అడవులను జయింపజేసిన గురువుగారు..

ఓ అబ్బాయి అడవిని దాటి ఇల్లు చేరాలి ప్రతి రోజూ. ప్రతి రోజూ ఎవరైనా తనని చేయి పట్టుకుని ఆ అడవి దారిలో తీసుకెళ్ళి ఇంటి దగ్గర దిగ బెడ తారేమోనని  ఆశ.. అతడికి సాయపడటానికి ఓ వ్యక్తి వచ్చారు.. కాని ఆ అబ్బాయి ఆశించినట్లుగా ఆ వ్యక్తి చేయి పట్టుకు నడిపించలేదు  తన  చేతి కో టార్చి లైటు నిచ్చాడు. అడవి దారి పటం గీసి, ఎలా వెళ్ళాలి.. ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి ఇత్యాదులు నేర్పాడు.. ఆ బాలుడు ఎక్కడా తొట్రు పడకుండా వెళ్ళే ధైర్యం, స్ఫూర్తి నింపాడు.. తను తోడు లేక పోయినా స్వయంగా వెళ్ళ గలిగే విశ్వాసం కలిగించాడు 

 ఆ అబ్బాయి తరవాతెప్పుడూ  అడవులను దాటడానికి భయపడలేదు.. ఆ అడవులను దాటే శక్తిని ఇచ్చిన ఆ వ్యక్తిని ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉండిపోయాడు. పై లోకాల్లో ఎక్కడో ఉన్న ఆ వ్యక్తి సశక్తుడైన ఆ ఆబ్బాయిని చూసి ఆనందిస్తుండ వచ్చు..
 
ఆ వ్యక్తి పేరు కోదండ రెడ్డి గారు ముప్పై ఏళ్ళ క్రితం మా స్కూలు ఇంగ్లీషు మేష్టారు.. ఓ చిన్న తెలుగు మీడియం స్కూల్లో పిల్లలకు ఇంగ్లీషు నేర్పిన గురువుగారు.. రెన్  అండ్ మార్టిన్ వ్యాకరణం తో మొదలు పెట్టి, ఇంగ్లీషుని ఔపాసన పట్టించిన మనిషి.. ఆ రోజుల్లో ఆయన మా అందర్లో అందించిన జ్ఞాన దీపాలే ఇప్పటికీ వెలుగుతున్నాయి.. వారిని గౌరవ పూర్వకంగా స్మరించుకుంటూ.. 

 

విజ్ఞాన జ్యోతి కో(టి)దండం

విజ్ఞాన జ్యోతి కో(టి)దండం

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

3 Responses to అడవులను జయింపజేసిన గురువుగారు..

  1. ఆసక్తి కరంగా వ్రాసారు. ఇంగ్లిష్ బాష అరణ్యగోచరంగా పోల్చారు. బావుంది.

  2. Sri.kodandareddy master came2 our centenary school as Headmaster and taught us english grammer for 8th class to 10th class.He compelled all 10th class students to write in evenings the stories from prose, poetry&non detail,that makes all the students2score more than 45 marks in 1981.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s