నవ్వి చూడు…. డూడ్

నవ్వు … మనిషికి దేవుడిచ్చిన వరం నవ్వించటం ఓ యోగమైతే , నవ్వలేక పోవటం ఓ రోగం అని కూడా మన సినీ కవులు వాక్రుచ్చారు. “Smile.. it improves your face value” అని కూడా నవ్వులోని మహాత్తుని పర దేశీయులు కూడా సెలవిచ్చారు. స్ట్రెస్ ని bust చేయాలన్నా monotony నుండి బయట పడా లన్నా వేయి పదాలతో వ్యక్తీ కరించాల్సిన భావాన్ని క్లుప్తంగా అందంగా చెప్పాలన్నా .. ఓ నవ్వు చాలు .. “నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ ” అని ఫిదా అయిపోవటం ఖాయం .

అలా అని నవ్వుకు వేరే కోణాలు లేవు అనుకోవటం పోరాపాటండోయ్. అర్థవంతమైన నవ్వు ఎంత గొప్పదో అసందర్భమైన నవ్వూ అంతే అనర్థ దాయకం కూడా.. ఒకళ్ళు నవ్వారనే కదా మన పురాణాలలో కొన్ని పర్యవసానాలు యుద్ధాలకు దారి తీసాయి.. ఒకరు నవ్విన నవ్వుకు ఒక్కొకళ్ళు ఒక్కో రకంగా విశ్లేశిన్చుకున్నారు వారి వారి context ని బట్టి. అంతెందుకు ఆ నవ్వు వలననే కదా నేను ఓ సారి క్లాసులో బెంచీ ఎక్క వలసి వచ్చింది. read this for more detail అందువలన సమయమేరిగి తగు విధంగా తగు మోతాదులో నవ్వితేనే అందం చందం ..

మన సినిమా సాహిత్యంలో కూడా నవ్వుకు సముచిత స్థానం వుంది. అప్పట్లో “జ్యోతి” చిత్రం లో “సిరిమల్లె పువ్వల్లె నవ్వు… చిరకాలముండాలి నీ నవ్వు … ” అని బాలు గాఉ పాడిన పాట, అందులో మధ్య మధ్యలో జానకి గారి నవ్వు ఇప్పటికీ గుర్తుంది పోయింది. ” నవ్వవే నా చెలి ..” అంటూ కృష్ణ పాడినా , “నవ్వాలి అలా అలా నవ్వాలి ఆ నవ్వులోని వెన్నెలన్నీ నా జీవితాన విరబూయాలి ” అని ఇంకొకరు పాడినా .. నవ్వుకున్న విలువెంతో తెలిసిపోతుంది

ఇక పోతే నవ్వులన్నీ ఒకేలా వుండవు చిరునవ్వు అట్టహాసం మందహాసం లాగ విషపు నవ్వు , ఏడవలేక నవ్వు, వెకిలి నవ్వు, wry smile ఇలా ఎన్నో రకాలు.. ఈ రకాల నవ్వులెమిటో తెలుసుకోవాలంటే, మా క్లాస్మేట్ స్వర్ణ ఇటీవల కొరియోగ్రాఫ్ చేసిన “సరదాగా కాసేపు” చిత్రం లోని “మల్లె నవ్వు .. బుల్లి నవ్వు ..” అనే పాట చూడాల్సిందే.

కాబట్టి జనులారా చెప్పొచ్చే దేమిటంటే “మడిసన్నాక కూసింత కలాపోసన ఎంత అవసరమో ” నవ్వటం కూడా అంతే ముఖ్యం, ఆరోగ్యం కూడా,, కాబట్టి నవ్వి చూడు డూడ్ పోయేదే ముంది … మహా అయితే నీ ముఖ విలువ పెరుగుతుంది

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

2 Responses to నవ్వి చూడు…. డూడ్

  1. vanajavanamali says:

    very nice, చాలా కాలం తర్వాత మీ బ్లాగ్ లో పోస్ట్ చూడటం ఆనందంగా ఉంది . ఈ పోస్ట్ చూసాక నవ్వులు విరియాలి. తప్పదు 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s