మాడిన ఉప్మా– ఒక జ్ఞా(వ్యా)పకం

“పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి” అని ఊరకే అనలేదు పెద్దలు. కొన్ని సార్లు, కొందరి రుచులు, అభిరుచులు అవలోకిస్తే, ఇతరులకే కాదు సదరు ఆ ఆసామీలకు కూడా సిత్రమనిపించవచ్చు. ఇంతకీ ఈ సోదంతా దేనికి నాందీ ప్రస్థావనంటే , నాకూ  అలాంటి ఓ చిత్రమైన రుచి ఉండేది అని మీకు విన్నవించుకోటాననికే మగానుబావుల్లారా. మరి అదేంటో తెలుసుకోవాలంటే, నాతో పాటు టైం మెషీన్ లో ఓ నలబై సంవత్సరాలు “పిన్నాలే” (అంటే ఏమిటో తెలుసుకోవాలంటే, మీకు తెలిసిన తమిళ తంబీలని అడగండి..) వెళ్దాం పదండి.

అప్పట్లో ….ఇడ్లీలు, దోసెలు చేయటమంటే శ్రమతో కూడుకున్న పని కాబట్టి , ఇంట్లో ఎక్కువగా ఉప్మా ఉండేది. ఓ సారి ఎందుకనో, సరిగ్గా చూసుకోక, ఉప్మా మాడిపోయింది. వేరే ప్రత్యామ్నాయం లేక పోవటంతో ఆ మాడిన ఉప్మానె తినాల్సోచ్చింది. అదేమీ చిత్రమో కాని… నాకే కాదు అన్నయ్యకూ  నచ్చేసింది ఆ మాడిన ఉప్మా.. అప్పటినుండి, ఉప్మా చేస్తే, అట్టడుగున ఉన్న ఉప్మా మాడు కోసం, ఇంట్లో పోటీలు. జరిగేవి. “ఎక్కడైనా సోదరులే గాని, ఉప్మా దగ్గర మాత్రం కాదు”  అన్న చందంగా, ఉప్మా చేస్తే మటుకు, ఆ మాడు ఉప్మా కోసం, ప్రపంచ యుద్ధాలే జరిగేవి.

తరాలు మారినా…. ఇప్పటికీ ఎవరి ఇంటిలోనైనా ఉప్మా ఆతిధ్యం స్వీకరిస్తే,  అప్రయత్నంగా చూపులు వాళ్ళు వడ్డించే పాత్రలోకి వెళ్తాయి  ఉప్మా మాడు కోసం. వాళ్ళను అడిగితే బాగోదు కదా.. మెల్లిగా వాళ్ళ దృష్టి మరల్చి, నా అన్వేషణ మొదలెట్టడం, చాలా సార్లు నిరాశతో నిట్టూర్చటం  జరిగిపోయాయి.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

2 Responses to మాడిన ఉప్మా– ఒక జ్ఞా(వ్యా)పకం

  1. vanajavanamali says:

    🙂 very nice. same Taste.!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s