వ్యక్తీకరణ ఎంత అవసరం?

మనసులోని భావాన్ని, మనుషుల మీద ప్రేమని లేక మరే భావమైనా తెలియ చెప్పటానికి వ్యక్తీకరణ అవసరం. కాని ఎంత మేరకు… ఏ పద్ధతిలో? ఇక్కడ ఋణాత్మక  భావాలను వదిలేసి కేవలం మంచి భావాలను ఎలా తెలియ చెప్పటమో చూద్దాం. ఆ మధ్య ఓ చిత్రంలో “జాదూ కా ఝప్పీ” (magical hug )… అంటే ఓ వ్యక్తిని ప్రేమకి దాసుడ్ని చేయటానికి ఓ కౌగిలింత ఎంత ఉపయోగ పడుతుందో చూపారు.  ప్రేమ (ఎలాంటిదైనా) వ్యక్త పరచటానికి ఎన్నో మాటల కన్నా ఓ సున్నితమైన ముద్దు ఎంత గా effective గా ఉంటుందో తెలియంది కాదు. ప్రతి వ్యక్తి జీవితంలోని ముఖ్యమైన రోజుల్ని గుర్తు చేస్తూ, ఓ గ్రీటింగ్ కార్డ్, ఓ బహుమతి, ఓ surprise visit … ఇలా ఎన్నోపద్ధతుల్లో పలకరిస్తే.. ఆ వ్యక్తి పొందే ఆనందమే వేరు.. ఆ మధ్య అన్నయ్య పిల్లల birth day నాడు, తను రాలేక పోయినా online gift పంపారు. సాయంత్రం ఓ ముక్కు మొహం తెలియని వ్యక్తి (online company తరపున ) పూల గుచ్చం తో పాటు చాక్లెట్స్, గ్రీటింగ్ కార్డ్ అన్నయ్య పేరుతో వచ్చేసరికి, పిల్లల మొహాల్లో  ఎంత సంతోషమో..

ఆ మధ్య వరకూ..”True feelings are best expressed when they are not expressed” అనే అభిప్రాయం ఉండేది.. బహుశా ఇలాంటి ఫీలింగ్ ఉండటం వలనేనేమో, ఓ. హెన్రీ రాసిన కథలు బాగా నచ్చుతాయి. తన కథలలో సున్నితమైన భావ వ్యక్తీకరణ తొణికి సలాడుతుంటుంది.. ఇందుకు ఉదాహరణగా  తన కథ ఆధారంగా తీసిన “raincoat ” అనే హిందీ చిత్రంలో భావాలేవీ బాహ్యంగా వ్యక్త పరచరు.నాయికా నాయకుల మధ్య ఉన్న ప్రేమ గాని, కథా నాయకుడు , అతడి మిత్రుడి భార్య పై చూపించే సానుభూతి కాని ఏవీ స్పష్టంగా అగుపించదు . వారి మధ్య జరిగే transactions అన్నీ సాధారణ మైన మెటీరియలిజం లో కొట్టుకుపోయే మనుషులకు అందని ఊర్ధ్వ ఉపరితలంలో జరుగుతుంటాయి. కేవలం  చెవులున్న మనసుకు వినిపించే ప్రేమ స్వరాలే అవన్నీ..

“ప్యార్ కోయి బోల్ నహి… ప్యార్ ఆవాజ్ నహి … ఏక ఖామోషి హై.. సున్  తీ  హై .. కహా కర్తీ హై” అని ఖామోషి చిత్రంలో ఓ పాట సాహిత్యం… దాని ప్రకారం ప్రేమ ఒక పదం కాదు .. ఒక స్వరం కాదు.. కేవలం ఒక వినే మౌనం.. ఒక మాట్లాడే మౌనం “.. నిజమే అర్థం చేసుకోగలిగే హృదయముంటే మౌనమే మహా కావ్యమౌతుంది.

ఈ topic ని క్లుప్తీకరించాలంటే.. భావ వ్యక్తీకరణ అన్నది ఇద్దరి మనసుల తరంగ ధైర్ఘ్యాలపై (wavelength )పై ఆధారపడి ఉంటుంది. కొందరికి demonstrative గా వ్యక్తీకరించాలి.. మరి కొందరికి… అతి కొందరికి.. మౌనమే సరిపోతుంది..

Advertisements
This entry was posted in ఫిలాసఫీ. Bookmark the permalink.

2 Responses to వ్యక్తీకరణ ఎంత అవసరం?

  1. vanajavanamali says:

    very nice..

  2. What u have expressed about the feeling with each other is quite necessary.Hither to expression of feelings by way of letters is common.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s