కొన్ని పాటలంతే… అవి ఎప్పటికీ వెంటాడుతూనే వుంటాయి

ఆ పాట 1970 దశకంలో మొదటి సారి విన్నప్పుడు యిట్టె నచ్చేసింది. ఆ క్రెడిట్ అంతా ఆ ట్యూన్ కట్టిన ఆర్. డీ బర్మన్ కె చెందాలి ఎందుకంటే అది హిందీ పాట కాబట్టి అప్పట్లో నాకు హిందీ రాదు కాబట్టి. ఎప్పుడు ఆ పాట విన్నా అందులో ఏదో అద్భుతమైన ప్రేమ భావన వినపడేది నాకు. ఆ పాట అంత చక్కగా పాడిన లతా, కిషోర్ లకి సెకండ్ క్రెడిట్ దక్కాలి.

హిందీ అర్థమయ్యే కొద్దీ ఆ పాట సాహిత్యం అర్థమవ్వ సాగింది . గుల్జార్ రాసిన ఆ పాటలోని అందమైన భావం ఆ పాట ని మరింత ఇష్ట పడేట్లు చేసింది. ఎందుకో ఆ చిత్రాన్ని (ఇప్పటికీ) పూర్తిగా చూడ లేదు. ఈ పాట మాత్రం టీవీ లో ఎప్పుడు వచ్చినా చిత్తరువై చూస్తుంటాను ఇప్పటికీ. దృశ్య రూపం లో కనపడే సంజీవ్ కుమార్, సుచిత్ర సేన్ లను చూసాక ఈ పాటకి, ఆ పాటలోని భావ ప్రకటనకి వీరిద్దరినీ మించి ఇంకెవరూ న్యాయం చేయలేరని పించింది. ముఖ్యంగా ఈ పాట మధ్యలో వారిద్దరి మధ్యన వచ్చే సంభాషణ చాల హృద్యంగా వుంటుంది. “అమావాస్య సాధారణంగా పదిహేను రోజుల వరకూ వుంటుంది … ఈ సారెందుకో చాలా కాలం వుండి పోయింది” అని సంజీవ్ కుమార్ ( ఈ మాటలు సంజీవ్ కుమార్ గద్గద స్వరంలో పలికే తీరు అనితర సాధ్యం) అంటే “తొమ్మిది సంవత్సరాలు చాల కాలం కదూ…” అని అతడి మాటల లోని అంతరార్థాన్ని ఆమె గ్రహించి అడగటం ఓ హైలైట్

ఆ పాట ఆంధీ చిత్రం లోనిది “తేరే బినా జిందగీ సే కోయి శిక్ వా నహి…” అన్న పాట.. కొన్ని పాటలంతే… అవి ఎప్పటికీ వెంటాడుతూనే వుంటాయి

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

4 Responses to కొన్ని పాటలంతే… అవి ఎప్పటికీ వెంటాడుతూనే వుంటాయి

  1. vanajavanamali says:

    ఎందుకు అసలు ఈ పాటంటే మీకు ఇష్టం .. ? చెప్పాల్సిన్దేనండీ ! నాకు మాత్రం ఈ పాటంటే చాలా ఇష్టం . ఇదిగో ఇక్కడ చూసేయండి మరి . 🙂
    http://vanajavanamali.blogspot.in/2012/09/tere-bina-zindagi.html

    • mhsgreamspet says:

      ఎందుకు ఇష్టం అంటే నిజంగా సమాధానం లేదండీ. మీ టపా చాల బాగా రాసారు. ఆ పాట మీకు కూడా ఇష్టమే అని తెలిసి ఆశ్చర్యపోవటం లేదు. మీ పాటలు అన్నీ మాకు నచ్చేవే

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s