నేను హిందీ సంఖ్యలు నేర్చుకున్న విధంబెట్టిదనిన…

Necessity is the mother of invention అని ఓ నానుడి. కాని Necessity is the mother of adaption అనాలేమో ఇప్పుడు నేను మీతో పంచుకోబో యే ఈ విషయం  వింటే.

 

స్కూల్లో చదివే రోజుల్లో, నేను  భయపడే సబ్జెక్ట్ హిందీ. ముఖ్యంగా హిందీ సంఖ్యలు. అవి గుర్తు పెట్టు కోవటం బ్రహ్మ పదార్థం లాగ  ఉండేది. దురదృష్ట వశాత్తూ “తేజాబ్” సినిమా అప్పటికి రిలీస్ కాలేదు. లేకుంటే అందులోని పాట “ఏక ధో  తీన్…” పుణ్యమా అని అంకెలు నేర్చేసుకుని ఉందును. ఎలాగైతేనేం, హిందీలో ఒకటి నుండి పది దాకా అంకెలు బట్టీ పట్టేశాను అతి కష్టం మీద. ఆ తరవాత..? అంటే, 11,12,13..లాంటి వాటినెలా  గుర్తు పెట్టుకొవాలో అర్థం కాలేదు. నాకు తెలిసిన మిత్రుడొకడు ఓ చిట్కా చెప్పాడు. ఆ చిట్కా ప్రకారం, కేవలం నేను 20, 30,40.. లాంటి  సంఖ్యలు 100 వరకూ బట్టీ పడితే చాలు పని పోతుంది.. ఎలాగంటె. … ఉదాహరణకు 22 ని హిందీలో చెప్పాలనుకోండి.. దాని ముందున్న సంఖ్య 20 ని ఆధారంగా చేసుకుని.. “బీస్ పర్  ధో ” అని చెప్పి పని కానిచ్చేయోచ్చు. ఆ క్రమం లో 47 ని “చాలీస్ పర్  సాత్” అని, 75 ని “సత్తర్ పర్  పాంచ్ ” అని చెప్పొచ్చు.. ఈ పధకం ఏదో బాగుందని ఇలాగే ఫిక్స్ అయిపోయాను. ఎప్పుడు హిందీ సంఖ్యలు చెప్పాల్సోచ్చినా ఇలా చెప్పేసే వాడిని.
కాని.. విధి బలీయమైనదని ఊరకే అనరు కదా..”ఎంకి పెళ్లి సుబ్బి చావుకోచ్చినట్లు” అప్పట్లో వచ్చే క్రికెట్ కామెంటరీలు నా హిందీ పాండిత్య ప్రకర్షకి విఘాతం కలిగిస్తాయని కలలోనైనా ఊహించేదు …హ్మ్మ్ … అలా ఊహించి వుంటే అది జీవితం ఎందుకౌతుంది… తెలుగు సినిమా కావాలి గాని.

క్రికెట్ మ్యాచిలకి అప్పట్లో రేడియో లో ఇంగ్లీషు, హిందీ భాషలలో ప్రత్యక్ష వ్యాఖ్యానాలు ఉండేవి.. అవి ప్రతి 10-15 నిమిషాలకి alternate అవుతూ ఉండేవి.. ఇంట్లో నాన్నకి కూడా ఈ క్రికెట్ జాడ్యాన్ని అంటించటం పెద్ద త ప్పిదమై పోయింది.. హిందీలో కామెంటరి వస్తుంటే ఆ వ్యాఖ్యాత హిందీలో స్కోరు చెప్పే వారు..”స్కోరెంత చేపుతున్నాడురా ..?” అని ఆదుర్దాగా నాన్న అడిగే వారు.. ఆ హిందీ సంఖ్యలు మనకి అర్థం కాక పోవటమూ, అంతకు మునుపు ఇంగ్లీషు కామెంటరి లో విన్న స్కోరు ఆధారం గా ఏదో ఊహించి చెప్పే వాడిని.. తరువాత  మళ్ళీ ఇంగ్లీషు లో కామెంటరి మొదలై నప్పుడు ఇంగ్లీషు లో స్కోరు విని నాన్న గారు “అదేంట్రా… స్కోరు తప్పు చెప్పావు..”అని మందలించే వారు.. ఒకటా రెండా.. ఇలా ప్రతి సారి తప్పు స్కోరు చెప్పే సరికి… తనకి నా హిందీ భాష పై అనుమానం పెను భూతమైనది..

ఎప్పుడు హిందీ లో కామెంటరి మొదలైనా, హిందీ లో స్కోరు ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక నాకు ముచ్చెమటలు పట్టటం పరిపాటి ఐపోయింది.. మ్యాచ్ అయిపోయినా సరే , post – match విశ్లేషణలో నా హిందీ గురించి రచ్చలాంటి చర్చ మొదలయ్యేది. “అసలు వీడు హిందీలో ఎందుకు ఇంత వీక్ ఉన్నాడు” అని పరిశోధన మొదలయ్యేది. మ్యాచ్ మ్యాచ్ కీ పునరావృతం అవుతున్న .  ఈ బాధ  భరించలేక.. హిందీ సంఖ్యల పుస్తకాన్ని కొని… అందులో 1 నుండి 100 దాకా బట్టీ పట్టడం  మొదలెట్టల్సోచ్చింది. అలా ఒక సంవత్సరం సాధన చేసే సరికి, కొంత హిందీ వంట బట్టింది.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s