తలాష్ – చూడాల్సిన చిత్రం

అమీర్ ఖాన్ — అప్పుడెప్పుడో చూసిన “రాఖ్” చిత్రం నుండి తన చిత్రాలలో ఏదో ప్రత్యేకత ఉంటుందనే నమ్మకం కలిగించిన నటుడు . మధ్యలో కొన్ని సాధారణ చిత్రాలు చేసినా, గత కొన్ని సంవత్సరాలుగా, తన చిత్రాలేవి నిరుత్సాహ పరచలేదు. “తలాష్” కూడా అలాంటిదే .. కాకపోతే, తను ఈ కోవలో చిత్రం చేయటం మాత్రం నాకు ఆశ్చర్యమే.. ఎందుకంటే.. ఇది థ్రిల్లర్… సస్పెన్స్ చిత్రం.. సాధారణంగా ఇలాంటి చిత్రాలలో, కథకే ప్రాధాన్యం ఉండటం వలన, అందులోని నటులకు వారి నటనకి రావాల్సిన గుర్తింపు రాకపోయే అవకాశాలెక్కువ. కాని అలా జరగలేదు ఈ చిత్రంలో. కథ ఎంత gripping గా ఉన్నా,  అమీర్ కి తన నటనలో రాణించ టానికి ఏ అడ్డంకులూ లేవు. 
 
చిత్రం మొదలయ్యే మొదటి ఫ్రేం నుండి, చివరి వరకూ, seat edge పై మిమ్మల్ని కూర్చోపెడుతుందీ  చిత్రం. ఓ తెల్లవారు జామున, బాంబే చౌపాట్టి లో వేగంగా వస్తున్న ఓ కారు అనూహ్యంగా పక్కనున్న సముద్రంలోకి వెళ్లి పడిపోవటంతో ఈ చిత్రం ప్రారంభమౌతుంది. కారులో వున్న ఓ ప్రముఖ హీరో మరణిస్తాడు. ఏ కారణమూ లేకుండా ఆ కారు సముద్రంలోకి ఎలా దూసుకెళ్లింది అన్నది మిస్టరీ. ఈ మిస్టరీని చేధించటానికి ప్రయత్నించే  పోలీస్ ఆఫీసర్ గా అమీర్ నటించారు. అతడి ఇన్వెస్టిగేషన్ తో పాటు, సమాంతరంగా, అతడి వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే అవాంతరాలు, వ్యధలు చిత్రంలో చూపిస్తారు. ఈ రెండిటికీ సంబంధం ఏమిటా అని కూడా అప్పుడప్పుడూ కుతూహలం కలగొచ్చు. ఓ stressed but sincere cop గా అమీర్ తన నటనా ప్రాభవం చూపారు. చిత్రంలో ప్రతి mood నీ background music బాగా elevate  చేసిందనే చెప్పాలి. అమీర్ తో marital discord లో నలిగే భార్యగా రాణి ముఖర్జీ, case ఇన్వెస్టిగేషన్ లో కీలక మైన సహాయం చేసే పాత్రలో కరీనా  రాణించారు. 
 
చిత్రం చూసాక తెలుస్తుంది జరిగిపోయిన ప్రతి సన్నివేశంలోనూ ఎన్నో కీలకమైన clues దాగున్నాయని. కాబట్టి చిత్రం చూస్తున్నంత  సేపు ప్రతి సన్నివేశాన్ని నిశితంగా గమనించాల్సిందే. అదే ఈ చిత్రం నాకు బాగా నచ్చటానికి ముఖ్య కారణం.
 
థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వాళ్లకు మాత్రం ఈ చిత్రం కనువిందే.. 
Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

2 Responses to తలాష్ – చూడాల్సిన చిత్రం

  1. శ్రీ says:

    Totally agree! Movie was well made! Worth watching.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s