విజయవాడ జ్ఞాపకాలు

చాలా రోజుల తరువాత విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఊరికెళ్ళే సరికి ఎందుకో కాలేజి రోజుల్లోకి వెళ్లి పోయింది మనసు. అప్పట్లో ఈ వూరికి ఏదైనా industrial visit కోసమో లేక పోతే ఏదైనా academic purpose కోసమో వచ్చే వాళ్ళం . మొదటి సారి all india level పరీక్ష ఇక్కడే 1987 ఫిబ్రవరి లో రాశాను. ఆ పరీక్ష బాగా రాయటం తో మా కాలేజి లో బాగా గుర్తింపు వచ్చింది . ఆ విధంగా ఈ వూరు నాకు చాలా లక్కీ అనే చెప్పాలి. తొలి సారి ఖరగ్పూర్ కి వెళ్ళటానికి ఈ ఊళ్లోనే కోరమండల్ రైలు ఎక్కాను. ఆ రోజు ఎక్కిన సమయం, అక్కడి ప్లాట్ ఫోరం పరిసరాలు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లు గుర్తున్నాయి. It was such a sweet memory. 

 ఆ తరువా త ఈ వూరికి వెళ్ళిన సందర్భాలు తక్కువే. కాని వెళ్ళిన ప్రతి సారి ఏదో ఒక విశేషం వుండేది.  ఓ సారి వెళ్తుంటే,కుండపోత వర్షం .. బస్సులో నీళ్ళు నేను కూర్చున్న సీట్ పై కారుతూనే వున్నాయి. నెత్తిన ఓ జెర్కిన్ వేసుకుని తల మాత్రం తడవ కుండా సుమారు పది  గంటలు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇంకో రెండు సందర్భాలలో severe summer లో వెళ్ళాను. ఓ బాటిల్ లో  నీళ్ళు , వాటితో  కర్చీఫ్ ని ప్రతి ఐదు నిమిషాల కోసారి తడపటం,  తలపై పెట్టుకుంటూ బస్సులో ప్రయాణం చేయాల్సోచ్చింది. 
 
ఇన్ని సార్లు ఈ వూరికి వెళ్ళినా ఎప్పుడూ స్టే చేయలేదు. ఈ సారి రెండు రోజులు వుండాల్సోచ్చింది. వేసవి తీవ్రత ఎక్కువగా అనిపించే సరికి బయట ఎక్కడా తి రగలెదు ఓ సాయంత్రం తప్ప. బెంజి సర్కిలు, మెడికల్ కాలేజి, రామవరప్పాడు, గన్నవరం ఇవీ తిరిగిన ప్రదెశాలు. బెంజి సర్కిలు దగ్గరనుకుంటాను స్వీట్ మాజిక్ అనే హోటల్ కి తీసికెళ్లారు ఓ మిత్రుడు. దానికేదురు lane లో అన్నీ హోటళ్ళే ఉన్నాయి, చాలా మంచి ambience తో డిజైన్ చేసారు ఈ హోటళ్ళన్నీ. బెస్ట్ ప్రైస్ , మెట్రో ఇక్కడ కూడా వచ్చాయని తెలిసే సరికి globalisation ఇక్కడికీ పాకేసింది సుమీ అనిపించింది 
 
Advertisements
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

3 Responses to విజయవాడ జ్ఞాపకాలు

  1. vanajavanamali says:

    అన్యాయం రామకృష్ణ గారు. మా వూరు వచ్చి మేము ఉన్నామని మర్చిపోయారు.ఒ.. బ్లాగర్ గా అయినా మీరు కొంతమంది స్నేహితులని కలవకుందా వెళ్ళిపోయారు. ::(

    మా వూరితో మీ అనుభవాలు బావున్నాయి . ఈసారి ఎప్పుడు వచ్చినా సరే..ఒక చిన్న మెసెజ్ ఇవ్వండి. గెట్ టు గెదర్ ఏర్పాటు చేస్తాము.

    • mhsgreamspet says:

      ఆహ్వానించినందుకు ధన్యవాదాలు వనజ గారు.. ఈ సారి వచ్చినప్పుడు అక్కడి బ్లాగరు మిత్రులనందరినీ కలుస్తానండీ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s