వివేకానంద టాకీసు @ చిత్తూర్ … कुछ यादे

 

नग्मे  है ..   शिक्वे  है।  किस्से है ..बाते है. 

बाते  भूल  जाती है 

यादे याद आती है .. 

గతాన్ని డేటా మైనింగ్ చేస్తే వచ్చేవే జ్ఞాపకాలు. అందులో మధురమైనవి, బాధించెవీ.. ఎన్నో ఎన్నెన్నొ… జ్ఞాపకాలెవైనా… అందులో ఎంతో ఒదార్పు.. ఎన్నో పాఠాలు.  నిన్న సినిమా హాల్లో ఓ చిత్రం చూస్తుంటే, మా చిన్నప్పటి ఓ టాకీసు గుర్థొచ్చింది . అదే వివేకానందా talkies. మా ఇంటికి కూత వేటు దూరంలో ఉండేది. ఆ హాలు పక్కనే, మురుగడి గుడికి వెళ్ళటానికి దారి, మెట్లు ఉండేవి. ఇంటికి దగ్గరవటం మూలాన, అప్పట్లో ఆ కొటాయిలో ఏ సినిమా వున్నా చూసే వాణ్ని. కాక పోతే, ఆ హాలు వోనరు అప్పటి తమిళ చిత్రాల సూపర్ స్టార్ ఎమ్. జీ. ఆర్. వీరాభిమాని. ఎంత అంటే, ఎమ్. జీ. ఆర్.  నటించిన చిత్రాలను సంవత్సరం లో సగానికి పైగా వేసే వారు. ఇప్పుడు టీవీ లలో కొన్ని సినిమాలు వస్తున్నట్లు, ఒకే చిత్రం సంవత్సరంలో రెండు మూడు సార్లు కూడా వేసే వారు. ఆ అభిమానం నాకు తెలిసి 2000 సంవత్సరం లో కూడా కొనసాగింది. ఆ క్రమం లోనే ఎమ్. జీ. ఆర్. చిత్రాలు మాకు కంఠోపాఠమై పోయాయి. ఆ చిత్ర రాజాలలో కొన్ని… అడిమై పెణ్ , రిక్షా కారన్ , వేటక్కారన్, నాడోడి  మన్నన్ ఇలా ఎన్నొ… వీటితో పాటు, వీర పాండ్య కట్టబోమ్మన్ (శివాజీ చిత్రం అనుకుంటాను), మచ్చానే పాథింగలా (శ్రీదేవి చిత్రం) కూడా ఇందులోనే వచ్చినట్లు గుర్తు. వీటి తో పాటు, అప్పుడప్పుడూ ఇంగ్లీషు చిత్రాలు తెచ్చి surprise చెసెవారు. అలా చూసిన చిత్రాలు King solomon’s mines, House of dark shadow, North by north west. తెలుగు చిత్రాలు అతి తక్కువ గా ఆడిన కొటాయి ఇదొక్కటే. ఇందులో చూసిన తెలుగు చిత్రాలు చరణ దాసి, నీడ, మైనరు బాబు మాత్రమే గుర్తున్నాయి. ఈ కొటాయితో నాకు ఇంకో అనుబంధముంది. పదవ తరగతి పరీక్షలకు చదివేటప్పుడు, రాత్రి నిద్ర రాకుండా ఉండటానికి ఇక్కడికి వచ్చి తీసుకు  వెళ్ళే వాడిని ఫ్లాస్కులొ. టీ సాకుతో కాసేపు, సినిమా దిలాగులు బయటికి వినిపిస్తుంటే, వింటూ ఉండేవాడిని 

ఈ మధ్య వూరెళ్ళినప్పుడు, మిగతా కొటాయిల లాగే, ఈ కొటాయి కూడా నేల మట్టమై పోయి ఉంది. చదునైపోయి ఉన్న ఆ స్థలం పై   చూస్తూ  శిధిలమైన నా జ్ఞాపకాలను కూడా తడుముకున్నాను

ये  यादे किसी दिलों जानम के चले जाने की बाद  आते है 

ये यादे. हाय यादे.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

5 Responses to వివేకానంద టాకీసు @ చిత్తూర్ … कुछ यादे

  1. vanajavanamali says:

    జ్ఞాపకాలు ఎన్నటికి చేరిగిపోవు . కొన్ని గురుతులే చెరిగిపోతాయి అన్నట్టు ఉంది

  2. నేను మైనరుబాబు అక్కడే చూసానండీ ,మా ఇంటికి దగ్గరే వివేకానందా టాకీస్ ..ఆ జ్ఞాపకాలు కరిగిపోవు చెరిగిపోవు జీవితాంతము ంఈ బ్లాగు లోకి వస్తే చాలు నా బాల్యం లోకి ఒక్కసారైనా చిత్తూరు లోకి వెళ్లి వస్తుంటాను

  3. Like vivekananda talkies,prathap. Premala,jyothi&Malik talkies were demolished.within a short span of time the Dt.court of more than 200 years is going 2 be demolished &new complex will be built.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s