మనం భవిష్యత్తులో జీవిస్తున్నామా?

గత పదేళ్లుగా చూస్తే, సాంకేతికత మన జీవన చిత్రాన్ని అధిక మోతాదులో ప్రభావితం చేసింది. ఈ పదేళ్ళలోనే (2004 లో) సోషల్ నెట్వర్కింగ్ కి అంకురార్పణ ఏర్పడింది. ఇప్పుడు ముఖచిత్రం లో లేని వాళ్ళను వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు (ప్రపంచంలో ప్రతి ఏడూ మంది లో ఒకరికి ముఖ చిత్రం లో అకౌంటు ఉందట) ఈ పదేళ్ళలోనే మొబైల్ ఫోనన్నది luxury నుండి necessity గా మారిపోయింది.  ఈ పదేళ్ళలోనే ఏదైనా కొనాలన్నా, ఏదైనా విషయాన్ని శొధించాలన్నా  అంతర్జాలం మీద ఆధారపడటం పరిపాటి అయిపొయింది. ఇవన్నీ మంచి ఆవిష్కరణలైనా, వాటి దురుపయోగం, అవి మన జీవితాల్ని శాసిస్తున్న తీరు చూస్తుంటే,  వాటిని సదుపయోగం  చేసుకోవటం లేదనిపిస్తుంది.

ఇక్కడ కొంచం గణితం లోకి వెళదాం. కాలాన్ని x  axis మీద, సాంకేతికత లో అభివృద్దిని y  axis పై  గీస్తే, గత పదేళ్ళ ముందు వరకు సమతుల్యత (అంటే ఒక స్థిరమైన వృద్ది తో) పెరుగుతూ ఉండొచ్చు. కాని గత పదేళ్లుగా చూస్తుంటే, ఈ సమతుల్యత దెబ్బ తిన్నదనే చెప్పాలి. ఎందుకంటే సాంకేతికత లో వృద్ది exponential రేట్ లో రాకెట్లా దూసుకెళుతూ  వుంది. కాని మనిషి లోని పరిపక్వత ఈ వృద్ధిని సరైన దిశలో వాడుకొనే స్థాయిలో లేదనిపిస్తుంది. ఎందుకంటే రెండో తరగతి చదివే పిల్లాడి నుండి కాలెజికెళ్ళే కుర్రాళ్ళ దాక  ఈమెయిలు ,ఇతర సామాజిక నెట్వర్కింగ్ అకౌంట్లు, మోబైళ్ళు వుండటం ఇపుడు వింత గా అనిపించటం లేదు. కాని వాటిని సరైన దిశలో వాడుకొనే పరిపక్వత వారిలో ఎంత వరకూ ఉందీ అన్నది సందేహమే. దానితో ఎంత సమయం వృధా అవుతున్నదీ, థింకింగ్ ఎబిలిటీ ఎంత తగ్గుతున్నదీ ఆలోచించాల్సిన అంశమే. ఈ మధ్య ఓ స్కూలు యాజమాన్యం వారి విద్యార్థుల పేరెంట్స్ కి చెప్పారట … తమ పిల్లలకి కనీసం పదవ తరగతి దాకైనా సామాజిక నెట్వర్కింగ్ అకౌంట్లు వాడనివ్వొద్దని. It highlights the gravity of the situation.

కాలేజి రోజుల్లో వారానికో సినిమా టీ వీ లో వచ్చేది. అది ఎంత పాతదైనా, ఇష్టం లేనిదైనా ఆ మూడు గంటలూ లీనమై చూసే వాళ్ళం. అందులో ఎంతో సంతృప్తి.. కాని ఇప్పుడు రోజంతా సినిమాలు చూడ గలిగే వీలున్నా ఆనాటి తృప్తి లేదు.. అప్పట్లో వారానికి  రెండు  సార్లు ప్రసారమయ్యే  పదిహేను నిమిషాలు వచ్చే చిత్ర లహరి అన్నా, వారానికోసారి వచ్చే బినాకా గీత మాలా అన్న ఎంతో ఆసక్తితో ఎదురు చూసే వాళ్ళం. ఆ జీవితంలో ఓ completeness ఉండేది.. కాని ఇప్పుడున్నవన్నీ అసంపూర్ణ క్షణాలు..

అప్పట్లో ఫోన్ కాల్ ఎంతో అపురూపం. ఇపుడు మేడ మీద ఉన్న వాళ్ళతో మాట్లాడాలన్నా ఫోనే శరణ్యం. ఫోన్ చేస్తే తీయలేదని ఒకరి అలక… ఎస్ ఎం ఎస్ లు, ఫోన్ కాల్సూ వద్దన్నా పంపించే వారి బెడద, నిద్ర లో ఉన్నా, మీటింగ్ లో ఉన్నా, ఇంకే ముఖ్యమైన పనిలో ఉన్నా మనసులో అసంకల్పితంగా ఫోన్ కాల్ వస్తుందేమోనని ఎదురు చూపులు… మానవ సంబంధాలలో మలినాలు.. అన్య మనస్కత..

అందుకే అనిపిస్తుంటుంది సాంకేతికత మన అవసరాలు తీర్చాలి కాని, సాంకేతికత ఉంది కాబట్టి మన అవసరాలు మారకూడదు అని. ఒక వేళ సాంకేతికత అనివార్యమైనా అది సరైన దిశలో ఉపయోగించే పరిపక్వత అయినా మనలో ఉండాలి.   బహుశా ఇపుడు ఉన్న సాంకేతికత ఇంకో పదేళ్ళ తరవాత వస్తే బాగుండేదేమో. అందుకే అంటాను
Are we living in the future?

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s