ఓ వర్షాకాలపు మధ్యాహ్నం

“వర్షంలో తడవకు నాన్నా… ఈ గొడుగు కిందకి రా..”

“వద్దులేమ్మా .. అసలే చిన్న గొడుగు.. మనిద్దరికీ చాలదు. నాకు గొడుగు పట్టావంటే  నువ్వు తడుస్తావు.. నాకేం కాదులే..నువ్వే వేసుకో”
“ఎప్పుడూ చెప్పిన మాట వినవుగా నాన్నా.. చిన్నప్పుడంటే సరే.. ఇప్పుడు నేనూ పెద్ద దాన్నయ్యానని గుర్తుందా లేదా.. ఇప్పుడైనా నేను చెప్పినట్లు వినకుంటే ఎలా..?”
“నువ్వు ఇంజినీరైనా నాకు ఇప్పటికీ ఆనాటి పాపవే.. నేను నిన్ను చూసిన మొదటి సారి ఎలా ఉన్నావో ఇప్పుడూ అలాగే అగుపిస్తావు..”
“అంటే ఎలా..?
“పొత్తిళ్ళలో నీ వంటి చుట్టూ పూర్తిగా తెల్లటి గుడ్డ కప్పి  వుంచినట్లుగా.. కేవలం తల మాత్రం అగుపించేట్లుగా… నా వైపే దీక్షగా నీ కళ్ళు చూస్తున్నట్లుగా..”
“ఇంక చాలు .. చాలు ఆపండి నాన్నా.. ఎవరైనా వింటే నవ్వుతారు..”
“అందరికీ వినపడేలా చెపుతామా ఏమిటీ.. ఇది ఫర్ యువర్ ఇయర్స్ ఓన్లీ..”
“నాన్నా నీకోటి చెప్పాలి..”
“వూ వింటున్నా చెప్పు..”
“నేను యు. ఎస్ లో పీ.జీ కి apply చేశా కదా.. Purdue university లో సీట్ దొరికింది. అన్ని ఫార్మాలిటీస్ అయ్యాయి రేపే ప్రయాణం”
“……….”
“నాన్నా..”
“వూ..”
“వింటున్నావా?”
“చెప్పు”
“రేపు రాత్రికే ప్రయాణం..ఇన్నాళ్ళూ నీకు చెప్పలేదు. సారీ నాన్నా..”
“ఇన్ని రోజులేందుకు చెప్పలేదురా..”
“చిన్నప్పట్నుండీ నువ్వు నన్నేక్కడికీ పంపలేదు కదా.. బీ. టెక్ లో సీట్ చెన్నై లో వచ్చినా ఏదో సాకు చెప్పి నీ దగ్గరే ఉంచుకుని చదివించావు.. ఇప్పుడు పై చదువులకు వెళ్తానంటే వోప్పుకోవు కదా అని ఇన్నాళ్ళూ చెప్పలేదు నాన్నా ..”
“నువ్వెక్కడ వున్నా చక్కగా వుండాలి… అదే నా కోరిక.. “
“మరో సారి క్షమించండి నాన్న … చెప్పనందుకు”
“క్షమించటమెందుకు రా.. నువ్వు యు. ఎస్ కి అప్లై చేస్తున్న విషయం నాకెప్పుడో తెలుసు..”
“నిజమా..”
“అవును నిజం.. నువ్వంటే నాకిష్టం..”
“హు మళ్ళీ లంకిన్చుకున్నావా నీ పాటల్ని.. కాస్త సందర్భం దొరికితే చాలు ఇలా పాటలు పాడేస్తావు..’
“పాడమని నన్నడగవలెనా… పరవశించీ పాడనా.. పుత్రీ”
“బాబొఇ.. ఆపు నీ పాట  గోల… నాన్న నాకిప్పుడు రిలీఫ్ గా వుంది.. నేను వెళ్ళే విషయం ఇన్నాళ్ళు దాచి .. ఇప్పుడు నీకు చెప్పినందుకు..”
“It is okay  maa..”
“నాన్న…?”
“చెప్పు..”
“నేను వెళ్ళాక , నాకోసం బెంగ పెట్టుకోవు కదా..”
“లేదమ్మా.. నువ్వు నిశ్చింతగా వెళ్ళు..I will be fine”
“Thanks నాన్నా.. నువ్వెప్పుడూ నా పార్టీయే..”

“….”

“నాన్న…?”

“వూ…”

“ఇప్పుడంటే రోజూ మాట్లాడుతున్నాను. యు. ఎస్ కి వెళ్ళాక ఎలా..? నువ్వు లేకుండా …..”

“బిడ్డా బాధపడకు… నేనెప్పుడూ నీ పక్కనే ఉన్నట్లుగా ఊహించుకో.. ”

“నాన్నా నాకేడుపొస్తోంది.. కాని నీ ముందు ఏడవకూడదని అనుకున్నా..కాని… నా వల్ల  కావటం లేదు”

“కుచ్ పాకర్ ఖోనా హై .. కుచ్ ఖోకర్ పానా హై .. జీవన్ కా మతలబ్ తో… ఆనా ఔర్ జానా హై”

“అలాగే పాడండి నాన్నా… మళ్ళీ  మీ పాటలేప్పుడు వింటానో .. ఇంతకు మునుపు లాగా మిమ్మల్ని ఆట పట్టించను..”

“చాల్లే తల్లీ… నా పాట  విని చుట్టూ పక్కల వాళ్ళు లేచి నన్ను తరుముకుంటారు..”

“మంచిదే కదా… అప్పుడు ఎంచక్కా నాతో పాటు నువ్వూ  యు. ఎస్ కి వచ్చేయ్యోచ్చు..”

“లేదమ్మా.. నా పరుగు ఇక్కడే..నా విశ్రాంతి ఇక్కడే.. నువ్వే ముందుకెళ్లాలి.. జాగ్రత్త తల్లీ..”

“మరి వుంటాను నాన్నా..”

” అలాగే తల్లీ …”

” బై …నాన్నా..”

“అమ్మా.. ఓ మాట..”

“ఏమిటి నాన్నా”

“నీకసలె తొందరెక్కువ… రోడ్డు దాటేటప్పుడు నేను లేనిదే ఎలా దాటుతావో.. అక్కడ డ్రైవింగ్ చేసేప్పుడు జాగర్త తల్లీ..”

(నవ్వుతూ) ” నాన్నా… come on … i am grown up now..”

“అలాగే లే నేను చెప్పాల్సింది చెప్పానంతే..”

“సరే నాన్న.. ఈ గొడుగు ఇక్కడే ఉంచుతున్నాను నీ కోసం .. వర్షంలో తడవకు.. జలుబు చేస్తుంది. సరేనా”

————–

————–

“సరయూ… ఇంకా ఎంత సేపు అలా తడుస్తూ ఉంటావు ఈ స్మశానంలో. వర్షం ఎక్కువయ్యేట్టుంది..  రేపు ప్రయాణానికి ఇంకా పాకింగ్ చేసుకోవాలి. బోలెడు పనులున్నాయి.. త్వరగా రా… వెళ్లి పోవాలి…” దూరం నుండి భర్త నుండి పిలుపు.

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

3 Responses to ఓ వర్షాకాలపు మధ్యాహ్నం

  1. తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న అమితమైన ప్రేమానుబంధం ని చక్కగా నడిపించి.. ఆఖరిన విషాదం నింపేశారు.
    కూతురు తడుస్తుంది తండ్రి ప్రేమ వర్షంలో.. (మరు భూమిలో కూడా) 😦
    అనుబంధం అంటే “అప్పు”అని వేటూరి గారి మాట పాట. కొన్ని అప్పులు తీరవు బ్రతికే ఉంటాయి.

    బాగా వ్రాసారండి.సున్నితంగా.. హృదయాన్ని తాకేలా.

  2. Ramakrishna,your naration of relation between father&daughter is interesting.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s