మనిషి దశల్లో ఏది కష్టమైన దశ ?

“పెద్దాయన కదండీ.. ఏదో చాదస్తం. చూసీ చూడనట్టు పోవాలి మరీ” అని ఒకరి ఓదార్పు .. అలాగే

“చిన్న పిల్లాడు కదండీ.. లోకం ఇంకా చూడలేదు కదా.. వదిలేద్దురూ..:” అని ఇంకొకరి సలహా..

“ఉడుకు రక్తం కదా.. ఆ వయసులో తప్పులు అలా జరిగి పోతుంటాయి.. పెద్ద వాళ్ళం.. మనం క్షమించక పోతే ఇంకెవరు క్షమిస్తారుటండీ ..” అని ఓ సముదాయింపు.

కాని ఏ సింపతీ పొందని దశ ఒకటుంది.. అది మధ్య వయస్కుల దశ..ఈ దశలో  వారి పిల్లలు పెద్ద వాళ్ళ వుతుంటారు.. వారి ని sync చేసుకుంటూనే ఒక సరైన దిశలో నడిపించాలి. అదే వయసుకి, వృద్ధాప్యంలోకి అడుగు పెట్టిన తల్లి తండ్రులూ …  కొండకచో.. అందరూ కాక పోయినా కొందరు ‘తమ పిల్లలు కదా…’ అనే ధోరణితో సాధించే వాళ్ళూ ఉంటారు. అటు రేపటి తరాన్ని, ఇటు తమ పేరెంట్స్ తరాన్ని వారి వారి frequency లో సమన్వయపరుచుకుంటూ సంసార నావని నడుపుతూ వెళ్ళాలి. ఇంత చేసినా ” చూడండీ. దుక్కలా ఉన్నాడు.. ఒక్క బాధ్యతనీ సరిగ్గా పట్టించుకోడు.”  అనే విమర్శలు రావటం కూడా కద్దే..

ఇందు మూలముగా యావన్మందికీ తెలియజేయడమేమనగా “త్వర త్వరగా మధ్య వయస్సనే వైతరిణీని  దాటేసి, మీ లెవిల్లో చాదస్తం మొదలెట్టేయండి.. ఇక హాపీసే హాపీసు..”

(అన్నిటికీ వివిధ దృష్టి కోణాలుంటాయి… ఇది కేవలం ఎక్కువగా గమనించని ఓ దృక్కోణం  మాత్రమే..)

 

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

2 Responses to మనిషి దశల్లో ఏది కష్టమైన దశ ?

  1. Ramakrishna,u know well that in the middle age we hav 2 syncronize all things,in&around our life.V have to take it easy . Lord.Krishna said in Githa, u do ur duty&leave results to lord.Ignore the comments.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s