్ కి.
లేస్తూనే బాత్రూం లో దూరి, ఓ ఐదు నిమిషాలకి బయటికొచ్చాడు ఫ్రెష్ గా.. జాగింగ్ సూట్ వేసుకుని, కిచెన్ లో తొంగి చూసాడు. గీత కాఫీ కలుపుతూ ఉంది.. బయట కమ్ముకున్న మంచు తెరలు నును లేత భాను కిరణాలతో తోలగుతున్నాయి.. కొన్ని కిరణాలు వంటింట్లో ప్రసరిస్తూ ఉంటె, గీత చేతిలో కాఫీ కప్పు కూడా రమణీయంగా కనిపించింది
రాజేష్ ని చూస్తూనే “కాఫీ?” అంది..
చిరునవ్వుతో ” కాదు.. జాగింగ్ కి వెళ్లి వచ్చాక” అన్నాడు.
హాల్ లో కి వెళ్లి , ఎం పీ . త్రీ ప్లేయర్, ఇయర్ ఫోన్స్ చెవులో ఉంచుకుని, బయటికి వెళ్ళాడు రాజేష్.. బయటికోస్తూనే… చుట్టూ కనిపిస్తున్న కొండలు.. వాటిపై మంచు పరదాలు.. గార్డెన్ లో ఆకులపై తుషార బిందువుల అమరికలు… వాటిల్లో ప్రతిఫలిస్తున్న సూర్య కిరణాల హరివిల్లులు..చూస్తూనే… “ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై…” అంటూ రాగం అందుకుంది మనసు..
పాటని హం చేసుకుంటూ జాగింగ్ మొదలెట్టాడు రాజేష్ …అది వూరు కాదు.. అక్కడక్కడా  విసిరేసినట్టున్న ఇళ్ళు .. ఎగుడు దిగుడు దారులు.. చిక్కటి నిశ్శబ్దాలు..వాటి మధ్యలో పరిగెడుతూ వుంటే తన షూస్ శబ్దం లయబద్దంగా తనకే వినిపిస్తోంది.. “పరువమా చిలిపి పరుగు తీయకే…” అంటూ ఇంకో రాగం మొదలయ్యింది రాజేష్ పెదాలపై..
ఎనిమిదింటికి ఇంటికి వచ్చాడు.. వేడి వేడి కాఫీతో స్వాగతం చెప్పింది గీత.. ముఖంపై చెమటని తువ్వాలుతో తుడుచుకుంటూ, కాఫీ కప్పు అందుకుని “థాంక్స్” అన్నాడు.
ఇద్దరూ వెళ్లి ఇంటి ముందు వరండా లో కుర్చీలు వేసుకుని కూర్చున్నారు..

పోద్దేక్కడంతో ఆకాశం కూడా దేదీప్యమానంగా మెరుస్తోంది. కాఫీ తాగుతూ మంచు తొలగిన పచ్చదనాన్ని, దూరాన మెరుస్తున్న కొండల్ని చూస్తూ ఉంటె మనసు ఆనందంలో తేలియాడింది.. అప్రయత్నంగా పెదాల పై ఓ రాగం .. ” ఏ పాట ?” అంటూ గీత ఆ హమ్మింగ్ ని వింటూ అడిగింది..
“నువ్వే చెప్పు.. కావాలంటే ఇంకో సారి వినిపిస్తాను” అంటూ మళ్ళీ హమ్  చేసాడు.
” దిల్ డూండ్ తా హై … ఫిర్ వహీ ఫుర్సత్ కే రాత్ దిన్…”… కని పెట్టేసింది గీత..
“అది ఓకే … అందులో ఏ చరణం..” అన్నాడు..
కాసేపు అలోచించి …” జాడోం కీ  ..నరమ్ ధూప్  అవుర్ ఆంగన్ మే లేట్ కర్….. అదే కదా? ” అంది
“కరెక్ట్.. ఎలా ఊహించావు”
“ఇప్పుడు నువ్వు చేస్తున్నది అదే కదా.” అంది అర్ధోక్తిగా

******************************************
పదకొండు గంటలయింది ..
గీత, రాజేష్ ఇద్దరూ షాపింగ్ కి బయల్దేరారు.. అంటే ఏదో షాపింగ్ మాల్ కి అనుకునేరు.. ఆ వూళ్ళో ని సంతకే.. చుట్టూ పక్కల కొండ ప్రాంతాలలో పండించిన కాయ గూరలు, పూలు, ధాన్యాలు అక్కడ తీసుకొచ్చి అమ్ముతుంటారు.
తీరికగా.. ఇద్దరూ షాపింగ్ మొదలెట్టారు. డేడ్ లైన్లు లేవు.. బాదర బందీ లేదు.. ఎవరో తరుముకోస్తున్నారన్న ఒత్తిడి లేదు.. అంతా ఖాళీ సమయమే… కావలసినంత తీరికే.. జోకులేసుకుంటూ, ఆడుతూ… పాడుతూ అంత్యాక్షరి ఆడుకుంటూ ఇద్దరూ షాపింగ్ ముగించి కాలి నడకన ఇంటికి వెనుదిరిగారు.. ఎప్పుడు కమ్ముకున్నాయో తెలియదు కానీ కాసేపట్లోనే అక్కడ మేఘాలు ప్రత్యక్షమయ్యాయి.. సన్నటి జడి వాన మొదలయ్యింది…   ఓ ఇంటి అరుగు దగ్గరికి పరుగు తీసింది గీత… కాని రాజేష్ ఆ రోడ్డు మీదే నిలిచుండి  పోయాడు దేనికోసమో ఎదురు చూస్తున్నట్లు..
“త్వరగ రండి… తడిసి పోతారు ..”అంటూ ఇంకా ఎదో చెప్ప బోయిన గీత, రాజేష్ వంక చూసి ఆగిపోయింది.
ముఖాన్ని ఆకా శానికి అభిముఖంగా పెట్టి పైకి చూస్తూ… ముఖం పై వాన చినుకులు నాట్యమాడుతుంటే ఓ తన్మయత్వపు లోకంలో ఓలలాడుతున్నాడు.

“ముంగారు మళేయే … (ఓ తొలకరి వానా…)
ఏను నిన్న హనిగేలే లీలె..(ఏమి నీ చినుకుల మహిమ..)
నిన్న మొగిల సాలె (ఆకాశంలో నువ్వు గీసిన హరివిల్లు గీత )
ధరయ కొరల ప్రేమద మాలే (భూమి పైకి వంగిన ప్రేమ మాల లాగుంది )”
అంటూ కన్నడ పాట పాడుతూ అలాగే ఆ వానని ఆస్వాదిస్తూ ఉండిపోయాడు. తన ఆనందాన్ని పాడు చేయటం ఇష్టం లేని గీత అలాగే రాజేష్ ని చూస్తూ ఉండిపోయింది.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

3 Responses to మరల రాని రుతువులకై అన్వేషించే మనసు

 1. b says:

  మీకు పర బాష మీద మక్కువ ఎక్కువగా ఉన్నట్లు ఉంది.
  పర బాష వద్దు తెలుగే ముద్దు .

 2. Kolla Sunny says:

  మన చిత్తూరోళ్ళ బ్లాగు చూస్తుంటే ఆనందంగా వుందండీ

  • mhsgreamspet says:

   బీ గారు..
   ఏ భాష గొప్పదనం ఆ భాషదేనండి..ప్రతి భాషలోనూ రమణీయత ఉంది.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
   సన్నీ గారు..
   మన బ్లాగుకి స్వాగతమండి 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s