“లైఫ్ ఆఫ్ పై “

“లైఫ్ ఆఫ్ పై “- విభిన్న షేడ్స్ ఉన్న చిత్రం.. చిన్న పిల్లలకి అందులోని జంతువులు, Sea-adventures  ద్వారా వినోదాన్ని కలిగిస్తే , టెక్నికల్ వాల్యూస్ ని ఇష్టపడే వాళ్లకి ఇందులోని దృశ్యాల చిత్రీకరణ ఆనందాన్నిస్తుంది… ఇవేవి కాకుండా ఒక మంచి కథని తెర పై చూడాలి అనుకునేవాళ్ళకి కూడా నిరాశ కలిగించదీ  చిత్రం. 

 చిత్ర కథ టూకీగా …

‘పై’ (ఇర్ఫాన్ ఖాన్) అనబడే వ్యక్తి ఆత్మ కథని రాయటానికి వచ్చిన ఓ బయోగ్రఫెర్ కి పై తన జీవితంలో ఎదురైన సంఘటనలని చెప్పటంతో ఈ చిత్రం మొదలౌతుంది. ‘పై’ బాల్యం లో అతడి familyకి ఓ ZOO వుంటుంది. అందులో అన్ని రకాల జంతువులు వుంటాయి.. కాల క్రమేణా … ఆర్ధిక ఇబ్బందులు ఎదురవటంతో, మంచి జీవితం ఉంటుందన్న ఆశతో  ఆ జంతువులతో పాటు ఓ  ఓడలో కెనడాకి బయలుదేరుతారు ఆ కుటుంబం.

మార్గ మద్యం లోతుఫాను తాకిడికి గురై ఓడ మునిగిపోతుంది. విచిత్ర పరిస్థితులలో  కొన్ని జంతువులతో పాటు ‘ఫై’ ఓ life boat లో చేరి ప్రాణాలు దక్కించుకుంటారు. జీబ్రా, హైనా , చింపాంజీ లు మొదట కనపడుతాయి ‘ఫై’ కి.  అందులోనే దాగి వున్న పులి మొదట కనపడదు. “Survival of the fittest” అన్న సిద్ధాంతం ప్రకారం, అన్నీ చావగా, ఆ జంతువులలో పులి మిగులుతుంది ‘ఫై’ కి తోడుగా. కాని ఇద్దరి పరిస్థితీ ఒకటే. పారిపోవటానికి మార్గం లేదు. ఎదుటి జీవి తనని ఎక్కడ చంపుతున్దోనని ఇద్దరికీ అభద్రతా భావం. ఫలితంగా ఇద్దరూ అదే పడవ పై ఒకరి పై ఒకరు దాడి చేసుకుంటూ తమని తాము కాపాడుకుంటూ వుంటారు. పడవ లో ఉన్న నీళ్ళు, కొన్ని ఆహార పదార్థాలు ‘ఫై’  ప్రాణం నిలిపితే, పులి కి అక్కడ మిగిలిన జంతువుల కళేబరాలే ఆహారమౌతాయి. చుట్టూ సముద్రం, మధ్య మధ్యలో ఎదురవుతున్న ఆటు పోట్లు, జల చరాలనుండి  ఉపద్రవాలు… వీటికి తోడు, పడవలో వున్న ఇంకో జీవి.. వీటి మధ్య వారి జీవితం. ఇదంతా చక్కటి దృశ్య కావ్యంగా మలిచాడు దర్శకుడు. చిన్న పిల్లలకి కూడా నచ్చేవి ఈ దృశ్యాలే.  

 ఈ విచిత్ర సహ జీవనంలో,  కొంత కాలానికి ఇద్దరూ తెలుసుకునే ఓ సత్యం ఏమిటంటే.. ఇంకో జీవి వుంది అన్న భరోసా వలననే తాము జీవించి వున్నాము అన్న సంగతి. అదే ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి వున్న భయం కొంత పోగొడుతుంది. ఆ క్రమంలోనే పులి ‘ఫై’ కి ట్యూన్ అవుతుంది.

 ఓ తుఫాను ని ఇద్దరూ కలిసి ఎదుర్కొంటారు.. తుఫాను తాకిడికి  నిర్మానుష్యమైన ఓ దీవికి వారి పడవ చేరుతుంది. ఇద్దరూ ఆ  దీవిలో కొంత ఆహారంతో ప్రాణం నిలుపుకుంటారు. ఆ దీవి మామూలు దీవి కాదని, carnivorous వృక్ష జాతులు గల ప్రాంతమని,  అక్కడ వుంటే ప్రమాదమని తెలుసుకున్న ‘ఫై’  ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అక్కడి నుండి మళ్ళీ  పడవలో బయల్దేరుతాడు.. అప్పటికే మచ్చికైన  పులిని కూడా తీసుకు వెళ్తాడు. అలా వాళ్ళ ప్రయాణం మళ్ళీ మొదలై పూర్తిగా శక్తి, ఆశ వుడిగిన దశలో ఇంకో దీవి చేరుతారు. అక్కడి వాళ్ళు ‘ఫై’  ని కాపాడుతారు. అంతకు మునుపే పులి అక్కడి అడవుల లోకి వెళ్లి పోవటంతో కథ ముగుస్తుంది.

 చిత్రం లోకెల్లా నాకు నచ్చిన సన్నివేశం ‘ఫై’ , పులి విడిపోయే సన్నివేశం. అంతవరకూ తను కాపాడిన పులి, అడవులు కనపడగానే ‘ఫై’  ని పట్టించుకోకుండా అడవుల వైపు సాగిపోతుంది.తను కను మరుగయ్యేంత వరకూ ‘ఫై’ ఆశతో చూస్తాడు.. తనకెంతో దగ్గరైన ఆ పులి ఒక్క సారి కనీసం తన వైపు చూసి వెళ్తుందేమో అని. అది జంతువైనా తనకీ హృదయముందని, తన పట్ల కృతజ్ఞతా భావంతో వుండి  ఉంటుందని నమ్మే ‘ఫై’ అది అలా చేసే సరికి కన్నీటి పర్యంత మౌతాడు.

This was the most touching scene, shown in a deft and subtle way. ఎన్నో బంధాలు, ఎన్నో పరిచయాలు మనకు ఏర్పడుతుంటాయి.. దూరమౌతుంటాయి. విడి పోవటం అనివార్యమైనప్పుడు, మనం సరైన విధంగా వీడ్కోలు తీసుకున్నామా లేక ఇచ్చామా? అలా ఇవ్వనప్ప్పుడు  ఆ వ్యక్తి ఎంత క్షోభించి వుంటారు అన్నది ఈ ఒక్క సన్నివేశం తో realise అవుతాము.

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

4 Responses to “లైఫ్ ఆఫ్ పై “

  1. మీరు Yan Martel పుస్తకాని అధారంచేసుకొని రాశారోలేదో తెలియరాలేదుకానీ, అసలు మలుపు నాకు Pi చివరి ఇరువై పేజీల్లో చెప్పిన కధలో కనబడింది. ఆ zebra ఒక sailorఅనీ, hyna ఒక cookఅనీ, orangutan తన తల్లి అని, తనే Richard Parkerఅనీ ఇచ్చిన వివరణ మరియు ఆ జపాన్ వ్యక్తి దాన్ని పోల్చుకొనే తీరు నచ్చాయ్. ఏం జరిగిందన్నది ఒక్క Pissine Patelకే తెలిసినప్పుడు తను ఏం నమ్మించాలనుకుంటే అదే నిజం కదా!

    P.S. నేనింకా సినిమా చూడలేదు.

  2. Sarath 'Kaalam' says:

    ఎంత బాగా సస్పెన్స్ అంతా చెప్పేసేరండీ.

    ప్చ్!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s