దోసిళ్ళలో జారిపోయిన క్షణాలు

అనిపిస్తుంటుందప్పుడప్పుడూ ……..

మా స్కూలు మైదానంలో ఆడుకోవాలనీ 
స్కూలు ఇంటర్వెల్ లో సూరి బావతో వెళ్లి కమ్మర్కట్టు కొనుక్కోవాలనీ 
మూడో నంబరు క్లాసు రూములో మా క్లాస్ మేట్స్ తో నేల పై కూర్చోవాలనీ 
దామోదరం మేష్టారు తెలుగు పాఠం చెపుతుంటే, భయపడుతూనే ఇష్టంగా వినాలనీ 
శీతా కాలం సాయంత్రం పగడ మాను వీధిలో రమణ మేష్టారు ఇంటి మిద్దెపై లెక్కలు చెప్పించుకోవాలనీ
స్కూలు స్టేజి పై నా పేరు చెపితే గర్వంగా వెళ్లి బహుమతి తీసుకోవాలనీ
దిద్దిన పేపర్లు అనసూయ మేడం ఇస్తుంటే  నాకెన్ని మార్కులొచ్చాయో అని ఉత్కంటతతో ఎదురు చూడాలనీ 
లతా కేఫ్ కెళ్ళి  రెండిడ్లీ ఒక వడ తినాలనీ 
రమేష్ జనరల్ స్టోర్స్ లో నోటు పుస్తకం కొనుక్కోవాలనీ 
శ్రీనివాస టాకీసు లో రెండు రూపాయల టికెట్టు కొని అడవి రాముడు సినిమా చూడాలనీ 
సాయంత్రం పూట  పీచు మిఠాయి బండి గంట వింటూనే, పది పైసలు తీసుకుని వీధిలోకి పరిగెత్తాలనీ 
సుందర్రాజ శెట్టి దగ్గరకి నెల సరుకుల కోసం సంచి తీసుకుని వెళ్లాలనీ 
మురుగడి గుడి కొండ కెళ్ళి వాలుతున్న పొద్దునోసారి చూడాలని 
లక్ష్మి సరస్వతి మిల్క్ సెంటర్లో బాసంది తాగాలనీ 
Advertisements
This entry was posted in సొంత కవిత్వం. Bookmark the permalink.

3 Responses to దోసిళ్ళలో జారిపోయిన క్షణాలు

  1. బావుంది. ఏమిటో… ఈ మధ్య అందరికి బాల్యం గుర్తుకు వస్తుంది. 🙂

  2. Ramakrishna,you have make all of us to memoraise the golden moments in our schooldays..

  3. Sundarjula Chetty…. general store….. still feeling it was happened yesterday only

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s