Life of small things

అనగనగా ఓ మంచోడు . ఓ చెడ్డోడు ఇద్దరూ ఒకే రోజు టపా కట్టారు. మంచోడు స్వర్గానికి.. చెడ్దోడు నరకానికి వెళ్ళారు. . వాళ్ళ log sheets చూసిన తరవాత వాళ్ళ శిక్షలు, సౌఖ్యాలు నిర్ణయించబడ్డాయి .

చెడ్డోడికి యిచ్చిన పని రోజు మూడు పూటల విందుభోజనం తినడమే.. మంచోడికి రోజు కష్టపడి పని చేసిన తరువాత ఓ పూట సంగటిని ఇచ్చి తొంగోమనేవారు.

ఇద్దరినీ గమనించిన ఓ పెద్ద మనిషికి ఒళ్ళు మండింది ఇదేమి న్యా యమని.. దేవుడ్ని కలిసి “ఇదేమి న్యాయం స్వామీ … పాపాలు చేసినోడికి పంచ భక్ష్య పరమాన్నాలు.. పుణ్యాత్ముడికి కష్టాలు… సంగటి   ముద్దలు.. ఇది మీకు తగునా? ” అని నిలదీశాడు

అతని ఆక్రోశం చూసిన దేవుడు చిన్నగా నవ్వి.. ” నువ్వు అడిగింది సబబే … కాని వాళ్ళిద్దరినీ మరో సారి నిశితంగా గమనిస్తే అసలు విషయం నీకే బోధ పడుతుంది.. చెడ్డ వాడికి పంచ భక్ష్య పరమాన్నాలు పెట్టానే కాని వాటిని ఆస్వాదించటానికి నాలుకకి శక్తి లేకుండా చెసాను. కంటి ముందు అన్నీ ఉన్నా వాటిని అనుభవించే అదృష్టం లేనప్పుడు అంత కంటే పెద్ద శిక్ష ఇంకేముంటుంది? మంచివాడికి కష్ట పడి పని చేసి, ఓ సంగటి ముద్ద తిని సుఖంగా నిద్ర పట్టేటట్లు చెసాను.. ఏ మనిషి కైనా రుచేరిగిన భోజనం, కంటి నిండా నిద్ర ని మించిన అదృష్టం ఉంటుందా?” అని చెప్పాడు. అది విన్నాక ఆ పెద్ద మనిషికి అసలు విషయం బోధ పడింది.

ఇంతకూ ఈ కథ దేనికంటే ప్రస్తుత ప్రపంచంలో మేటీ రియలిజంకి మనం ఇచ్చే ప్రాధాన్యత దేనికీ ఇవ్వమేమో? నిఖ్హార్సైన ఆనందమేదీ, అది పొందే మార్గమేది తెలియని భ్రమలో కొట్టుకు పోతున్నాం అనిపిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే కంటి ముందు సంతోషాలు కనపడుతున్నా వాటిని సొంతం  చేసుకునే అదృష్టం పొందటం లేదు. చాలా మందికి అన్నీఉన్నట్లే అనిపిస్తుంది కాని ఆనందం ఉండదు.

Most of the times we fail to appreciate the value of life that we are bestowed with and crib about nothing and everything. Start understanding the value of small things in our life and that keeps you going.

 

Advertisements
Aside | This entry was posted in ఫిలాసఫీ. Bookmark the permalink.

3 Responses to Life of small things

  1. vanajavanamali says:

    Good one. Thank you so much.

  2. In this meterialistic world human values are coming down day by day.viz..a couple of days ago in jaipur an accident took place, no body initiated to shift 2 hospital for 2hours.Hence a child&women died.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s