ఇదండీ సంగతి

ఆ స్కూల్లో పదవ తఃరగతి పిల్లల పేరెంట్- టీచర్ మీటింగ్ జరుగుతోంది.. ఒక్కో గదిలో ఒక్కో సబ్జెక్ట్ టీచర్ తో తల్లి తండ్రులు మాట్లాడుతున్నారు.. ప్రతి ఒక్కరిలోనూ ఏదో తెలియని ఆందోళన..

“మా వాడికి ఈ సారైనా తెలుగులో కనీసం తొంబై తొమ్మిది మార్కులన్నా వస్తాయంటారా..?” ఓ తల్లి ఆవేదన.
 
“ఏమిటండీ… అంతలేసి వేలకు వేలు పెట్టి చదివిస్తున్నాం.. మా వాడికి తొంబై మార్కులేనా ఇచ్చేది..” ఓ తండ్రి ఆక్రోశం..
 
“మీ వాడికి ఈ సారి పెట్టె పరీక్షలో తొంబై ఐదు శాతం వచ్చే పూచీ నాది (కావాలంటే నేనే పరీక్ష రాసి తెప్పిస్తాను.. స్వగతం )” ఓ టీచరు భరోసా..
 
“మీ అమ్మాయి స్కూలు నుండి ఇంటికెళ్ళాక కనీసం ఓ ఐదు గంటలైనా pratice  చేయకపోతే మార్కులెలా వస్తాయి చెప్పండి” ఓ పంతులమ్మ దబాయింపు..
 
వీటన్నిటి మధ్య ఓ తండ్రి అక్కడికి బెరుకు బెరుగ్గా వచ్చాడు..
 
“చెప్పండి.. మీ అమ్మాయికి ఈసారి బాగానే మార్కులోచ్చాయే. వచ్చే ప్రాక్టీసు పరీక్షలో తన టోటల్ మార్క్స్ ఇంకో పది పదిహేను పెంచేయ గలం. మీరేమి వర్రీ కాకండి..” క్లాస్ టీచర్ విష్ణు చక్రవర్తికి మల్లే అభయమిచ్చాడు..
 
అది కాదండీ . నాదో  రిక్వెస్టు. మీరు మన్నించాలి..” అన్నాడా తండ్రి.
 
చెప్పండ న్నట్టుగా చూసాడు.. టీచర్ 
 
తండ్రి ఏదో చెప్పాడు..
 
అది వింటూనే కెవ్వుమని కేక పెట్టాడు ఆ టీచర్.
 

“ఏమిటండీ… ఇలాంటివి అడుగుతారు మీరు. అసలు ఇది జరిగే పనేనా.. ఇలా చేస్తే మిగతా పేరంట్స్ ఊరుకుంటారా.. అయినా ఇలాంటి ఆలోచనలు ఎలా వచ్చాయి మీకు..?” అన్నాడా టీచర్…

దీనంగా అడిగిన ఆ తండ్రి మొహం చూసి , కాస్త శాంతించి..”సరే .. మీకు కాదని చెప్పి ఆ పాపం నేనెందుకు మూట కట్టుకోవాలి.. అక్కడ మా ఇంచార్జీ వున్నారు అతన్నే అడగండి..” అన్నాడు ఓ వైపు చూపిస్తూ.
 
ఆ తండ్రి ఉసూరుమంటూ సదరు ఇంచార్జీ దగ్గరికి వెళ్ళాడు.
 
ఆ తండ్రి డిమాండ్ వింటూనే, ఇంకా violent గా reaction వచ్చింది ఇంచార్జీ నుండి.
 
ఏమిటండీ ఈ అపభ్రంశపు మాటలు.. ఇదేమైనా మంచి పద్దతా.. ఓ పేరంట్ అడగాల్సిన కోరికేనా ఇది..” అని నిలదీశాడు..
 
వ్యవహారం పెద్ద అయ్యవారి వరకూ వెళ్ళింది..
 
మీరు అడిగినట్లుగా మేం చేస్తే, పేరెంట్స్ కాదు కదా కొంత మంది పిల్లలు కూడా వొప్పుకోరు..సారీ” అని కట్టే విరక్కుండా సున్నితంగా చెప్పి పంపారా పెద్ద అయ్యవారు..
 
అంతా విన్నాక కాళ్ళు ఈడ్చుకుంటూ బయల్దేరాడా తండ్రి..”రోజూ పది గంటలు స్కూల్లో చదువుతూ వుంటే, relax అవటానికి కేవలం ఓ గంట ఎప్పుడైనా కాస్త గేమ్స్ ఆడటానికి టైం ఇవ్వండి ” అన్న కోరిక ఇంత  దుమారం లేపుతుందని తెలియని ఆ తండ్రి. నిట్టూరుస్తూ ఉండిపోయాడు.
Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

3 Responses to ఇదండీ సంగతి

  1. vanajavanamali says:

    🙂 😦 😦

  2. The corporate schools cultivate voracious reading &not allow students to participate in any kind of extracurricular activities. There by they are not physically fit.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s